Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

వారలు నీతోఁబుట్టువు
లీరాజ్యము మీరు వారు నేకం బై పెం
పారఁగ నేలుఁడు; దీనం
గౌరవకుల[1]నాథ! సౌఖ్యగౌరవ మొందున్.”

⁠ 38


వ.⁠

అని శకుని సెప్పుచుండ నగ్గాంధారీనందనుండు నిజచరణసమీపంబునం బడి
యున్న దుశ్శాసనున్ గ్రుచ్చి యెత్తి, మూర్ధాఘ్రాణంబు సేసి కర్ణసౌబలులం
జూచి “మీ రేల నన్నుఁ గారించెదరు? ధర్మైశ్వర్యధనభోగంబులందు నా కభిలా
షంబు లేదు; ప్రాయోపవేశంబునందుఁ గృతనిశ్చయుండ నైతి; మీ రింక నొం
డువిఘ్నంబులు సేయక యూరక మీవలయునెడకుం బొం;” డనిన వారలు “దేవా!
నీవిధం బిట్టిద యయ్యెనేని మే మెందుఁ జేరెదము? నీతోడివారము కాక” యని
రంతం గమలహితుండు పశ్చిమాచలసమీపగతుం డగుటయు నన్నరనాథుండు
సురలోకగమనకుతూహలి యై శుచిస్నానంబు సేసి, వల్కలంబులు ధరియించి,
సంధ్యాసమయసముచితంబు లగుకరణీయంబులు నిర్వర్తించి, వివిక్తదేశంబు
నందు దర్భాస్తరణంబున నాసీనుం డై వాఙ్మియతుం డై.

⁠ 39


క.⁠

క్రమమున బాహ్యేంద్రియక
ర్మము లెల్లను వదల విడిచి, మహితసమాధి
క్రమదశ నుండె నివాత
స్తిమితం బై వెలుఁగుచున్నదీపమపోలెన్.

⁠ 40

ప్రాయోపవిష్టుఁ డైనదుర్యోధనునిఁ గృత్య పాతాళంబునకుఁ గొనిపోవుట

సీ.⁠

ఆసమయమున ము న్నమరేంద్రవిజితు లై
                 యహిలోకముల నున్నయసురవరులు
ధృతరాష్ట్రనందనుతెగువ యెఱింగి
                 యాత్మీయపక్షక్షయస్థితికి వగచి
యాతనిఁ బిలిపింప నప్పుడు శుక్రాదు
                 లైన భూసురసమూహములచేత
వేల్మి వెట్టించిన, వేగంబ యొకకృత్య
                 వెలువడి భీషణవికృతమూర్తి,

⁠


ఆ.⁠

“యేమి పనులు గలిగె? నెఱిఁగింపుఁ” డనిన వా
“రిచటి కిపుడు కౌరవేంద్రు ననఘు
నుజ్జ్వలాంగు నాసుయోధనుఁ దెమ్ము ప్రా
యోపవేశమున నున్నవాని.”

⁠ 41


వ.⁠

అని పనిచినం గృత్యయు నాక్షణంబ చని ప్రాయోపవిష్టుం డై యున్నదుర్యోధను
గ్రుచ్చి యెత్తికొని రసాతలంబునకుం దెచ్చి దైత్యులకు సమర్పించినం బ్రీతు లై
వారు వానిం గౌఁగిలించుకొని కుశలం బడిగి యిట్లని “రయ్యా! నీవు శూరుండవు,
శూరజన[2]రక్షితుండవు, భరతకులోద్వహుండ; విట్టిసాహసం బేల చేసితివి? మఱి
యాత్మఘాతుకునకు లోకంబున నిందయు హీనతయు దుర్గతియుం బ్రాపించు;
లోకవిరుద్ధంబు లై మూలఘాతంబు లైనకార్యంబులయందు నీయట్టిబుద్ధి
మంతులు ప్రవర్తిల్లుదురే? యట్లు గావున నీ వఖిలధర్మార్థయశోభోగనాశం బైన
యీదుర్విచారంబు విడువుము; ధైర్యంబును బ్రతాపంబును బాటింపుము; శత్రు
జనభంజనంబు సేయుము; నీవు మనుష్యమాత్రుండవు గావు; నీపూర్వజన్మ
ప్రకారంబు సెప్పెద మాకర్ణింపుము.

⁠ 42


ఉ.⁠

ఏము తపంబు సేసి పరమేశ్వరు, నీశ్వరు, బార్వతీమనః

⁠
  1. ↑ ముఖ్య
  2. ↑ రక్షకుండవు భరతకులోద్భవుండ