Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

సైన్యంబుతో మహాయుద్ధంబు సేసిన.

⁠ 184


మ.⁠

అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్టశార్
ఙ్గవినిర్ముక్తనిశాతసాయకశతాగ్రచ్ఛిన్న మై దైత్యదా
నవదేహప్రకరంబు వాత[1]విధుతార్ణఃపూర్ణసంఘూర్ణితా
ర్ణవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్తశైలాకృతిన్.

⁠ 185


చ.⁠

ఘనతరదైత్యదానవనికాయకళేబరపాతఘట్టనం
దనరి యుగాంత్యకాలచలితంబును బోలెఁ బయోధి మ్రోసె; న
వ్వనధిరవంబుకంటె ననివారిత మై చెలఁగెన్ మదీయవా
హిని భటసింహనాద హయహేషితసింధురబృంహితధ్వనుల్.

⁠ 186


వ.⁠

అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు
వెండియు సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్ధంబు సేయ సమకట్టి.

⁠ 187


సీ.⁠

పరశు పాశాంకుశ కరవాలశూల ము
                 ద్గరములు నామీఁదఁ దెరలఁ [2]గురిసె;
నేనును గడఁగి యద్దానవుశస్త్రముల్
                 వాయంగఁ జేసితి; మాయఁ జేసి
వెఱవక సాల్వుండు వెండియు నామీఁదఁ
                 బరుషశిలావృష్టిఁ గురిసె; వరుస
నమరఁ దమః ప్రకాశములతో దుర్దిన
                 సుదినశీతోష్ణముల్ గదియఁ జేసి;

⁠


ఆ.⁠

దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర
శతసహస్రవిష్ణుతతులు వెలుఁగ
గగనతలము సేసెఁ బగ లిది రే యిది
యని యెఱుంగనయితి మనములోన.

⁠ 188


క.⁠

మనుజేంద్ర! సర్వమాయా
పనోదనం బయిన యగ్ని బాణంబున న
[3]ద్దనుజవినిర్మితమాయా
వినివర్తనఁ జేసితిని నవిస్మయమతినై.

⁠ 189


వ.⁠

అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుకప్రేషితుం డయి యొక్కరుం డతి
త్వరితగతిం బఱతెంచి “సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె; నీ వెవ్వని
తోడం గయ్యంబు సేసెదు? క్రమ్మఱి చని పురంబు రక్షించుకొను” మనిన విని
యదరిపడి “మహాబలపరాక్రము లయిన బలదేవాదులు రక్షించుకొని యుండ
వసుదేవుఁ డేల పట్టువడు? నిది పోల” దని సంశయించుచు విమనస్కుండ నయి
యుండునంత.

⁠ 190


సీ.⁠

పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికి
                 నేతెంచునట్టి యయాతివోలె
భూణషదీప్తులు వొలియంగ వివృతకే
                 శాంబరు డయి సౌంభకంబువలనఁ
బఱదెంచు వనుదేవుఁ బాపనిశాచర
                 బలపీడ్యమాను దవ్వులన కాంచి
యత్యంతమోహశోకాంధుండ నయిన నా
                 హస్తంబు వలన విస్రస్తమయ్యె

⁠


ఆ.⁠

శార్జ్గ; మప్రియావసన్న దేహుండ నై
యుడిగి రథముమీఁదఁ బడితి నేను;
దానిఁ జూచి భయము దగిలి మత్సైన్యంబు
దల్లడిల్లి [4]యులిసెఁ బెల్లురేఁగి.

⁠ 191
  1. ↑ విహతార్ణః; నిహతార్ణః; విధురాంభః
  2. ↑ కదిసె
  3. ↑ దనుజ విని ... నవిస్తరమతి
  4. ↑ యవిసె