శ్రీమదాంధ్రమహాభారతము
ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
| |
కర సోమాన్వయర
త్నాకరహిమధామ! ధార్మికాంచితవినయో
త్సేక! భువనైకవీర! మ
హాకావ్యరసప్రయోజనారూఢమతీ!
| 1
|
రాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకుఁ బంపుట
| వ. |
అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె! నట్లు పరమతపోనిలయుండయిన
మార్కండేయుండు పాండవేయులతో మఱియు ని ట్లనియె “నంత మాల్యవత్కం
దరమందిరుం డైనదశరథాగ్రనందనుండు నవకందళితసుందరంబులును, జనకనం
దినీవియోగదుస్సహంబులు నగుఘనసమయదివసంబుల నెట్టికేనియుం గడిపి,
నిరతిశయసాంద్రచంద్రాతపన్నవనశీతలసమీరవాహ్యమానవినిద్రకుముదకే
దారసౌరభ్యనిర్భరంబులు, నతిదీర్ఘయామంబులు నైనశారదయామిను [1]లపన
యింప[2]నోపక యొక్కనాఁడు దమ్మునిం జూచి యి ట్లనియె.
| 2
|
| సీ. |
“చూచితే లక్ష్మణ! సుగ్రీవుకొఱగామి?
యమ్మెయిఁ దనపగ యడఁచి మనము
కపిరాజ్య మిచ్చినఁ గైకొని, యింద్రియ
సుఖముల నెంతయుఁ జొక్కి, నేఁడు
మనదిక్కు దలపఁడు; మనతోడఁ బల్కిన
సమయంబుఁ జెల్లింపఁ జనదె తనకుఁ?
గడుఁ గృతఘ్నత సేసెఁ గపికులాధముఁడు; నీ
వనఘ కిష్కింధకు నరుగు మిపుడ;
|
|
| ఆ. |
యద్దురాత్ముఁ, గృపణు, నాత్మీయకార్యత
త్పరుని, నధికరాగపరవశాత్ముఁ
దొడరి వాలి చనినత్రోవనే యనిచి ర
మ్మేల తడయ మనకు నింక నిచట?
| 3
|
| ఆ. |
నీవు సనకమున్న నెఱితోడ మనకార్య
మునకుఁ దగినయత్నములు [3]ఘటించి
యుండెనేని, వాని నొండేమియుం జేయ
వలదు; తోడితె మ్మవార్యశౌర్య.”
| 4
|
| చ. |
అనుడుఁ దదాజ్ఞఁ బూని యతఁ డాతతకార్ముకహస్తుఁ డై రయం
బునఁ జనియెం గపీశ్వరునిప్రోలికి; వాఁడును సంభ్రమంబుతో
|
|
- ↑ లు, సైప
- ↑ నేరక
- ↑ వహించి