Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

త్మునిం బ్రశంసించిరి; వా రివ్విధంబున నభీష్టకథాగోష్ఠిం బ్రవర్తిల్లునెడఁ గృష్ణ
వల్లభ యైన సత్యభామయుఁ బాంచాలియు నేకతంబ యొక్కయెడఁ బ్రియ
సల్లాపసంసక్త లై యుండి; రప్పుడు సత్యభామ ద్రౌపది కి ట్లనియె.

⁠ 290

సత్యాద్రౌపదీసంవాదము

సీ.⁠

“నీప్రియభర్తల, నిర్మలచరితులఁ
                 బ్రకటతేజుల, లోకపాలనిభులఁ
బార్థుల నీ వొకభంగిన వదలక
                 చెలువ యెబ్భంగి భజింతు? దగిలి
యొక్క రొక్కనికంటె నువిద నీ కేవురు
                 ననురక్తు లగుట యత్యద్భుతంబు;
నగుమొగంబుల కాని [1]నలినాక్షి నీదెసఁ
                 బతులకుఁ గింకిరిపాటు లేదు;

⁠


తే.⁠

వ్రతము పెంపొ, మంత్రౌషధవైభవంబొ,
సరసనైపథ్యకర్మకౌశలమొ, చతుర
విభ్రమోల్లాసరేఖయొ వెలఁది! నీవి
శేషసౌభాగ్యహేతువు సెపుమ నాకు.

⁠ 291


క.⁠

ఏనును నీవలన నిజము
గా నిది యంతయును నెఱిఁగి, కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య
నూనస్నేహాను[2]భావయుక్తిఁ దలిర్తున్.”

⁠ 292


క.⁠

అని యడిగిన మది నించుక
గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచుఁ, గృష్ణభామినిఁ
గనుఁగొని యి ట్లనియె నిర్వికారాకృతి యై.

⁠ 293


క.⁠

“నను నిట్లు దుష్టవనితా
[3]జనము నటులు గాఁ దలంపఁ జనునే నీకున్?
మన సొప్పదు; పురుషోత్తము
వనితవు గాఁ దగవు నీవు వనరుహనయనా.”

⁠ 294


వ.⁠

అని మేలంపుఁజందంబున దానివివేకవిహీనత యెఱుకపడ నాడి పాంచాలి
మఱియు ని ట్లనియె.

⁠ 295


చ.⁠

“అలయక మంత్రతంత్రవివిధౌషధభంగుఁ జేసి యెంతయున్
వలతురు నాథు లంట మగువా! కడుబేలతనంబు; దాన మున్
గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని, యొకండును సిద్ధిఁ బొంద; ద
[4]ప్పొలఁతుకతోడి మన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్.

⁠ 296


చ.⁠

మగువ యొనర్చు వశ్యనిధి, మందులు, [5]మాకులు నొండుచందమై
మగనికిఁ దెచ్చు రోగములు, మానక మూగజడాదిభావముల్
మొగి నొనరించు నద్దురితముల్ దనచేసినచేఁత లై తుదిన్
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్.

⁠ 297


క.⁠

కావునఁ బతులకు నెప్పుడుఁ
గావింపం దగదు కపటకర్మంబులు; ద
ద్భావ మెఱిఁగి యనువర్తిని
యై వనిత చరింప నదియ యగు నెల్లవియున్.

⁠ 298


వ.⁠

పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టి సౌభాగ్యంబు నందితి నది నీకు నెఱిం
గించెద నేర్పడ వినుము.

⁠ 299


సీ.⁠

పతు లాత్మ నొండొక్కపడఁతుల గలసిన
                 నలుగ; నెయ్యెడల సహంకరింప;

⁠
  1. ↑ నాతి నీదెస నెప్డుఁ, ... గింకటిపాటు
  2. ↑ భోగ
  3. ↑ జనంబున ట్లడుగఁ దలఁపఁ
  4. ↑ ప్పొలఁతుల
  5. ↑ మాయలు