Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ల్లను మ్రోయ మత్తగజముం
గనిన మృగేంద్రుండపోలెఁ గడఁగెం బెలుచన్.

⁠ 116


వ.⁠

అంత.

⁠ 117


ఉ.⁠

జైత్రులు, గోత్రభూమిధరసారులు, [1]సాగరధీరు, లుల్లస
చ్చిత్రధనుఃకళావిదు, లజేయులు, భూరిజయార్థు లప్డు సౌ
మిత్రియు మేఘనాదుఁడు నమిత్రవిభేదులు దాఁకి రార్చి లో
కత్రయభీకరప్రథనకౌతుకవేగితచిత్తవృత్తు లై.

⁠ 118


క.⁠

మచ్చరము మీఱ నొండొరుఁ
జిచ్చఱపిడుగులనుబోని శితవిశిఖములం
జెచ్చెర [2]బోరఁగ విలునే
ర్పచ్చటఁ దుల్యంబు లయ్యె నయ్యిద్దఱకున్.

⁠ 119


క.⁠

తనకంటె నపుడు రావణ
తనయుండని మీఱఁ [3]జూచుఁ; దా నాతనికం
టెను మున్న రాఘవానుజుఁ
డనుపమశరలీల నతిశయంబుగ మెఱయున్.

⁠ 120


క.⁠

అంతఁ బటుతోమరంబుల
నెంతయు వెస నృపతనూజ నింద్రజి వైవన్
సంతతశరముల నన్నిటి
నింతింతలు శకలములుగ నేసి నతండున్.

⁠ 121


వ.⁠

అట్టియెడ నంగదుండు గడంగి లక్ష్మణునకుం దలకడచి, యమందవేగంబున
మందోదరీనందనుం గవిసి, ఘనమహీరుహంబునఁ దన్మస్తకంబు వ్రేసినం జలిం
పక నిలింపపతివైరి నిశితప్రాసంబు వాసవపౌత్త్రుం జంప నెత్తుటయు, లక్ష్మణుండు
దానిం దునియు నేసిన, నయ్యసురయు గదాదండంబుఁ నేర్చి [4]యంగదువక్షం
బు వ్రేసినం, దొలంగక చెలంగి వాలిసూనుండు సాలవృక్షంబున నారాక్షసు
రథంబు రథ్యసారథిసహితంబుగాఁ జదియ నడిచె; నట్లు విరథుండయి యచ్చో
టన యంతర్థానంబు నొంది గగనగతుం డయ్యెఁ; బదంపడి.

⁠ 122


క.⁠

ఎవ్వలన నుఱుకునో యతఁ!
డెవ్వరి నెటు సేయు నొక్కొ! యిం దనుచుఁ గడున్
నివ్వెఱ పడి కపిసేనలు
గ్రొవ్వు సెడం బంక్తివదనుకొడు కుద్దతుఁ డై.

⁠ 123


చ.⁠

ఉఱుముచు [5]నంత్యకాలచరితోగ్రబలాహకలీల దోఁపఁగా
దఱచగు ఘోరపుం బిడుగుఁదండము వోని శరప్రతాన ము
క్కఱఁ దొరఁగించుచుం, గపిబలావళిఁ ద్రుంచి కలంచె నేపునన్;
నెఱఁకులు నొంచి బాణమయనీరధి ముంచె రఘుప్రవీరులన్.

⁠ 124


క.⁠

మాయాధికు నంతర్హిత
కాయుఁ, బురందరవిరోధిఁ గాకుత్స్థులు క్రో
ధాయత్తులగుచు నేసిరి
ధీయుక్తులు శబ్దభేదిదివ్యాస్త్రములన్.

⁠ 125


వ.⁠

వానికి నలిగి సుగ్రీవాదివానరులు వృక్షశిలాప్రకరంబులు గైకొని యాకసంబు
న కెగసిన నద్దానవుండు వారినందఱ వెఱచఱవ నేయుటయుఁ, జేవ సెడి మగిడి
పుడమి కెఱఁగిరి; వాఁ డంత నిలువక వాఁడితూపులు వఱసి రామలక్ష్మణులఁ
గరంబు నొప్పించినం, జె య్వేది యయ్యన్నయుం దమ్ముండును గపిబలంబు

⁠
  1. ↑ వార్ధిగభీరు
  2. ↑ నొంపగ...దుల్యంబ యయ్యె
  3. ↑ జూచి తా
  4. ↑ అంగదు సవ్యపార్శ్వంబున వక్షంబు
  5. ↑ నంతకాలచలితోగ్ర...దండముఁ బోని...ద్రుంచి...నెఱకిలి నొంచి