Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

అయ్యవసరంబున నేను మీ యొద్దనుండమిం జేసి యిట్టి దుర్వ్యసనంబు సంభవి
ల్లెం; గామజంబు లైన స్త్రీద్యూతమృగయాపానంబు లను నాలుగు దుర్వ్యసనం
బులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు; నందును విశేషంబుగా [1]ననర్థ
మూలం బయిన ద్యూతంబుఁ బరిహరింపనినాఁడు పాపం బగు నని హేతుదృష్టాం
తంబులు సూపి కృపద్రోణవిదురగాంగేయులం దోడు సేసికొని యాంబికేయు
నొడం బఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు.

⁠ 148


క.⁠

[2]వలచి హితంబునఁ బథ్యముఁ
బలికినఁ జేకొనని ధర్మబాహ్యుల నవివే
కుల నిగ్రహింతు; మీ కె
గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్?

⁠ 149

కృష్ణుఁడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట

వ.⁠

ఏను సముద్రతీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్ధంబు సేసి వాని వధియించు
పొంటె నక్కడ మసలితి; నది గారణంబుగా మీకు దుర్వ్యసనావసరంబున నల
బ్ధసన్నిధానుండ నయితి” ననిన నది యె ట్లని యుధిష్టిరుం డడిగిన నాతనికి
సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగాఁ గృష్ణుం డి ట్లని చెప్పె; “నీ యజ్ఞంబున
నర్ఘ్యనిమిత్తంబున నసహిష్ణుండయిన శిశుపాలుండు నాచేత నిహతుండగుట
విని, వాని తమ్ముండు సాల్వుం డనువాఁడు తద్వధప్రవర్తితక్రోధుం డయి కామ
గమనం బయిన తన సౌంభకం బను నగరంబుతో సన్నద్ధుం డయి వచ్చి ద్వార
వతీపురంబు నవరోధించి.

⁠ 150


చ.⁠

“ప్రతివరపాలకాలు, శిశుపాలు, బలాధికుఁ జంపి దర్పసం
హితుఁ డగుచున్న [3]వృష్ణిఖలుఁ డెక్కడ నెక్కడ? నాతనిం జయో
న్నతి వెలయంగఁ జంపెద రణంబున” నంచు నలంఘ్యవిక్రమో
ర్జితుఁ డయి దాని చుట్టు విడిసెం జతురంగమహాబలంబుతోన్.

⁠ 151


క.⁠

మే లగు తత్పుర[4]బాహ్యవి
శాలోద్యానముల తాల సాల సరళ హిం
తాల తమాలావలి ని
ర్మూలితముగఁ జేసెఁ దచ్చమూసామజముల్.

⁠ 152


వ.⁠

మఱి తృణజలధాన్యసమిత్సమృద్ధంబయి [5]శతఘ్నీప్రముఖానేకయంత్రంబుల న
లంఘ్యపరిఘాప్రాకారంబులను, నపారబలరక్షితఘనకవాటచతుర్గోపురంబులను,
లబ్ధప్రభూతవేతనప్రహృష్టపుష్టధృష్టవీరసుభటసంకులంబులను, నపరిమితగజ
తురంగశతాంగంబులను, బ్రదీప్తాలాతశాతశరచక్రతోమరపరశుపాశాంకుశ
కూటంబులను, వీరయోధారూఢవిశాలాట్టాలకంబులను నొప్పి పరుల కసాధ్యం
బయిన ద్వారవతి భేదింప నేరక దానివెలిం బ్రపాచైత్యదేవాయతనవల్మీకం

⁠
  1. ↑ నధర్మ
  2. ↑ వలచిన హితంబు పథ్యము ... కెగ్గులు సేసిన ధార్తరాష్ట్రులకు నెయ్యెడలన్
  3. ↑ వీరవరుఁ డెక్కడ బో (వో) నగు నాతని న్నయో, న్నతి ... నశక్యవిక్ర
  4. ↑ మార్గవి
  5. ↑ శతఘ్ని పరుషాగ్ని ప్రముఖానేకయంత్రఘనకవాటంబు నలంఘ్య ... ప్రతిపాలితనిశాత ... శూలంబులను విహరద్యోధారూఢ ... దేవాయతనగుల్మవల్లీ