Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

[1]కారుఁడు, ధర్మదక్షుఁ, డవికారుఁడు, ప్రౌఢపతంగతేజుఁ, డ
ద్ధీరుఁడు పాండవుండు సహదేవుఁడు దైవనిభుండు పెంపునన్.

⁠ 214


తే.⁠

కొడుకులందెల్లఁ గూర్చు గొంతి యితని;
కిమ్మహాత్ముఁడు మహి చలియించెనేని,
నగ్ని చల్లన యయ్యె నే, నాత్మఁ దాను
ధర్మనిష్ఠుఁ డై సత్యంబు దప్పఁ డెపుడు.

⁠ 215


వ.⁠

వీరేవురు నత్యంతదుర్వారులు; వీరి బారిం బడిన వారాశినడుమ [2]నుగ్రమకరాహ
తం బై యవియు పేరోడయుంబోలె నీ సైన్యంబు వికలం బగు; నీవునుం బ్రాణం
బొండె, మానం బొండెఁ గోల్పోక మెయిమెయిం బో నేర్చెదవే?” యనియె; న
ప్పుడు కౌంతేయులు సైంధవసేనం దలపడి దిఙ్ముఖంబున నెల్లం జీకట్లు గవి
యునట్లుగా బాణపటలంబులు పఱఁగింపం దొడంగిన.

⁠ 216


క.⁠

“తొలఁగకుఁడు, పొదువుఁ, డేయుఁడు,
నిలువుఁడు, వడిఁ బొడువుఁ” డనుచు నిజయోధులఁ దాఁ
గలయఁ బరికొల్పి సైంధవు
డలఘుపరాక్రముఁడు నినిచె నాహవభూమిన్.

⁠ 217


వ.⁠

ఇట్లు త్రిగర్తశిబిసింధుసైన్యంబులతో ననేకనరపతిపరివృతుం డై నిలిచిన
జయద్రథుం జూచి, భీమసేనుండు క్రోధారుణలోచనుం డై రథంబు డిగ్గి హేమ
బంధబంధురంబును నయోమయంబును నగు గదాదండంబు ద్రిప్పుచు వానిప
యిం గవిసిన, నడ్డపడి కోటికాస్యుండు నిజసైన్యసంఘంబుతో నమ్మాహావీరుం
బొదువుటయు నతండు.

⁠ 218


క.⁠

మదగజముల, రథయోధులఁ
బదాతులను, దురగములను, బలువిడిఁ గలయం
జదుపుచు దుర్వారగతిన్
విదితబలుడు [3]ఘనగదాప్రవీణత మెఱసెన్.

⁠ 219


వ.⁠

ఇట్లు విహరించి యహితసైన్యంబు నిహతం బగుటయుఁ జెలంగి సింహనాదం
బు సేసి యతండు సారథిసముపనీతం బైన రథంబు సాదరంబుగా నెక్కి గృహీత
శరాసనుం డై విక్రమించె; మఱియును

⁠ 220


క.⁠

అలిగి యుధిష్ఠిరుఁడును న
గ్గలికం బ్రతివీరు లడరఁ గార్ముకవిద్యా
విలసనము మిగుల [4]సౌవీ
రుల నూర్వుర రథికవరుల రూ పడఁగించెన్.

⁠ 221


క.⁠

నకులుఁడు నిశాతసాయక
నికరంబుల సమరధారుణీతల మెల్లం
బ్రకటపరవీరవరమ
స్తక[5]బంధురముగ నొనర్చె దారుణభంగిన్.

⁠ 222


క.⁠

నారాచపాతముల దు
ర్వారుఁడు సహదేవుఁ డాహవముఖంబున [6]న
శ్వారోహకులం గూల్చుచు
వీరవిహారంబు సలిపె వేడ్క యెలర్పన్.

⁠ 223


ఆ.⁠

సింధురాజసైన్యసింధుపూరము నందు
మహితఫల్గునాఖ్యమంథనగము
దిరిగి కలఁపఁ దొడఁగెఁ బరనృపాలక మహా
జలచరవ్రజంబు సంచలింప.

⁠ 224


సీ⁠

వారణకోటి దదారోహకులతోన
                 వివశమై యొఱలుచు నవనిఁ ద్రెళ్లె;

⁠
  1. ↑ కారుఁ డుదారశౌర్యుఁ
  2. ↑ మహానిలధారాహతి నవయు
  3. ↑ పటుగదా...చూపెన్
  4. ↑ నవ్వీ, రుల నూర్వుర నధికబలుల
  5. ↑ దంతురముగ; తుములంబుగ
  6. ↑ హస్త్యా