| |
బును నమ్మహాత్మున కెఱింగించి, మహనీయశౌర్యధైర్యధర్మారంభసమగ్రుల మైన
మా కివ్విధంబున నఖిలసామ్రాజ్యభోగవియోగం బై దుస్తరం బగు వనవాసం
బు సంప్రాప్తం బయ్యె; గావున విధికృతం బెవ్వనికి నెబ్భంగుల నలంఘ్యం బని
తలంచెద” నని పలికి మఱియు ని ట్లనియె.
| 262
|
| తే. |
“ద్రుపదనందన[1]క్రియఁ, గడుదుఃఖపడిన
నృపవధూటియు, నాయట్ల నియతశోక
వనధినిర్మగ్నుఁ డైన భూవరసుతుండుఁ
గలఁడె? వినఁ జూడ ననఘ! యెక్కాలమునను?”
| 263
|
| వ. |
అనిన నతనికి నత్తపోనిధి యి ట్లనియె.
| 264
|
| క. |
“కడు దుఃఖము నొందితి నని
యుడుగక యిటు వగచె దేల? యుర్వీశ్వర! నీ
పడు [2]టే టిది? రఘురాముఁడు
గడఁగి యిడుమ వడఁడె తొల్లి కాఱడవులలోన్.
| 265
|
| ఉ. |
ఆ విభుకాంత గాదె జనకాత్మజ; రావణుచే గృహీత యై
పోవదె? వానరప్రకరముల్ వెసఁ దోడుగ నేఁగి యాధరి
త్రీవిభుఁ డబ్ధి గట్టఁడె? వధింపఁడె దివ్యశరంబులన్ దశ
గ్రీవునిఁ? గ్రమ్మఱం జని యకిల్బిష రాజ్యవిభూతి నొందఁడే?”
| 266
|
ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట
| వ. |
అనిన విని ధర్మజుండు “మునీంద్రా! రాముం డెవ్వని వంశంబునవాఁడు? రావణుం
డెవ్వని తనయుం? డేమి నిమిత్తంబున సీతాపహరణంబు సేసె? రామరావణులకు
సంగ్రామం బెట్లు వర్తిల్లెం? జెప్పవే” యని రామాయణకథాశ్రవణకుతూహలి యై
యడిగిన నమ్మహాముని యి ట్లనియె.
| 267
|
| క. |
“విను మిక్ష్వాకుకులంబున
జనియించె నజుండు నాఁ బ్రశస్తచరితుఁ; డా
తనికొడుకు దశరథుండు ముద
మున నాతఁడు పెండ్లియయ్యె మువ్వురు సతులన్.
| 268
|
| వ. |
అందుఁ గౌసల్యకు రాముండును, గైకేయికి భరతుండును, సుమిత్రకు లక్ష్మణశత్రు
ఘ్నులును జనియించి; రందు రామునకు విదేహరాజనందన యైన సీత ప్రియాం
గన యయ్యె; నింక రావణుజన్మంబు సెప్పెద వినుము.
| 269
|
| ఆ. |
అఖిలలోకకర్త యగు విరించికిఁ బుల
స్త్యుండు నాఁగ మానసుఁడు దనూజుఁ
డుద్భవించె; నతని కుదయించె వైశ్రవ
ణాభిధానుఁ డైన యాత్మజుండు.
| 270
|
| వ. |
ఆవైశ్రవణుండు దనతండ్రి యగు పులస్త్యుని విడిచి, తాతయగు చతుర్ముఖునకుం
దపంబు సేసి నలకూబరుం డనుకొడుకును, లోకపాలకత్వంబును, ధనేశ్వరత్వం
బును, లంక యనుపురంబును, శంకరుతోడి సఖ్యంబును వరంబులుగాఁ బడసి
మహావిభూతితో వర్తిల్లుచున్నం గని యలిగి పులస్త్యుండు నిజశరీరంబునం దర్ధం
బున విశ్రవసుం డనువాని సృజియించి, యావైశ్రవణున కహితంబు సేయు మని
|
|
- ↑ గతి మున్ను దుఃఖ
- ↑ టెం తది; టే యది