Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

ఇట్లు సనుదెంచుకురువీరుల కడ్డంబు వచ్చి కొందఱు గంధర్వులు ప్రియపూర్వకం
బుగా “నిట యేల వచ్చెదరు? మీకు మాతోడి విద్వేషం బేటికి? నిలువుం” డనినం
బెలుచ నార్చి సేనాగ్రచరులు వారలమీఁదం బ్రచురశస్త్రాస్త్రపాతంబు సేయం
దొడంగినం దొలంగి చని యా గంధర్వు లాక్షణంబ చిత్రసేనునకు నంతయుఁ
జెప్పి పుచ్చినం బ్రబలరోషరంజితాననుం డై యతండు.

⁠ 388


క.⁠

“చనుఁడు రయంబున నాదు
ర్జనులం గౌరవులఁ బొదివి సమయింపుఁడు మీ”
రని బహుసహస్రసంఖ్యులఁ
బనిచెను గంధర్వవరులఁ బ్రకటితబలులన్.

⁠ 389


వ.⁠

ఇట్లు వనిచిన.

⁠ 390


ఉ.⁠

ఆయతకుంతకార్ముకగదాసిపరశ్వథశూలపట్టిసా
ద్యాయుధఘోరహస్తులు, గులాచలతుంగతనుల్, ప్రచండతే
జోయుతు లావియచ్చరులు శూరత మై నడతెంచి బల్విడిం
గో యని తాఁగి రుగ్రరణకోవిదు లై కురురాజసైన్యమున్.

⁠ 391


వ.⁠

ఇవ్విధంబున గంధర్వులు బెట్టిదంబుగాఁ గిట్టి నొప్పింపం దొడంగినం గలంగి
దుశ్శాసనాదికౌరవులు ససైన్యంబుగాఁ దెరలి దుర్యోధనుచేరువకుం బఱచినఁ,
గర్ణుం డొక్కరుండ సుస్థిరుం డయి నిలిచి, గంధర్వుల నిలువరించి, భల్లార్ధచం
ద్రప్రముఖబహులబాణపాతంబులం దదీయదేహంబులు ఖండించుచు నిమిష
మాత్రంబునఁ జిత్రసేను సైనికశతంబుల రూపుమాపుటయు, మఱియుం బైపై
గంధర్వులు శతసహస్రసంఖ్యులు తోఁతెంచినం బృథివి యెల్లను గంధర్వమ
యం బైన ట్లుండె నప్పుడు.

⁠ 392


చ.⁠

శకునియుఁ దమ్ములుం బ్రబలసైన్యముతో నడతేర, నాహవో
త్సుకమతి యై సుయోధనుఁడు సూత[1]తనూభవుఁ డున్నచోటికిం
బ్రకటభుజోగ్రతం గడఁగి బల్విడిఁ దద్రిపుకోటి దాఁకినన్
సకలజగద్భయంకరలసత్సమరోత్సవ మయ్యె నయ్యెడన్.

⁠ 393


క.⁠

కొండొకసేపునకు మహో
ద్దండనృపానేకఘోరతరవిశిఖవ్యా
ఖండితశరీరు లై ధృతి
ఖండితముగఁ బల్లటిలిరి గంధర్వు [2]లనిన్.

⁠ 394

చిత్రసేనుం డనుగంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట

క.⁠

గంధర్వులు దెరలుట విని
గంధర్వవిభుండు క్రోధకలుషితమతి యై
గంధగజముచందమున మ
దాంధగతిం గవిసెఁ గౌరవానీకముపై.

⁠ 395


వ.⁠

ఇట్లు గవిసి చిత్రసేనుండు.

⁠ 396


శా.⁠

మాయాసంగరకోవిదుండు, వికసన్మాయాస్త్రజాలంబులన్
వాయువ్యాప్తి యడంగ, నర్కకిరణవ్రాతంబు రుద్ధతంబుగాఁ
జేయం జొచ్చినఁ ద్రెళ్ళెఁ దేరులు, కరుల్ శీర్ణంబు లయ్యెన్, దళ

⁠
  1. ↑ తనూ(జుఁడు బోరు)జునియున్నచోటికిన్ ... గడచి బల్విడిఁ
  2. ↑ లొగిన్