Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జలధీంద్రు నుపాసించి యున్నంత, సముద్రుండు సకలజలచరప్రకరపరివారుం డై
రాఘవునకున బొడసూపి “యయ్యా! నీవలనఁ బ్రీతుండ నైతి; నీ కెయ్యది ప్రియం
బు సేయుదుఁ; జెప్పు” మనిన నతండు “నాకు లంకపై నరుగం దెరు విచ్చునది; యీని
నాఁడు సూర్యనిభంబు లయిన మదీయదివ్యాస్త్రంబుల నిన్ను శోషింపంజేయుదు”
ననిన విని సరిత్పతి రఘుపతి కి ట్లనియె.

⁠ 48


సీ.⁠

“జననాథ నీ కార్యమునకు నే విఘ్నంబు
                 గావింపనోడుదు నేవిధమున
వినుము, నావాక్యంబు; జను లెల్ల నెఱుఁగ నీ
                 కిత్తఱి [1]దెరు విత్తునేని యింక
నిల నెల్లవాఁడును విలసితదివ్యాస్త్ర
                 బలమున సాధింపఁదలఁచు నన్ను
మీయందుఁ గపివీరుఁ, డాయతమతి, విశ్వ
                 కర్మసూనుఁడు శిల్పికర్మవిదుఁడు

⁠


ఆ.⁠

నలుఁడు నాఁగ నొకఁడు గలఁడు; వాఁడొలసి నా
యందుఁ దరులు గిరులు నొందవైవ
నవి ధరింతు నేను దివిరి నీకది సేతు
వుగఁ గడంక నరిగి పగఱ గెలుము.”

⁠ 49


వ.⁠

అని యతని నొడంబఱిచి సముద్రుండు సనుటయు, వమ్మహీపతి నలు రావించి
సేతుబంధనంబు సేయ నియోగించిన, ననేకవానరసహస్రంబులు నలుదిక్కుల
కుం బఱచి గిరిశిఖరంబులుఁ దరునికరంబులు విఱిచి తెచ్చి యిచ్చుచుండ, న
న్నలుండు మున్నీటియందు శతయోజనాయామంబును దశయోజనవిస్తారంబు
నుంగా నతిధృఢంబగు సేతుబంధనంబు నిర్మించె; నయ్యవసరంబున.

⁠ 50


ఆ.⁠

అన్నతోడ [2]నలిగి యాప్తులుఁదాను వి
భీషణుండు వినయభూషణుండు
నెమ్మి నరుగుదెంచి నృపశిరోమణి రాము
శరణుఁ జొచ్చె భక్తిభరితుఁడగుచు.

⁠ 51


క.⁠

ఆరాక్షసవృషభుని యా
కారము నింగితముఁ జూచి కాకుత్స్ధకులో
[3]ద్ధారుఁ డతని నతిధార్మికుఁ
గా రూపించి ముద మొప్పఁ గైకొని కరుణన్.

⁠ 52


ఉ.⁠

వానికి దానవేంద్రువిభవంబు సమస్తము నిచ్చువాఁడు గాఁ
బూని ప్రతిజ్ఞ సేసి, కృతపుణ్యుఁడు లక్ష్మణుతోడి [4]చెల్మియున్
వానికి నిచ్చి, చెచ్చెర నవారితవానరసైన్యయుక్తుఁ డై
వానిఁ బురస్కరించుకొని వారిధి దాఁటె మహోగ్రలీలతోన్.

⁠ 53


వ.⁠

ఇట్లు సేతుమార్గంబున సాగరోత్తరణం బాచరించి, త్రికూటపర్వతం బెక్కి,
లంకానగరంబుచుట్టును శిబిరంబులు సంఘటింపం బంచిన.

⁠ 54


క.⁠

తాలైలాగరు[5]చందన
సాలతమాలామ్రనింబజంబూజంబీ
రాలంకృతలంకావన
జాలంబుల విడిసె వృక్షచరసైన్యంబుల్.

⁠ 55


వ.⁠

తదనంతరంబ రావణచారు లయిన శుకసారణు లనువారలు వానరాకారంబు
లు దాల్చి శిబిరంబునఁ గ్రుమ్మరుచున్న నెఱింగి, విభీషణుం డారాక్షసులం బట్టించి
రామునకు సమర్పించిన, నతండు వారికి నిజసైన్యం బంతయుం జూప నియోగించి
విడిచిపుచ్చుటయుం, జని యయ్యిరువురు నమరవైరిం గని కపిసైన్యంబు దుర్జయం

⁠
  1. ↑ నేఁ దెరు విత్తునేని
  2. ↑ ఁబాసి
  3. ↑ దారుఁ
  4. ↑ బేర్మియున్
  5. ↑ సాలర, సాల