| |
నాకసం బంతయు నవనిపైఁ గూలిన,
వసుమతి [1]వ్రస్సిన, వనధు లెల్ల
నింకినఁ, జంద్రదినేశ్వరు లన్యోన్య
విపులతేజంబులు వీడుపడిన,
నే నేల యన్యుని నెడలోనఁ గామింతు?
గరిణి యేనాఁట సూకరముఁ గలయు?
|
|
| ఆ |
మహితకమలమధురమధురసాస్వాదన
పరవశాత్మ యైన భ్రమరకాంత
రిత్తబుద్ధి నకట రేఁగుపువ్వులరసం
బాను నెట్లు? బేల వైతిగాక.”
| 341
|
రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట
| వ. |
అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్ముఁ డతిభయంకరం
బుగా జంకించి యమ్మగువం బట్టికొని గగనంబున కెగసి, లంకాపురాభిముఖుం
డై యరుగఁ దొడంగిన, నయ్యింతి యెంతయుం దలరి యిట్లని విలాపంబు సేసె.
| 342
|
| ఉ. |
“దేవతలార! యోధరణిదేవతలార! జగత్త్రయోన్నతుం
డై వెలుఁగొందు రాముని కులాంగన జానకి నేను; నన్ను మో
హావిలుఁ డొక్కరక్కసుఁ డనర్గళుఁ డై కొనిపోయెడుం గృపం
గావరె పుణ్యము౯ యశముఁ గైకొనరే యిదె మీకు మ్రొక్కెదన్.”
| 343
|
| క. |
అని [2]యేడ్వఁగఁ దద్వచనము
లనఘుఁడు గిరిగహ్వరాంతరాలయగతుఁ డై
విని, యరుణసుతుఁడు దేజో
ఘనుఁడు జటాయు వనుపక్షి గారుణ్యమునన్.
| 344
|
| క. |
ఎఱకలు గల కులశైలము
[3]తెఱఁగుమెయిన్ రయము మెఱయ దివికి నెగసి బె
ట్టుఱుము జలధరము క్రియ ను
క్కఱి భువనం బెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్.
| 345
|
| ఉ. |
“ఓరి దురాత్మ! యీయబల [4]నోడక యేటికిఁ బట్టినాఁడ? వం
భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణముఁ గొందు నింక; ను
గ్రారివిభేదివిక్రము జటాయు నెఱుంగవె” యంచు దర్పదు
ర్వారుఁడు వీఁక దాఁకె సురవర్గవిఘాతకు నద్దశాననున్.
| 346
|
| మ. |
ఘనపక్షాహతులం, బ్రకాండపరిఘాఘాతంబులం, దీవ్రశా
తనఖోచ్ఛేదములం, బ్రదీప్తశరవేధక్రీడలం, గ్రూరచం
చు[5]నిపాతంబులఁ, బ్రౌఢకుంతముఖవిస్ఫోటంబులం, దత్ఖగేం
ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్ఫూర్తి నొప్పెం గడున్.
| 347
|
| చ. |
పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత
స్ఫుటితశరీరుఁ డై బహుళశోణితధారలు మేనఁగ్రమ్మఁగాఁ
దటసముపాంతనిర్గళితధాతురసారుణసాంద్రనిర్ఘరో
త్కటకులశైలలీల దశకంఠుఁడు నిల్చె [6]నకుంఠితస్థితిన్.
| 348
|
- ↑ ద్రస్సిన...విషయకాలంబులు విడువఁబడిన
- ↑ యేడ్చెడు తద్వచనము
- ↑ తెఱఁగు మెఱయ రయమి నెఱయ...ను, క్కఱి తద్వన మెల్ల
- ↑ లూరక యేటికిఁ...గొందు నిన్ను నుగ్రారి...సురవర్గవినూనను
- ↑ నిపాతాహతిఁ...సమగ్రస్ఫూర్తి
- ↑ నకంపిత