| స్రగ్ధర. |
లంకాలుంటాకుఁ డుద్యల్లఘుతరగమనోల్లసి యై డాసి, వీఁకం
బొంకం బేపారఁ జంచద్భుజరచితమహాభూరుహం బెత్తి వ్రేసెం
గింకన్ ధూమ్రాక్షు; వాఁడుం గెడసెను వదనో[1]ద్గీర్ణకీలాలధారా
పంకప్రాగ్భాగమగ్నాపఘనవిఘటితప్రాణుఁ డై యాహవోర్విన్.
| 91
|
| వ. |
ఇత్తెఱంగున ధూమ్రాక్షుండు దెగినపిదపఁ గపివరసైనికు లార్చి హనుమంతుని
ననేకభంగులం బ్రస్తుతించుచు; రజనిచరులం గనుకనిం దోలినం దూలి, యంద
ఱుం బఱచి పురంబు సొచ్చి దనుజేంద్రునకుం బ్రహస్తధూమ్రాక్షులమరణప్రకా
రంబు లెఱింగించినఁ బ్రకటబాష్పనిశ్వాసవివర్ణవదనుం డగుచుఁ బంక్తివదనుండు.
| 92
|
| క. |
“కలవా రెల్లను మడిసిరి;
కలిగియు [2]లేఁ డయ్యెఁ గుంభకర్ణుఁడు; వీనిం
దెలుపుదునొ? యేనుఁ, గొడుకుం
జల మెడపక రిపులతోడ సరిఁ బెనఁగుదునో?”
| 93
|
| వ. |
అని వితర్కించి యప్పటికిఁ గుంభకర్ణప్రబోధంబు గార్యంబుగా నిశ్చయించి
తదీయశయ్యాగృహంబునకుం జని, వానిం దెలుపం బరిజనంబులం బనిచిన.
| 94
|
| సీ. |
భేరీమృదంగగంభీరనాదంబులుఁ,
గాహళఘంటికాకలకలములు;
దారుణసింహనాదంబులు నొనరింప
గడుఁ బెద్దవడికి నంగము గదల్చి
యొదిలికి కను విచ్చి, హూ యని బి ట్టావు
లించి, కొండొక దేఱి, లేచి [3]నీల్గి,
కలయుఁ జూచుటయును, గట్టెదురన యున్న
యన్న నవ్వుచుఁ దనయనుఁగుదమ్ము
|
|
| ఆ. |
జూచి యనియె “నిట్టి చోద్యంపునిద్రలుఁ
గలవె యేరికిని జగంబులోన
నెవ్వ రేమి యైరో యెఱుఁగవు; ధన్యుఁడ
వీవు; మనకు నైన యెడరు వినవె.
| 95
|
| వ. |
దశరథనందనుం డైన రాముండు నాచేత నపహృతభార్యుం డై కలుషించి, య
నేకవానరయూధంబులం గూర్చుకొని వచ్చి, వనధి బంధించి, మన వీటిపై విడిసి,
మమ్మెల్లను నేలకుం గోలకుం దెచ్చుచున్నవాఁడు; ప్రహస్తాదివీరులు వానిచే
తం బెక్కండ్రు సిక్కిరి; నీవకాక వాని జయింప నన్యుండు శక్తుండు గాఁడు;
గావున లెమ్ము గ్రక్కునం బగతుపై నడచి పొడిచి గెలువుము; దూషణానుజులు
వజ్రవేగప్రమాథులు నీకుం దోడ్పడి యెద” రనిన “నట్ల కాక” యని కుంభకర్ణుం
డు విహితపరికరబంధుం డై సమరసన్నద్ధులైన పరిజనంబులతోడం గూడి వెల్వ
డి నడతెంచిన.
| 96
|
కుంభకర్ణుండు యుద్ధము సేయుట
| లయగ్రాహి. |
దారుణదవానలశిఖారుణశిరోరుహు, గ
భీరఘనకర్బురశరీరుఁ, బటురోష
క్రూరనయనాంతగళితోరుతవహ్నికణ
ఘోరముఖు, దంతవలయారభసదంశో
ద్గారిరుధిరాధరు, నుదారభుజసారణవి
దూరితదిగంతుఁ, బదభారవినమద్భూ
భారుఁ, ద్రిజగద్విజయభూరిబలు, నద్దనుజ
వీరుఁ గని రచ్చెరువు గూరఁ గపివీరుల్.
| 97
|
| క. |
రక్కసుఁడును దనమదిలో
నక్కపి[4]వీరులను జీరికైనఁ గొనక పే
|
|
- ↑ త్కీర్ణకీలాల...ప్రాగ్భార
- ↑ లేక యగుఁ గుంభ
- ↑ నిల్చి...యెఱుఁగవు ధన్యుఁడ, వీవ మనకు
- ↑ సైన్యంబుఁ