Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

కట్టిఁడికి నిట్టికష్టంబుగా నొనర్చి
తగ విధాతృఁడు చతురుఁ డై నెగడె నేఁడు.

⁠ 405


మ.⁠

విపరీతస్థితి నొంది, ఘోరవిపినోర్వీవాసు లై నిత్యదుః
ఖపరాధీనతఁ దూలి రంచు మనలన్ [1]గర్వోద్ధతస్వాంతుఁ డై
యపలాపింపఁగ వచ్చి, దుర్ణయపరుం డాధార్తరాష్ట్రుండు దో
షపరీతాత్ముఁడు దత్ఫలంబు గుడిచెన్ సత్యంబు సామాత్యుఁ డై.

⁠ 406


వ.⁠

వానిదెసం గృపసేయ వల” దనిన ననుజునకు నగ్రజుం డి ట్లనియె.

⁠ 407


క.⁠

“అకట! యిది పరుషవాక్యము
లకు సమయమె? శరణు సొచ్చి లఘుభావముతో
వికల[2]గతి నున్నకౌరవ
నికరమునకుఁ గరుణ సేయ నీకుం దగదే?

⁠ 408


వ.⁠

ఏకాన్వయజాతు లైనవారికి నర్థనిమిత్తం బైనభేదం బొక్కొక్కమాటు వర్తి
ల్లు; నంతన చేసి సహజస్నేహంబు దప్పనేరదు; జ్ఞాతిజనంబులు దమలో నెట్టివా
రైన నొప్పుం గాని యన్యులవలనం బరిభవంబు దొడరినప్పుడు దా రొండొ
రులఁ జేకొనకునికి లోకనింద్యంబు; దుర్యోధనుండు దుర్వినీతుం [3]డైనను సభా
ర్యుం డయి పరులచేత బట్టువడియె; దీని నుపేక్షించిన మనకుం గులహాని యగు;
నదియునుం గాక శరణాగతరక్షణంబు రాజమాత్రుం డగువాని కెల్లధర్మంబు; నీయ
ట్టిబాహుబలసంపన్నునకు నిట్టిసుకర్మంబు గర్తవ్యం బని వేఱు చెప్పనేల? లెమ్ము
నీవును నీతమ్ములు నిమ్ముల రథంబు లెక్కి సర్వాయుధసన్నద్ధు లై చని సుయో
ధనుచెఱ దలుగుం డనినఁ బవననందనుండు ధర్మనందనున కి ట్లనియె.

⁠ 409


సీ.⁠

“అనుమాన మొక్కింతయును లేక యలిగి జ
                 లంబులఁ ద్రోచె; విషంబు వెట్టె;
గృహదాహ మొనరించె; విహితదురోదర
                 కపటుఁ డై రాజ్యంబు నపహరించె;
జను లెల్లఁ జూడంగ వనజాక్షిఁ బాంచాలిఁ
                 దల పట్టి యీడ్పించె; వలువ లొలువ
బనిచెఁ; బుట్టినకోలె మనకు నక్కట సుయో
                 ధనుఁ డెగ్గు సేయని దినముఁ గలదె?

⁠


ఆ.⁠

వానిచేఁత లొకటియేనియుఁ దలఁపవు
నీవు; మనుజనాథ! కేవలంపుఁ
గరుణ పూని యుండు; దరయ నెప్పుడు నిట్టు
లైన మనకుఁ గార్యహాని గాదె.”

⁠ 410


వ.⁠

అని పూర్వవైరస్మరణకలుషితుం డై పలికిన నతనికి నజాతశత్రుండు సాంత్వ
నపూర్వకంబుగా ని ట్లనియె.

⁠ 411


ఆ.⁠

“కావరయ్య యనినఁ గరము దుర్బలుఁ డైనఁ
జెనసి యోపినంత సేయు ననిన,
నూరకుండు నయ్య యుత్తమశూరుండు
దీనజనుల యున్నతెఱఁగు సూచి?

⁠ 412


క.⁠

శరణం బని వచ్చిన భీ
కర[4]శత్రువు నయిన బ్రీతిఁ గావఁగవలయుం;
గరుణాపరులతెఱం గిది;
యిరవుగ సరిగావు దీని కేధర్మంబుల్.

⁠ 413


వ.⁠

ధృతరాష్ట్రసూనుండు భవదీయబలశౌర్యంబులపేర్మి యెఱుంగుం గావునఁ ద
న్ను నవశ్యంబును విడిపింతురని మనదెస బద్ధాశుం డై యుండు; నిది మనకుఁ

⁠
  1. ↑ గర్వాంధిత ... యపహాసింపఁగ వచ్చె ... సద్యంబు; తథ్యంబె
  2. ↑ మతి
  3. ↑ డగు నైనను
  4. ↑ శత్రుని నైనఁ