| |
రించి దక్షిణాభిముఖులై చని చని.
| 356
|
| చ. |
ఉరమునయందుఁ గన్నులుఁ బృథూదరదేశమునందు నోరు, బ్ర
స్ఫురితభుజద్వయంబుఁ, గులభూమిధరోన్నతభావముం గరం
బరుదుగ నుగ్ర మైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ
స్మరుఁడగుచున్న వానిఁ బటుసత్త్వుఁ గబంధునిఁ గాంచి రచ్చటన్.
| 357
|
| ఆ. |
అక్కబంధుఁ డామిషార్థి యై లక్ష్మణుఁ
బట్టికొనియె బాహుబల మెలర్ప;
నతఁడు గడువిషణ్ణుఁ డై “యన్న! ననుఁ జూడు”
మనుచు రాముఁ జూచి యనియె మఱియు.
| 358
|
శ్రీరాముఁడు కబంధుఁ డనురాక్షసుం జంపుట
| సీ. |
మహనీయసామ్రాజ్యమహిమ వాయుటయును,
బితృమరణంబు, నాభీలవిపిన
భూములఁ గడుదుఃఖమున జరించుటయు, వై
దేహి గోల్పడి వగఁ దిరుగుటయును,
దుదిఁ బోయి యే నిట్టు దొడరి యీదానవు
వాతఁ జిక్కుటయును వగవ నీకుఁ
బైపయిఁ బెక్కులాపద లయ్యె; నక్కట
ధరణీశ! నీవు నాధరణిసుతయుఁ
|
|
| ఆ. |
గలసి పూజ్యరాజ్యగౌరవంబున వెలుఁ
గంగ నెలమిఁ జూడఁ గాన నైతి;
నేను దలఁప నెట్టి హీనభాగ్యుండనో”
యనుచు ననుజుఁ డార్తి నడలుటయును.
| 359
|
| తే. |
విగతసంభ్రముఁ డై రామవిభుడు గడఁగి
“యన్న లక్ష్మణ! యోడకు మన్న! యేను
గలుగ నీ కేల యాపద గలుగనేర్చు?”
ననుచు గ్రక్కున నశితమహాసి వెఱికి.
| 360
|
| వ. |
ఆరక్కసుఁ డాచేయి దునియ వ్రేసిన లబ్ధమోక్షణుండయి లక్ష్మణుండు ప్రకట
సైంహికేయదంష్ట్రాయంత్రవిముక్తుం డయిన తిగ్మభానుండునుంబోలెఁ బ్రదీప్తుం
డయి, తీక్ష్ణగౌక్షేయకంబునఁ దదీయదక్షిణబాహుఖండనంబు సేసి, పార్శ్వ
ద్వయంబు భేదించిన నాక్షణంబ కబంధుండు దివ్యరూపధరుండగుటయుం గని
రాఘవుండు విస్మితుం డై.
| 361
|
| క. |
“ఈవనమునందు రాక్షస
భావంబున నున్న నీకుఁ బ్రకటితదివ్య
త్వావాప్తియైన కారణ
మేవిధ?” మనుటయును నాతఁ డి ట్లని చెప్పెన్.
| 362
|
| వ. |
“ఏను విశ్వావసుండను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి రాక్షసత్వంబు నొంది
మీవలన శాపమోక్షంబు వడసితి; రావణుం డనురక్కసుండు జానకిం గొనిపోయి
లంకానగరంబున నునిచినవాఁడు; మీకు హితోపదేశంబు సేసెద; నిట పోవం
బోవఁ బంపాభిధానం బయినసరోవరంబు గలదు; దానియావల ఋశ్యమూకం
బను శైలంబునందు వాలిసహోదరుండు సుగ్రీవుం డనువానరుండు సచివచతు
ష్టయసహితుం డై యుండు; నతనితోడ సఖ్యంబు సేయుము; దానంజేసి నీకుఁ
గార్యసిద్ధి యగు” నని పలికి గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్ఛం జనియెఁ; దద
నంతరంబ యట చని చని.
| 363
|