Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

కమనీయకమలినీకహ్లారదళకేస
                 రాన్వితజలముల నర్ఘ్యవిధియుఁ,
దరళతరంగహస్తములఁ బాద్యంబు, ను
                 న్మదచక్రసారసమధుపహంస
రుతులఁ బ్రియోక్తులు, రుచిరవానీరని
                 వేశనచ్ఛాయల విశ్రమంబు
మందసంచారితమారుతంబుల నురు
                 తాపనోదనమును దగిలి యెపుడు

⁠


ఆ.⁠

నాచరించుచును, సమంచితాతిథిజన
సేవనమునఁ దనదుజీవనంబు
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం
బెదురఁ గాంచి రన్నరేంద్రసుతులు.

⁠ 364


వ.⁠

[1]ఆసరోవరతీరంబునం గౌసల్యానందనుండు దత్తద్విషయవిశేషోల్లాసంబులవలనం
గ్రొత్త యై చిత్తజానలంబు దరికొని, చేతోవృత్తంబు నెరియింపం దొడంగినఁ
దాల్మి దొఱంగి, జానకిం బేర్కొని యాక్రందనవచనవివశుం డగుటయు, నతనికి
లక్ష్మణుం డి ట్లనియె.

⁠ 365


చ.⁠

“పురుషవరేణ్య! యిట్లు మిముఁబోఁటులకుం జనునయ్య యాపదల్
వొరసినచోఁ గలంగుట? ప్రభుత్వ మెలర్పఁగ దాల్మి యూఁది దు
స్తరమానసవ్యథలు దల్గుము; సంభృతపౌరుషుండ వై
యరయుము దేవి యున్నయెడ; యారసి కార్యము దీర్పు[2]నేర్పునన్.

⁠ 366


ఆ.⁠

అధిప! శిష్యుఁడను, సహాయుండ, భృత్యుండ
నైన యేను గల్గ నాత్మ నీకు
నేల వగవ?” నని మహీపతిచిత్తంబు
నలఁత డిందుపఱిచె [3]నవరజుండు.

⁠ 367


వ.⁠

తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం గృతస్నాను లయి దేవపితృ
తర్పణంబులు సేసి చని, ముందట నతిబహుళబలాహకవ్యూహసన్నాహసమున్న
తంబు లైన యభంగోత్తుంగశృంగసముదయంబుల నఖిలగగనక్రోడపీడనంబు
సేయుచున్నదాని ఋశ్యమూకశైలంబుఁ జేరి, తదుప[4]కంఠప్రదేశంబున విశ్ర
మించి యున్నంత.

⁠ 368


సీ.⁠

ఆరాజపుత్త్రుల, నారూఢతేజుల,
                 వీరుల, నున్నతోదారభుజుల
గనుగొని సుగ్రీవుఁ డనఘుఁ డగ్గరిశృంగ
                 ముననుండి తానును దన సచివులుఁ
జింతించి, వారి[5]వృత్తాంతము నెఱుఁగంగ
                 సంతతోత్సాహు, ధీమంతు, శౌర్య
వంతు నుత్తము, హిమవంతుడుఁబోని య
                 త్యంతసుస్థిరు హనుమంతుఁ బనిచె;

⁠


ఆ.⁠

నతఁడు నరిగి నృపతిసుతులతెఱం గెల్ల
నెఱిఁగి, వనచరేంద్రు నెఱుఁగఁజెప్పి
యుగ్రతేజుఁ డైన సుగ్రీవుతోఁ జెల్మి
యొనర సంఘటించె మనుజపతికి.

⁠ 369


వ.⁠

సుగ్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమముందటం బడినం దారు గైకొని
సంగ్రహించి యున్న భూషణనిచయంబు రామునకు నివేదించినం జూచి, యతండు
సముకుత్సుం డై వానికి వానరైశ్వర్యంబు ప్రతి[6]శ్రుతంబు సేసి, తదీయశత్రుం డైన

⁠
  1. ↑ ఇట్లు గాంచి యాసరోనర...దత్తద్వియగాదివిశేషాదివిషయోల్లాసంబువలనం
  2. ↑ మేర్పడన్
  3. ↑ ననుజుఁ డపుడు
  4. ↑ కందరప్రదేశంబున
  5. ↑ వృత్తాంతం బెఱుఁగ వేఁడి
  6. ↑ కృతంబు చేసి