Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

మగుడుచుం, దాఱుచుఁ, బాఱుచుం దిరుగుచు, సురుఁగుచు, మలయుచుఁ బొల
యుచు మత్తిల్లి గిరిగుహలయందును, దరువనంబులయందును, సరిదుపాంతం
బులయందును నానందంబున విహరించుచుండిరి; తదనంతరంబ.

⁠ 40


మ.⁠

ప్రభ నొప్పారి యనుంగుఁదమ్ముఁడు మహాభాగుండు సౌమిత్రి వీ
తభయుం డై కొలువం, గపీంద్రబలసంతానంబుతో నుద్ధతిన్
శుభలగ్నంబున రాఘవుండు గదలెన్ సుగ్రీవసాహాయ్యసం
ప్రభవోత్సాహ మెలర్ప దర్పితరిపుప్రాలేయతిగ్మాంశుఁ డై.

⁠ 41


ఉ.⁠

ఆహరివీరవాహినుల కన్నిటికిన్ మొగ మై, మరుత్సుతుం
డాహవదోహళుం డమరె; నంగద నీల నలాది వీరు లు
త్సాహము మీఱ నయ్యయి దెసం దగుకావలి యై, సమగ్రస
న్నాహమహోగ్రతం జనిరి నాకవిరోధివధాభిలాషులై.

⁠ 42


వ.⁠

ఇట్లు నడచి యెడనెడం బ్రభూతవన్యఫలజలాశయంబు [1]లగు ప్రదేశంబుల విడి
యుచుం, గపిసైన్యంబు గతిపయదినంబులకు దక్షిణోదధితీరంబు సేరి, రెండగు
వారాశియుంబోలె ఘూర్ణిల్లుచుండె; నంత రాఘవుండు రవితనయుం జూచి యి ట్లనియె.

⁠ 43


క.⁠

“మన[2]బల మిది యతిబహుళము;
వనధియును దుస్తరంబు; వానరవర! యి
వ్వననిధిఁ గడచు నుపాయము
మన కొక్కటి నిశ్చయింపుమా తగుబుద్ధిన్.

⁠ 44


తే.⁠

[3]అని విచారించునెడఁ గొంద ఱధిపుఁ జూచి
జడధి బలితంపుఁ దెప్పలఁ గడత మనిరి;
ఘనకలంబులు సమకట్టి కడత మనిరి
కొంద; ఱంతయు విని రఘునందనుండు.

⁠ 45


సీ.⁠

అల్లన నగుచు ని ట్లనియె “మీ చెప్పుటల్
                 దగిన యుపాయంబు నగున; యయిన
నగణితంబైన యీహరిసైన్యములకెల్లఁ
                 గలములుఁ దెప్పలు వలయునన్ని
సమకట్టు టరయ నశక్యంబు, శతయోజ
                 [4]నంబుల పరపైన యంబురాశిఁ
గలములఁ దెప్పలఁ గడుచుచో, రిపుకోటి
                 యెడరునఁ బైఁ బడి పొడువకున్నె?

⁠


ఆ.⁠

యదియుఁగాక యల్పులగు వణిగ్జనముల
యోజ శూరతతికిఁ దేజ మగునె
కాన నాదుమతము గా దివ్విధంబు; నా
మనసు నిశ్చయంబు వినుఁడు మీరు.

⁠ 46


చ.⁠

వ్రతము ధరించి నిష్ఠ నుపవాసవిధిం గొలుతున్ సముద్రు; నా
కితఁడు ప్రియంబుతోడఁ దెరు విచ్చుట యంతన కల్గెనేని మే;
లితరునిఁగా ననుం దలంచెనేని నమానుషరోషవేగదీ
పితశరవహ్ని నిజ్జలముఁ బీల్చెదఁ; బ్రేల్చెద నొక్కవ్రేల్మిడిన్.”

⁠ 47

రాముఁడు దర్భశయనుం డై సముద్రుం బ్రార్థించుట

వ.⁠

అని పలికి దశరథాగ్రసూనుండు దానును దమ్ముండును నుపవసించి, దర్భశయనులై

⁠
  1. ↑ లగుగురుప్రదేశంబుల
  2. ↑ మును నతి...నగుభంగిన్
  3. ↑ అనిన వారు విచారించి యధిపుఁ జూచి
  4. ↑ నాయతంబైనయీయంబురాశిఁ...కాన నాకు...మనము నిశ్చ