Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బుణ్యంబును గీర్తియుం జేకొనుసమయంబు; ని న్నింత నిర్బంధింపవలవ, దేన
యరుగుదు; నిప్పుడు యజ్ఞదీక్షితుండ నై యున్నవాఁడ; గావున నాకుం జనరా
దు; మీరు వేగ చని గంధర్వులం బ్రియపూర్వకంబుగా ననునయించి, సుయో
ధను విడిపించునది; సామవచనంబులం దీరకున్నఁ బరాక్రమంబున నైనం బ్రతి
వీరుల నోర్చి కార్యంబు దీర్చునది; నాచేయుజన్నంబు సఫలంబు సేయుం” డనిన
భీముం డెట్టకేనియు నియ్యకొనియె; నర్జునుండును ధర్మరాజు పనుపు గైకొని కురు
రాజు చెఱ దలుగఁ బ్రతిజ్ఞ సేసె; నకులసహదేవులు నుత్సాహసమేతు లయి ర
న్నలువురు నాముక్తకవచులు, నాబద్ధతూణీరులు, నాకలితకార్ముకులు, నారూఢ
రథులు నయి యగ్రజు వీడ్కొని యతిత్వరితగతి నడచినం, గౌరవసైన్యం బంత
యు వారిం గూడుకొని సింహనాదంబులు సెలంగం జనియె ని ట్లరిగి వారలు
గంధమాదనంబునకయి చనుచన్నయవ్వియచ్చరానీకంబుం గూడముట్టిన.

⁠ 414

భీమార్జుననకులసహదేవులు గంధర్వులతో యుద్ధంబు సేయుట

క.⁠

కని గంధర్వులు గ్రమ్మఱి
ఘనులం బాండవుల నగ్నికల్పులఁ, దేజో
ధనుల, నమరేంద్రసదృశుల
ననఘుల మార్కొనిరి ప్రకటితాటోపమునన్.

⁠ 415


ఉ.⁠

అగ్రజువాక్యముల్ దలఁచి యర్జునుఁ డప్పుడు వారితోడ న
త్యుగ్రత దక్కి యెంతయుఁ బ్రయోక్తుల నిట్లను “మీకు మాయెడన్
విగ్రహ మేల? నెయ్యమున విడ్వుఁడు కౌరవరాజుఁ; బార్థివ
ప్రాగ్రసరుండు ధర్మసుతుప న్పిది; మీకు నలంఘ్య మిత్తఱిన్.”

⁠ 416


వ.⁠

అనిన నతనికి గంధర్వు లి ట్లనిరి.

⁠ 417


తే.⁠

“ధర్మజుఁడు మాకుఁ బ్రభుఁడె? యాధర్మతనయు
నాజ్ఞ నే మేల యొనరింతు? మనిమిషేంద్రుఁ
డొక్కరుఁడ మమ్ము శాసింప నొడయఁ; డన్యు
లెందు నెవ్వరైనను భయ మేమి మాకు?”

⁠ 418


వ.⁠

అనిన వివ్వచ్చుం డవ్వియచ్చరుల నుపలక్షించి, “మునుమున్న తెగువకుం జొర
నేల? యని ప్రియంబును ధర్మంబునుం గాఁ బలికితి; నెట్లును మీరు సామసా
ధ్యులరు గాకునికి దోచుచున్నయది; గావున నుగ్రం బయినవిగ్రహంబున
దుర్యోధను విడిపింతు” నని వారలమీద నిశితవిశిఖప్రకరంబులు ప్రయోగించె;
నాగంధర్వులు నతనిపైఁ బటుబాణవర్షంబులు గురిపి; రి ట్లానలువురకు ననేక
గంధర్వశతసహస్రంబులతో నతిఘోరసమరం బయ్యె నందు.

⁠ 419


తరలము.⁠

కదిసి యర్జునుతేరు భగ్నముగా నొనర్పఁ దలంచి పె
ల్లొదవి ఖేచరకోటి గ్రమ్ముటయుం బురందరనందనుం
డదయుఁ డై పదిలక్షలం, బ్రళయాగ్నికల్పుల, దివ్యులం,
గదనశూరుల నిర్దహించెఁ బ్రకాండదివ్యశరార్చులన్.

⁠ 420