Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

వ్వీరుల మాయయుం జలము వ్రేల్మిడిలోఁ గుదియించి, వీరకే
ళీరసికుండు వారి నవలీలమెయిం దునుమాడె నందఱన్.

⁠ 71


క.⁠

అతని శరపాతంబుల
చేతం గడు నొచ్చి దైత్యసేన నగము ధా
త్రీతలపతితం బయ్యె; వి
భీతిఁ బఱచి పురము సొచ్చెఁ బెఱసగము వెసన్.

⁠ 72


క.⁠

అది యెల్ల విని దశాననుఁ
డుదితక్రోధుఁ డయి మంత్రియుతముగ వెడలెన్
మదగజఘోటకసైనిక
పదభర[1]భగ్నావనీవిభాగుం డగుచున్.

⁠ 73


వ.⁠

ఇట్లు వెడలి యభేద్యం బగు నౌశనసవ్యూహంబు సంఘటించి వనచరబలంబుప
యి నడచినం గని రాఘవుండును బార్హస్పత్యవ్యూహంబు దీర్చి పేర్చి యెదురు
కొనియె; నా సేనలు రెండు నకాండక్షుభితసాగరయుగళంబుతెఱంగు దోఁప
నొండొంటిం గవిసె; నప్పుడు రాముండు రావణుతోడం దలపడియె; లక్ష్మణుం
డింద్రజిత్తును, సుగ్రీవుండు విరూపాక్షునిఁ, దారుండు నిఖర్వటుం దాఁకి; రిట్లురు
వాఁగునకును దేవాసురులకుంబోలె నాభీలసమరం బయ్యెనందు.

⁠ 74


క.⁠

సౌమిత్రి నిశితవిశిఖ
స్తోమంబుల నసురపతిసుతుం బొదివెను; సం
గ్రామమునకుఁ దొలఁగక యతఁ
డామనుజోత్తముని ముంచె నాశుగవృష్టిన్.

⁠ 75


ఉత్సాహము.⁠

అమరవైరివిభుఁడు, దశరథాగ్రసుతుఁడు నేపునన్
సమరసత్ప్రతాపకోపజాల్వలచ్ఛరీరు లై
తుములబాణపటలవృష్టిఁ దొప్పదోఁగి, యిర్వురుం
దమక మేది, తమక తమక తనిసి రాహవంబునన్.

⁠ 76


వ.⁠

తదనంతరంబ.

⁠ 77


క.⁠

ఆరావణుండు నిజదో
స్సారంబున రాముబాహుసారం బతిదు
ర్వారం బగు టేర్పడఁ గని
వీరారంభంబు కడఁక విడిచి రయమునన్.

⁠ 78


క.⁠

మగిడి నగరంబు సొచ్చిన
బెగడి నిశాచరబలంబు పెల్లగిలుటయున్,
విగతభయుండు ప్రహస్తుఁడు
దగఁ గో ల్తల సేసె నత్యుదగ్రస్ఫురణన్.

⁠ 79


ఉ.⁠

ఆతనిఁ గాంచి తద్బలము లన్నియుఁ గ్రమ్మఱ నాహవోత్సవ
స్ఫీతము లై కడంగుటయుఁ ,బేర్చి విభీషణుఁ డుగ్రవానర
వ్రాతసమన్వితంబుగ నవారణ మార్కొనినన్ మహారణం
బాతత మయ్యె సైన్యనివహంబులు రెంటికి నద్భుతంబుగన్.

⁠ 80


వ.⁠

అంత.

⁠ 81

ప్రహస్తధూమ్రాక్షులయుద్ధము

మ.⁠

కృతహస్తుండు, ప్రహస్తుఁ, డాహవకళాకేళీవిదగ్ధుండు, ద
ర్పితుఁ డై తాఁకె విభీషణుం గడఁక మై; బెంపారి వారిద్దఱున్
శిత[2]భవ్యోగ్రమయూరపత్రవిశిఖశ్రేణీశతచ్ఛన్ను లై

⁠
  1. ↑ భుగ్నావ
  2. ↑ శల్యోగ్ర; శౌర్యోగ్ర