Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బనియును, రామలక్ష్మణుల తేజోమూర్తివిశేషంబులును నెఱింగించిన, నతండు
దాని సరకు సేయక సమరంబునకు [1]మోహరించి.

⁠ 56


సీ.⁠

బద్ధశిలాయంత్రబహుళ మై, [2]యుత్తాలి
                 తాట్టాలకాభీల మై, యుదగ్ర
కేతుపతాకాప్రకీర్ణ మై, తోమర
                 ముద్గరాలాతకముసలశూల
శరశతఘ్నీముఖసాధనోపేత మై,
                 యుగ్రవిగ్రహధీరయోధవీర
సంకులం బై, హయస్యందనవేదండ
                 చండ మై, సముదితసప్తసాల

⁠


ఆ.⁠

మై, యలంఘ్యపరిఖ మై, తృణకాష్ఠజ
లాదివస్తుభరిత మైన లంక
కధికరక్షఁ జేసి యప్రమాదంబున
నుండె రిపుజిగీష నుదితబలుఁడు.

⁠ 57


వ.⁠

ఇట రాఘవుండును సుగ్రీవసహితుం డై యుండి యంగదుం జూచి “నీవు రావణు
పాలికిం జని యతనికిం దగిన తెఱంగున బుద్ధిగాఁ జెప్పి జానకి విడుచుట మే లని
చెప్పు” మని పనిచినం బని పూని యవ్వీరుండు.

⁠ 58


శా.⁠

లంకాద్వారము దుర్నివార[3]ముగ నుల్లాసంబునం జొచ్చి, ని
శ్శంకుం డై సురశత్రుసైనికసహస్రంబుల్ దనుంజూచి యా
శంకం బొందఁగ లీలమైఁ జని, సుహృత్సంఘంబు గొల్వన్ నిరా
తంకుం డై కొలువున్న దైత్యుఁ గని, యుద్యన్మూర్తియై యి ట్లనున్.

⁠ 59

అంగదురాయబారము

క.⁠

“ఇనకులతిలకుఁడు, బాణా
సనవిద్యాగురుఁడు, రామచంద్రుఁడు నీతో
నను ని ట్లనుమని పనిచెను;
వినుము తదీయోక్తిభంగి విస్పష్టముగన్.

⁠ 60


సీ.⁠

అనపరాధుల గాననాంతరమ్మున నున్న
                 పేదతాపసులఁ జంపితి పలువుర;
నమరుల [4]యిల్లాండ్ర నఱిముఱి జెఱవట్టి
                 యఖిలలోకములకు నలఁత సేసి;
తిది యెల్ల నొకతల, యేపు మీఱఁగ నన్నుఁ
                 జెనకుట యొక తల సెప్పనేల?
బలిమియొప్పఁగ మంచిబంటవై వెడలుము
                 కయ్యంబునకు; నట్లుగాకయున్న

⁠


ఆ.⁠

శరణుఁ జొచ్చి నాకుజానకి నొప్పింపు
మొండువెంట బ్రతికి యుండఁ దీఱ;
దస్మదుగ్రశరశతాశీవిషంబుల
కెరయ నీదుప్రాణ; మింతనిజము.

⁠ 61


క.⁠

మనుజుండ నైన నాతెఱఁ
గనుమానము వాయఁ జూడు మాహవభూమిన్;
విను రాక్షసులను నామం
బును నడఁపక యేను రిత్తవో [5]నిచ్చెదనే.”

⁠ 62


వ.⁠

అని పలుకుచున్న యంగదు పరుషభాషణంబులకు రోషించిన యసురపతి కన్నె
ఱింగి, నలువురు రక్కసులు గ్రక్కున నవ్వాలినందనుం [6]బొదివం బట్టిన, బిట్టెగసి
హర్మ్యశిఖరంబుపైకి దాఁటుటయుఁ, దదాక్షేపవేగంబున నన్నిశాచరులు ధరణీత
లంబున జర్జరితశరీరులై పడిరి; హరివీరుం డచ్చటనుండి శిబిరమధ్యంబునకు లంఘించి

⁠
  1. ↑ నుత్సహించి
  2. ↑ యుత్తాలకాట్టాల
  3. ↑ గమనోల్లాసంబు
  4. ↑ యీలుపుటాండ్రను జెఱవట్టి; యిల్లాండ్ర నఱిముఱిఁ దలపట్టి
  5. ↑ నేర్చెదనే
  6. ↑ బట్టిన బెట్టు నెగసి...హరివీరుండు నవరత్నమయం బగుతదీయాస్థానమండపంబున శిఖరంబు రాక్షసనాశహేతుసంభూతమహోల్కయుం బోలెఁ బడఁ దన్ని యాక్షణంబ యచ్చటనుండి