Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

రాజకులతిలక! భువనవి
రాజిత[1]సితకీర్తి! దివిజరాజవిభవ! ని
ర్వ్యాజపరాక్రమ! సకలధ
రాజనసంపూజ్య! ధర్మరక్షణదక్షా!

⁠ 436


స్రగ్విణి.⁠

సర్వలోకాశ్రయా! [2]సౌమ్యభావోదయా!
నిర్వికారాకృతీ! నిత్యసత్యోన్నతీ!
గర్వితోద్యద్భుజాకల్పకల్పోల్లస
త్సర్వసర్వంసహాచక్ర చక్రాయుధా!

⁠ 437


గద్యము.⁠

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైనశ్రీమహాభారతం
బునం దారణ్యపర్వంబునఁ బతివ్రతాచరిత్రంబును, ధర్మవ్యాధుండు గౌశికున
కుఁ బరమధర్మం బెఱింగించుటయు, నగ్నివంశానుకీర్తనంబును, గుమారోత్పత్తి
యు, సత్యాద్రౌపదీసంవాదంబును, బాండవులు ద్వైతవనంబునకుం జనుటయు,
ధృతరాష్ట్రవాక్యంబులును, దుర్యోధనాదులదుర్మంత్రంబున ఘోషయాత్ర
యుఁ, గౌరవగంధర్వయుద్ధంబును, దుర్యోధనాదులు గంధర్వులచేతం బట్టువడు
టయు, నర్జునుండు వారల విడిపించుటయు నన్నది పంచమాశ్వాసము.

⁠
  1. ↑ చిరకీర్తి
  2. ↑ సామ్య