| |
నేను నారాయణుండ; ననూనశక్తి
యుతులమై మర్త్యయోనిఁ బుట్టితిమి [1]పేర్మి.
| 131
|
| తరువోజ. |
నిరతంబుగా నేను నీ వను భేద
నియమంబు లే; దైక్యనిష్ఠయ మనకు
నిరువురకును; నీకు నిష్టుండ నాకు
నిష్టుండు; మఱి నీకనిష్టుండ నాకుఁ
గర మనిష్టుం; డట్లు గా నమ్ము” మనుచు
ఘనభుజుల్ భువనోపకారైకమతులు
హరియు నర్జునుఁడుఁ బ్రియంబుతోఁ దగిలి
యన్యోన్యహితభాషు లగుచుండునంత.
| 132
|
ద్రౌపది శ్రీకృష్ణునితోఁ దనపరిభవంబు సెప్పి దుఃఖించుట
| వ. |
అఖిలరాజలోకపరివృతుండయి యున్న నారాయణు నొద్దకు వచ్చి ద్రుపదరాజ
పుత్త్రి ముకుళితకరాంబుజ యయి యి ట్లనియె దేవా “నిన్ను నాదిప్రజావర్గంబునఁ
బ్రజాపతివని యసితుం డయిన దేవలుండును, సత్యంబువలన యజ్ఞం బుద్ధరిం
చుటం జేసి నిత్యసత్యమయుండ వయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును,
శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును,
నవయంబుల లోకంబులు నభివ్యాపించుట జేసి సర్వమయుండ వని నారదుం
డును, నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి.
| 133
|
| మధ్యాక్కర. |
అని ననివృత్తులై పుణ్యచరితు లై, యాత్మప్రబోధ
వినిహితచిత్తులై, సర్వధర్మార్థవిదులయి తృప్తిఁ
దనరెడు రాజర్షి వరులకును, యోగధరులకు సాధు
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య!
| 134
|
| వ. |
నీయంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం
బెఱింగించెద.
| 135
|
| సీ. |
పార్థివప్రభుఁ డైన పాండుమహీపతి
కోడల నయి, యుద్ధకుశలు లయిన
[2]పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ
వైన నీ యనుజనై, యధికశక్తిఁ
బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు
పట్టిచే సభఁ దల పట్టి యీడ్వఁ
బడి పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ
బడి, దారుణంబైన పరిభవంబు
|
|
| ఆ. |
పడితి; నట్టి నన్నుఁ బాండవుల్ సూచుచు
నుండి రొరులువోలె నుక్కుదక్కి;
యాపగాతనూజుఁ డాదిగాఁ గల వృద్ధ
బంధుజనులు సూచి పలుక రయిరి.
| 136
|
| క. |
శరణనినవారిఁ గరుణా
కరు లయి రక్షించు పురుషకారాన్వితు లే
శరణని యఱచిన [3]నాలిం
పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్?
| 137
|
| వ. |
భ్రాతృపుత్త్రబంధుజనంబులు నాకుం గలిగియు లేనివా రయి; రట్టి యెడం గర్ణుం
డు నన్నుం జూచి నగియె.
| 138
|
| ఆ. |
కర్ణునగవు లోక గర్హితుండగు దుస్స
సేను [4]చెయిదికంటె శిఖియపోలె
|
|
- ↑ నెమ్మి
- ↑ పాండవవీర్యుల భార్యనై పూజ్యుండు నైన నీ ... నుండి రుక్కణంగి యొరుల పోలె, నాపగాతనూజుఁ
- ↑ వారి, పర భీమార్జునుల
- ↑ చెయ్వు