Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

సూతహయధ్వజపాతపూర్వకముగ
                 రథములు దుము రయ్యె రథులతోన;
వెస [1]రావుతులతోన వస మఱి హయములు
                 గెడసి యెల్లెడలను బుడమిఁ గప్పె;
దందడి దెరలుచు సందడి పెల్లుగాఁ
                 గాలుబలంబులు గూలెఁ గలయఁ;

⁠


ఆ.⁠

దుముల మధిక మయ్యె; సమరతలంబున
ఘోరరుథిరవారిపూర మెసఁగె;
జితవిరోధిబలుఁడు శతమఖసూనుండు
చాపనైపుణ్యంబు సూపునపుడు.

⁠ 225


తే.⁠

సవ్యకరమునందును నపసవ్యకరము
నందుఁ బర్యాయసంగత మగుచుఁ జూడఁ
గొఱవి ద్రిప్పిన యొప్పున మెఱసెఁ బార్థు
గాండివము వాలుఁదూపుల [2]గని యనంగ.

⁠ 226


వ.⁠

అట్టియెడం ద్రిగర్తపతి యైన సుధన్వుండు గదాహస్తుం డై రథంబు డిగ్గి చని ధర్మ
తనయు రథ్యంబులఁ గూలనేసిన, నతండు నిశితసాయకంబున వానియురంబు వ్రచ్చి
విగతజీవుం గావించి, సత్వరంబుగాఁ జని సహదేవు నరదం బెక్కె; మఱియును
ద్రిగర్తులలోన మహాముఖక్షేమంకరు లనువారు నకులుం బొదివి ఘనశరా
సారంబు గురిసి జలధరంబులుంబోలె గర్జిల్లిన నమ్మాద్రీసూనుండు వారి
నిద్దఱఁ బెక్కమ్ముల నొప్పించె; నంతఁ దదీయాగ్రజుం డగు సురథుండు.

⁠ 227


చ.⁠

కరినికరంబుతోఁ [3]దొడరి గర్వితుఁ డై తనవారణేంద్రు న
క్కురుకులవీరుమీఁద నెస కొల్పినఁ, దద్రథఘోటకంబుల
బరుషతఁ జంపె నగ్గజము; వాయక వాఁ డసిచర్మహస్తుఁ డై
ధరణికి దాఁటుచో నది మదంబున వెండియుఁ బైఁ గడంగినన్.

⁠ 228


చ.⁠

తొలఁగక యమ్మహాబలుఁడు దోర్బల మొప్పఁ గృపాణపాతభం
గులఁ గరినాథు [4]కేలు నిరుగొమ్ములతో బెరయంగఁ ద్రుంప బె
ట్టిలకు విచేష్టమై నొఱగు నేనుఁగుపై నతిమాత్రభీతివి
హ్వలుఁ డగు శత్రు నుద్ధతిఁ గృతాంతవిధేయునిఁ జేసె వ్రేల్మిడిన్.

⁠ 229


క.⁠

వైరులు దలఁకఁగ నిమ్మై
దారుణపౌరుషవిశేషదక్షుం డై య
వ్వీరుఁడు రయమున నరిగి స
మీరతనయు నరద మెక్కి మెఱసెం బోరన్.

⁠ 230


చ.⁠

ఘనుఁడు వృకోదరుండు దనుఁ గట్టలుకం దలపడ్డఁ గోటికా
స్యునితురగంబులం దునిమి, సూతునికంఠంబు ద్రుంచివైచి, తీ
వ్రనిశిత మైన ప్రాసమున వాని యురంబు వగిల్చి చంపినం
గనుకనిఁ బాఱె భీతిఁ యెసఁగంగఁ దదీయచమూసమూహముల్.

⁠ 231

అర్జునుఁడు సౌవిరకుమారులం బన్నిద్దఁఱ జంపుట

వ.⁠

అంత నంగారకుండును, గుంజరుండును, సృంజయుండును, సుప్తకుండును, శత్రుం
జయుండును, సుప్రబుద్ధుండును, శుభంకురుండును, భ్రమంకరుండును, శూరుండు
ను, రథియును, గుహకుండును, బలాఢ్యుండును నను సౌవీరకుమారులు పన్నిరు

⁠
  1. ↑ రాహుతుల...గెడసి యెయ్యెడ
  2. ↑ గమి యనంగ
  3. ↑ గడఁగి...క్కురుకుల...నెసకొల్పినఁ
  4. ↑ కేలి నిడుగొమ్ముల; కే ల్నిడుదగొమ్ముల