Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

కాముకుఁ, గామవైరి, నవికారుఁ, బురాంతకుఁ బ్రీతుఁ జేసినం
గామితదాయి యైనశితికంఠుఁడు నిన్ను సృజించి యిచ్చె ను
ద్దామదయావిధేయుఁడు ముదంబున మాకు నధీశ్వరుండుగాన్.

⁠ 43


ఉ.⁠

నీ దగుపూర్వదేహము వినిర్మలవజ్రవిశేషసం
పాదిత మస్త్రశస్త్రపరి[1]పాటనభేద్యము గాదు, నిత్యనిః
ఖేదము, పుష్పకోమలము, ఖేచరభూచరకామినీమనో
హ్లాదన; మిట్లుగా నభవుఁ డర్థి నొనర్చె నుమాసమేతుఁ డై.

⁠ 44


ఉ.⁠

నీవు ధరిత్రిఁ బుట్టుటయు, నీకు సహాయము సేయఁ గోరి నా
నావిధదైత్యదానవగణంబులు రాజకులంబులందు స
ద్భావన నుద్భవించెఁ బటుబాహులు, దివ్యమహాస్త్రకోవిదుల్,
[2]ద్రావితవైరు, లుర్వి భగదత్తపురస్సరు లైన వీరు లై.

⁠ 45


వ.⁠

భీష్మద్రోణకృపాదులు గొందఱు దేవాంశసంభవు లైనను దదీయభావంబులు
రాక్షసావేశంబు నొందెడు; దానం జేసి వారు నిర్దయు లై విమూఢులుం బోలె నన్యో
న్యపరుషంబులు పలుకుచు, నలుక మిగులం బుత్త్రపౌత్త్రమిత్త్రభ్రాతృశిష్యగురు
బాలవృద్ధజనభేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషం
బులు నైన వివిధాస్త్రశస్త్రంబులఁ బాండవపక్షక్షయంబు గావింపంగలవారు; పాం
డవులు బంధుస్నేహంబు విడిచి తెగువకుం జొచ్చి నీచేత నిహతు లగుదురు; నీ
మనంబుల బీభత్సువలనిభయంబు గొంత గలదు; దాని నెఱింగి నేమును దగునుపా
యంబు దలంచితి; మది యెట్లనినఁ గృష్టుచేతం జచ్చిననరకాసురువంశంబు గర్ణు
నావేశింపంగలయది; తత్కారణంబునం గృష్ణార్జునులతోడ బద్ధవైరుండై యవ్వీ
రుండు నిజదివ్యాస్త్రంబులం గృష్ణుల నిద్దఱ నిర్దహించు; నివ్విధం బెఱింగి యిం
ద్రుండు పాండవరక్షణార్థంబు వచ్చి కర్ణుకవచకుండలంబులు గపటరూపంబున
నపహరింపగలవాఁడు; మఱియును.

⁠ 46


క.⁠

క్షితి సంశప్తకు లనఁగా
శతలక్షసహస్రసంఖ్య జనియించిరి ద
ర్పితు లై దనుజులు; దద్బల
తతిచే సమరమున నింద్రతనయుఁడు సిక్కున్.

⁠ 47


తరలము.⁠

నిహతకంటక మైన యిద్ధరణీతలం బఖిలంబు నీ
మహితశాసనగోచరం బగు; మానవేంద్ర! [3]ప్రసన్నతా
మహిమ నొందుము; నీవ తేపవు మాకు నందఱకుం; గురూ
ద్వహ! విషాదము వొందఁ బాడియె? దైత్యపక్షభయంబుగాన్.

⁠ 48


మ.⁠

చను మిం కొండుదలంపు మాను” మని యాశ్వాసించి వానిం బునః
పునరాలింగన మాచరించి, యెలమిం బూజించి దైత్యోత్తముల్

⁠
  1. ↑ పాతనభేద్యము కాదు ... హ్లాదన మట్లుగా
  2. ↑ ధావిత
  3. ↑ ప్రసిద్ధతా ... విషాదము నీకుఁ బాడియె; వివాదము నొందఁ బాడియె