Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బోపడి వాఁడు చిత్రముగ భూమితలంబునఁ ద్రెళ్ళె [1]మారుతా
క్షేపవిభగ్నమూల మయి చెచ్చెరఁ ద్రెళ్ళు మహీరుహంబునాన్.

⁠ 190


వ.⁠

ఇట్లు నేలం బడి తడయక యెగసి జయద్రథుండు మగువం దిగిచి రథంబుపై
నిడికొని, సపరివారుం డయి యరుగం దొడంగె; నప్పు డప్పొలఁతి పురోహితు
నకు మ్రొక్కిన నమ్మహాత్ముండు సైంధవుం బేర్కొని యి ట్లనియె.

⁠ 191


మ.⁠

“తగునే రాజకులప్రసూతులకు నత్యంతంబు నేతాదృశం
బగు దుష్కర్మము? నాదుపల్కు విను; మీ యబ్జాక్షి పుణ్యాత్మ; యి
మ్మగువన్ వే విడు; పాండునందనులు నీ మానంబుఁ బ్రాణంబు నే
పగిదిం గొందురు గాని పో విడువ; రీపాపంబు నిన్ ద్రెక్కొనున్.”

⁠ 192


వ.⁠

అని యాక్రోశించుచు నమ్మహీసురవరుండు వాని పిఱుందన చనియె; నిట పాండ
వులు నవ్వనంబున ననేకమృగంబుల వధియించి యందఱు నొక్కయెడం గూ
డంబడి యాశ్రమాభిముఖులై వచ్చునెడఁ దమ్ములం జూచి ధర్మజుం డి ట్లనియె.

⁠ 193


సీ.⁠

“ఇనుఁడున్న దెసనుండి [2]యెలుఁగింపఁదొడఁగెఁ బ
                 క్షులు; మృగంబులు నతిఘోరరుతుల
మగిడెడు నిప్పుడు మనకు దాపలిదెస
                 నతిభీషణాకృతి నఱచె వఱడు;
పగఱచే నవమానపాటును గయ్యంబుఁ
                 గలుగు నీశకునప్రకార మరయఁ;
గడుకొని చెయి వెట్టి కలఁచిన ట్లయ్యెడుఁ
                 జిత్తంబుఁ; దనువు నిశ్చేష్టమయ్యె

⁠


ఆ.⁠

నరుగుదెండు వేగ; యాశ్రమంబునఁ గృష్ణ
నునిచి వచ్చినార మొంటి; నకట!
తలఁపఁ గ్రూరమతులు ధార్తరాష్ట్రులు గడు
నెగ్గు సేయఁ జూతు రెడరు వేచి.

⁠ 194


ఆ.⁠

కమలహీనమైన కమలాకరమువోలె
[3]రాజహీనమైన రాత్రివోలెఁ
జూడఁ గామ్యకంబు శూన్యమైయున్నట్లు
దోఁచె; నేమి కీడు దొడరు నొక్కొ?”

⁠ 195


వ.⁠

అనియె; ని ట్లయ్యేవురు నరదంబులు సత్వరంబుగాఁ దోలుకొని యాశ్రమంబున
కు వచ్చునెడఁ బాంచాలి పరిచారిక ధాత్రేయిక యనునది యతికరుణంబుగా
నేడ్చుచున్నం గని, ధర్మతనయు సారథియైన యింద్రసేనుండు రథంబు డిగ్గ నుఱి
కి చని “యిది యేల? నేలం బడి పొరలుచు నేడ్చెదవు? నీ కపకారంబు సేసిన వా
రెవ్వ?” రనిన నది వానిం జూచి “సైంధవుచేతం బాంచాలి చెఱపోయె” నని పలు
కుచుఁ బెల్లేడ్చిన నింద్రసేనుం డి ట్లనియె.

⁠ 196


సీ.⁠

“పాండుపుత్త్రుల బహిఃప్రాణంబు నుత్తమ
                 శీలసమగ్రఁ బాంచాలతనయఁ
గొనిపోవు నంతటి గుండె గల్గెనె? విమో
                 హాంధమానసుఁ డైన సైంధవునకు;
నేఁగుఁ గా కేమి మహీతలగతుఁ డైన
                 గగనంబునకు వేగ యెగసి చనినఁ
బో[4]నిత్తురే పొరివుత్తురు గాక యు
                 ద్ధురవృత్తిఁ బార్థు లాదురితచరితు

⁠
  1. ↑ మారుతక్షేప...మహీరుహం బనన్
  2. ↑ యెలిఁగింపఁ...ఘోరరుతుల...దాపటిదెస; డాపలిదెస...మొంటి యకట
  3. ↑ రాజహీన మగుపురంబువోలె; రాజు లేనియట్టిరాత్రివోలెఁ
  4. ↑ నిచ్చెదరె పొరి