Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

గణేశశారదాగురుభ్యో నమః

శ్రీమదాంధ్రమహాభారతము

ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము

⁠



లలితమూర్తి! సుమహ
చ్చాళుక్యవరేణ్య! పుణ్యచారిత్ర! విచి
త్రా[1]లంకారోజ్జ్వలకవి
తాలాపకలాప సంతతానందమదీ!

⁠ 1

దుర్యోధనుని విషాదము

వ.⁠

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; న ట్లతిమానుషం బైన యర్జు
నుపరాక్రమంబును, నత్యంతదైన్యాస్పదం బగుదుర్యోధనుపరాభవంబును,
ధర్మజుదయయు నాకర్ణించి విస్మయజుగుప్సాకలితమానసుం డగుచు జనమే
జయుండు వైశంపాయనున కి ట్లనియె.

⁠ 2


చ.⁠

అనిమిశము బాండుపుత్త్రులకు నప్రియకార్యము రోయునట్టి దు
ర్జనుఁడు సుయోధనుం డటులు శత్రులచే నవమానితుండుఁ బే
ర్చినకృప నొప్పుచున్న కురుసింహులచేత విమోక్షితుండు నై
మనమున లజ్జ లేక మునిమండన! యెమ్మెయి నేఁగె వీటికిన్?

⁠ 3


మత్తకోకిలము.⁠

మేనఁ బ్రాణము దాల్చి, [2]భంగము మ్రింగి, యెప్పటిచాడ్పునన్
మానవేంద్రుఁడ నేను దద్దయు మానినన్ దలఁ పాత్మలోఁ
బూను టాతని కెట్లు గల్గఁగఁబోలు? నారయ నద్భుతం
బైన తచ్చరితంబు సెప్పుమ యంతయుం బరిపాటితోన్.”

⁠ 4


వ.⁠

అని యడిగిన నమ్మహాముని యిట్లను “నట్లు కౌంతేయులచేత [3]బంధమోక్షితుం
డై దుర్యోధనుండు లజ్జాలజ్జలితహృదయుం డగుచుఁ జెదిరినసేనలం [4]గూడు
కొని కొంతద వ్వరిగి, యొక్కసమతలంబునం బటమందిరవిరచనంబు నిర్వర్తించి

⁠
  1. ↑ లంకరణోజ్జ్వల ... తాస్మేరమతీ; తస్మేరమతీ. ఒకానొకప్రతియం దీకందమునకు మారుగా, "క. శ్రీకరశాత్రవరాజివ, శీకరమృగరాజ రాజశేఖర గంగా, శీకర యశఃప్రతాప ని, రాకరరవితేజ రాజరాజనరేంద్రా." అని యున్నది.
  2. ↑ బన్నము
  3. ↑ లబ్ధమోక్షుం డై
  4. ↑ గూర్చుకొని