Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్యోధనుఁడు ఘోషయాత్ర వోవుట

సీ.⁠

అంతఁ బ్రహృష్టాత్ముఁ డై, లలితాంబరా
                 భరణాంగరాగవిస్ఫురితమూర్తి
నొప్పారి, విభుఁడు సహోదరులును గర్ణ
                 గాంధారులును, బ్రియబాంధవులును
సముచితవాహనసైన్యసమేతు లై
                 కొలువంగ, వెడలె నుజ్జ్వలవిభూతి
నాందోళికాదివాహనములఁ దత్ప్రియ
                 ప్రమదలు బహుసహస్రములు సనిరి;

⁠


ఆ.⁠

కడఁగి పౌరు లెల్లఁ గైసేసి పడఁతులుఁ
దారు నడచి రతిముదంబుతోడఁ;
బ్రకటశకటవైశ్యపణ్యాంగనాదిసం
[1]కులము నుల్లసిల్లె ఘోషయాత్ర.

⁠ 373


వ.⁠

మఱియు నమ్మహీపతిపయనంబున కనురూపంబుగా నెనిమిదివేలు రథంబులు,
మువ్వదివే లేనుంగులుఁ, దొంబదివేలు గుఱ్ఱంబులు, శతసహస్రసంఖ్య కాల్వు
రుం గలమహాసైన్యంబు తోడ నడిచె; మృగయాకుశలు లైన మృగయులు, విట
విదూషకవందివైతాళికాదిజను లనేకు లనుగమించి; రిట్లు గవ్యూతిమాత్రం
బగునేల యరిగి, యచ్చట విడిసి, యద్దినశేషంబును రాత్రియుం గడిపి, మఱు
నాఁడు వివిధగిరిగహనంబు లతిక్రమించి, ఘోషంబు లున్నవనంబు సొచ్చి
యం దొక్కరమణీయప్రదేశంబున శిబిరంబు గావించి యమ్మనుజేంద్రుండు.

⁠ 374


సీ.⁠

నానాసహస్రసంఖ్యానంబు లై, సంత
                 తానందవిగతభయత్వలీల
నక్కాననమున నేదిక్కు సూచిన నతి
                 సంకులంబుగఁ గుందశంఖచంద్ర
హారనీహారడిండీరపటీరము
                 క్తాహార[2]హీరసంకాశములును,
గాదంబకాలేయకాదంబినీనీల
                 జాలతమాలికాసన్నిభములు,

⁠


తే.⁠

ప్రౌఢబంధూకపల్లవభాసితములు
వికచకాంచనచంపకవిస్ఫుటములు
నైనవర్ణంబు లొప్ప నేత్రాభిరామ
భంగి నలరారుగోకదంబులఁ గనియె.

⁠ 375


వ.⁠

కని తదీయసమృద్ధికి సంతసిల్లుచు గోపాలజనంబులు సవినయంబుగాఁ దన్నుం
గాంచిన నాదరించి, వారు దనకు నగ్గోవులపేళ్లును లక్షణంబులు నేర్పడ నెఱిం
గించుచుండఁ బేరువేర వత్సంబులు వత్సతరంబులు మహోక్షంబులు ధేనువు
లు దర్ణకంబులు మొదలైనగోవిశేషంబుల నాలోకించుచు, నయ్యైవిధంబులఁ
బసికిం దగినరక్షణంబు గావింప నర్హజనంబుల సవిశేషంబుగా నియోగించి
మఱియును.

⁠ 376


క.⁠

గోపాలసమన్వితుఁ డై
యాపొలమునఁ దిరిగి గోరసాస్వాదనలీ
లాపరితృప్తి దలిర్చె మ
హీపాలుఁడు నెమ్మితోడ నిష్టులుఁ దానున్.

⁠ 377


వ.⁠

తదనంతరంబ గాయకనర్తకాదులు, వందిమాగధజనంబులుం గనిన నాదరించి
వారికి నభిమతధనంబు లొసంగి మృగయావినోదంబునకుం దొడంగి.

⁠ 378


మ.⁠

హరిణవ్రాతములం గలంచుచు, నుదగ్రానేకపశ్రేణిఁ జె

⁠
  1. ↑ కులత
  2. ↑ కాశసంకాశములును, గాదంబకౌశేయకాందబినీనీలజలజాతమాలికా ... భంగిఁ దనరారు