Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.⁠

వాఁడితూపు లొడల వడి నాఁటుటయు [1]నేపు
తోడ పరుషరోషధూమకేతుఁ
డతిశయిల్ల రాఘవానుజుం డురుచాప
శింజినీరవంబు సెలఁగఁ గదిసి.

⁠ 134

ఇంద్రజిత్తు లక్ష్మణునిచేతఁ జచ్చుట

మ.⁠

శితభల్లద్వితయమునం గడు వెసం జేదోయి ఖండించి, ఖం
డితగోత్రాచలతుంగశృంగశతకోటిస్ఫారఘోరానల
ద్యుతిసాంద్రం బగు శాతభల్ల మొకటం ద్రుంచెం గనత్కుండలా
న్విత మై యొప్పు నిశాచరేంద్రుశిరమున్ వీరక్రియాదక్షుఁ డై.

⁠ 135


ఆ.⁠

భగ్నశాఖ మైన పాదపంబును బోలె
నిట్లు సంగరమున నింద్రజిత్తు
పడినఁ జూచి దైత్యబలములు భయ మంది
పఱచెఁ; జెలఁగి యార్చెఁ బ్లవగబలము.

⁠ 136


క.⁠

తనయునిమరణం బేర్పడ
విని దశకంధరుఁడు శోకవివశుం డై బో
రన బాష్పము లొలుకఁగ హా
యనుచుఁ బదినోళ్ళుఁ దెఱచి యఱచెం బెలుచన్.

⁠ 137


క.⁠

శోకంబు సైఁపలేక, య
శోకవనంబునకు నరిగి సురశత్రుఁడు రో
షాకులుఁ డై జానకిఁ బు
ణ్యాకారం జంపఁ జంద్రహాసము వెఱికెన్.

⁠ 138


వ.⁠

అప్పుడు వయోవినయవృద్ధుం డైన యవింధ్యుం డతని వారించి యి ట్లనియె.

⁠ 139


చ.⁠

“ఇది దగునే? దశానన! మహేంద్రుఁడు లో నగు దేవతాతతిం
గదనములో జయించి త్రిజగంబులఁ బేర్కొని యున్న నీకు ని
మ్ముదిత వధింతు నంట గడు మోసము గాదొకొ? యోపుదేని నే
పొదవఁగ రాఘవున్ [2]గెలువు; ముగ్మలిఁ జంపినఁ బెంపు గల్గునే?”

⁠ 140


వ.⁠

అనినం దద్వచనంబుల నుపశమితరోషుం డయి దోషాచరేశ్వరుండు సమర
సన్నాహం బమర రథం బెక్కి మిక్కిలి బీరంబు సొంపాగ నఖిలసేనాసహితంబు
గాఁ బురంబు వెల్వడి నడతెంచె నంత.

⁠ 141


శా.⁠

సుగ్రీవాది సమస్తవానరులుఁ బ్రస్ఫూర్జన్మహావిగ్ర
హవ్యగ్రాకారతఁ బేర్చి, భూరుహశిలావ్రాతంబులం దాల్చి, వా
లాగ్రవ్యాచనంబు లొప్ప, దశకంఠాగ్రేసరోదగ్ర దై
త్యగ్రామంబు నెదిర్చినన్ సమర మత్యంతోగ్ర మయ్యెన్ వడిన్.

⁠ 142


వ.⁠

ఆసమయంబున నఖిలమాయాకుశలుం డైన దశముఖుండు మాయ గావించిన.

⁠ 143


క.⁠

ఆరావణుదేహంబున
ఘోరగదాశక్తిఖడ్గకోదండధరుల్
వీరులు సహస్రసంఖ్యల
వారలు జనియించి రసురవరు లుద్ధతు లై.

⁠ 144


వ.⁠

వారి నందఱఁ గౌసల్యానందనుండు సాంద్రశరజాలంబుల నవలీలం దునిమి
తూఁటాడిన, నమ్మేటిరక్కసుండు మఱియు నొక్కమాయ ప్రయోగించి రామ
లక్ష్మణప్రతిరూపంబు లనేకంబు లుత్పాదించుటయు, నయ్యన్నయుం దమ్ముండు
ను వెఱుఁగుపడియునుం జిడిముడి పడక, యమ్మాయారూపంబు లన్నియుం దునిమి

⁠
  1. ↑ నొచ్చి, తోన కలుషరోష...సెలఁగఁ గవిసి
  2. ↑ గెలుము యుగ్మలి