Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

[1]భూనాథునకుఁ దనపోయివచ్చిన తెఱంగు విన్నవించెం; దదనంతరంబ రాఘవు
ననుమతంబున.

⁠ 63


మత్తకోకిలము.⁠

తాలసాలశిలాగ్రహస్తు, లుదగ్రగోత్రమహీధరో
త్తాలదేహు, లనేకవర్ణులు, దార్తాఖిలదిఙ్ముఖా
భీలవాలశిఖాగ్రు, లుగ్రగభీరసత్త్వులు, వానరుల్,
కాలకల్పులు పేర్చి [2]సంతన కట్టి రాహవకేళికిన్.

⁠ 64


క.⁠

పరువడి మొత్తము లై బం
ధురఘోషం బెసఁగఁ బొంగి తోఁతెంచు హరీ
శ్వరబలమునందు ఘనసా
గరవీచివికాస[3]రేఖ గానఁగ నయ్యెన్.

⁠ 65


మత్తకోకిలము.⁠

కోటఁ బన్నిన ఘోరదానవకోటిఁ జుల్కనఁ దోలి, య
క్కోట [4]నల్గడలన్ మహోగ్రతఁ గూలఁద్రోచి, సమున్నమ
త్కూటతోరణయంత్రకేతనగోపురాట్టకసంహతుల్
వీటతాటము సేసి రక్కపివీరు లొక్కట మాత్రలోన్.

⁠ 66


వ.⁠

మఱియుఁ బ్రాకారంబుపై నున్న గదాపరిఘకుంతప్రముఖంబులు గైకొని
లంకామధ్యంబున వైవం దొడంగిన నాబాలవృద్ధంబగు పౌరలోకంబు హాహా
కారవ్యాకులం బై కలఁగంబడియె; నంత రావణచోదితులైన దానవులు నానా
కోటిసహస్రసంఖ్య తరిగి యెక్క డెక్కడ యని తలపడి [5]కపిసముదయంబులం
దోలి యెప్పటియట్ల ప్రాకారంబులు గైకొని నిల్చి; రప్పుడు.

⁠ 67


క.⁠

మును మర్కటబలములచే
ననయంబును గపిలవర్ణ మైనది మగుడన్
దనుజబలసంవృతం బై
ఘనపటలచ్ఛాయఁ గోట [6]కర మొప్పారెన్.

⁠ 68


క.⁠

వనచరసేనలు దెరలిన
నినవంశోత్తములు నృపతు లిద్దఱుఁ గయ్య
మ్మునకుఁ గడంగుటఁ గ్రమ్మఱ
గొనకొని కపిసేన యెల్లఁ గోటకుఁ గవిసెన్.

⁠ 69


వ.⁠

ఇట్లు గవిసినం బ్రాకారరక్షకు లైనరాక్షసవీరులు వారలం జేరనీక, శిలాశూల
పరశు[7]తోమరాలాతశరకుంతప్రముఖంబులు ప్రయోగించినం గయికొనక, వనచ
రులు వృక్షశిలాప్రకరంబులు వఱగించుచుం గడంగి ప్రాకారంబుఁ బ్రాఁకుటయు,
నయ్యిరుదెఱంగులవారికిం గేశాకేశి యగు సమరం బయ్యెఁ; బదంపడి రావణుం
డు వనుపఁ బర్వతుండును, బ్రఘనుండును, ఖరుండును, గ్రోధవశుండును, బ్రరుజుం
డును నను రాక్షసు లేవు రనేక[8]రాక్షసపిశాచసేనాపరివృతు లయి పురంబు వెలు
వడి మాయ గావించి, యదృశ్యాకారు లై కపిసైన్యంబు నొప్పింపం దొడంగినం గని.

⁠ 70


ఉ.⁠

దారుణవిక్రముండు, రిపుదర్పవిభేది, మహాస్త్రవేది, మా
యారణకోవిదుండు, గడు నల్గి విభీషణుఁ డేగుదెంచి, య

⁠
  1. ↑ భూనాథునిం గని తన
  2. ↑ సంతస
  3. ↑ పంక్తి
  4. ↑ యెల్లెడలున్...గూలఁ దాచి...లొక్కొకమాత్రలోన్
  5. ↑ తరుచరసముదయంబులం
  6. ↑ గడు నొప్పారెన్
  7. ↑ తోమరాలాతప్రముఖంబులు
  8. ↑ రాక్షససేనాపరివృతులై