Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జననాథోత్తమ! వీడుకొల్పిరి; తదాజ్ఞం జేసి యాకృత్యయున్
మును దాఁ దెచ్చిన[1]చోటఁ బెట్టె నధిపున్ మోదంబు సంధిల్లఁగాన్.

⁠ 49


ఉ.⁠

అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంతవృ
త్తాంతము స్వప్నవృత్తముక్రియం దలపోసి, నిజంబ కాఁగ న
త్యంతము నిశ్చయించుచుఁ, బృథాసుతులన్ సమరంబులోన ని
ర్జింతున కాక యంచు వికసిల్లె దురాశయభగ్నబుద్ధి యై.

⁠ 50


క.⁠

విను జనమేజయ! పౌరవ
జనవిభుఁ డబ్భంగి రాత్రిచరితం బగు న
ద్దనుజసమాభాషణ మె
వ్వనికిని నెఱిఁగింపకుండువాఁ డయ్యె మదిన్.

⁠ 51


వ.⁠

అంతఁ బ్రభాతం బగుటయు రాధేయుండు సుయోధనుపాలికిం జని హేతుమ
ద్వాక్యంబుల నతని కి ట్లనియె.

⁠ 52


ఉ.⁠

“చచ్చినపిమ్మటం గడిఁది శత్రుల నోర్వఁగ వచ్చునే? శుభం
బిచ్చునె చావు లెందును? నరేశ్వర! యాఱడి చత్తు నంట దా
మె చ్చగు నయ్య [2]యేరికిని? మేనికి జీవము గల్గుచోన పెం
పచ్చుగ సిద్ధిఁ బొందు విజయార్థసుఖంబులు మర్త్యకోటికిన్.

⁠ 53


ఉ.⁠

కావున శోకదైన్యములకాలము గా దిది; లెమ్ము, విక్రమ
శ్రీ విలసిల్లు” మంచుఁ గురుసింహుని, సింహసమానుఁ, జారుశ
య్యావివశాంగు నంగపతి [3]యాదటఁ దా నిరుగేల గ్రుచ్చి సం
భావన నెత్తుచుం బ్రణయభాషల వెండియు వాని కి ట్లనున్.

⁠ 54


క.⁠

“మది నర్జునుఁ జూచి భయం
బొదవినయది నీకు; వాని నుగ్రరణమునం
బదునాలవయేఁడు జయిం
చెద; నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా.”

⁠ 55

దుర్యోధనుఁడు ప్రాయోపవేశము మాని కరిపురంబునకుఁ బోవుట

చ.⁠

అనవుడుఁ దత్ప్రతిజ్ఞయు సురారులవాక్యములుం దలంచి య
జ్జనపతి గాఢనిశ్చయవశంవదుఁ డై శయనంబు డిగ్గి చ
య్యనఁ బయనంబు సేయుఁ డని యప్పు డమాత్యులఁ బంచి యిమ్ములన్
దినముఖకృత్యముల్ సలిపి [4]ధీరతతో వెడలెం బ్రియంబుతోన్.

⁠ 56


వ.⁠

అయ్యవసరంబున.

⁠ 57


చ.⁠

రయవిచలత్తురంగమతరంగములన్, మదనాగనక్రసం
చయములఁ, జంచలచ్చటుల సైనికమత్స్యములన్, మహోన్నతం
బయి కురురాజచంద్రు నుదయంబునఁ దద్దయుఁ బొంగెఁ బ్రస్ఫుర
ద్భయదమనోహరప్రకటభంగులఁ [5]దద్భటవార్ధి యుద్ధతిన్.

⁠ 58


ఉ.⁠

చామరపుండరీకవిలత్సిత[6]కేతుపతాకలం గురు

⁠
  1. ↑ చోనఁ
  2. ↑ యెవ్వరికి
  3. ↑ యాచటతో నిడుగేల
  4. ↑ దీపితుఁ డై
  5. ↑ దద్బలవార్థి
  6. ↑ చారుపతాకలం