| తే. |
“పుత్త్ర! విను మేను దక్షునిపుత్త్రి; నన్నుఁ
బావకున కిచ్చె మాతండ్రి బాల్యమునను;
నన్ను నతఁ [1]డొల్లఁ డెంతయు నాకుఁ బతికి
నెపుడు నెడలేని పొందుగా నీ వొనర్పు.”
| 259
|
| వ. |
అనిన నగ్నిభవుండు మహాద్విజులు వహ్నియందు హవ్యంబులు స్వాహాకారకలి
తంబు లయినమంత్రంబుల నొసంగువారు; దానం జేసి నీకుఁ బ్రియునితోడి నిత్య
సహవాసంబు సిద్ధించు” ననియె; నప్పుడు సకలమునిగణసమేతుం డై చనుదెంచి
కమలాసనుండు మహాసేను నభినందించి యంతకు మున్న సన్నిహితుం డై
యున్నమహాదేవుదెసఁ జూచి యతని కి ట్లనియె.
| 260
|
| ఆ. |
అనఘ! యితఁడె త్రిపురహరుఁడు త్రిలోచనుం;
డిదె త్రిలోకమాత హిమనగేంద్ర
తనయ; వీరు నీకుఁ దల్లియుఁ దండ్రియుఁ
జువ్వె; వీరిఁ గొల్వు సుచిరభక్తి.
| 261
|
| వ. |
అగ్నిదేవునియందును, దదీయభార్యయందును దారు నిజయోగబలంబునం జేసి
యావేశించి యాదంపతులు లోకహితార్థంబుగా నిన్నుం గని” రని చెప్పినఁ బా
ర్వతీనందనుండు సానందహృదయుం డయి సకలలోకగురువు లైనపార్వతీపరమే
శ్వరులం బూజించి, సంస్తుతించె; నంత నింద్రుండు గార్తికేయునకు నైరావణ
భూషణం బైనఘంటాద్వయంబు నొసంగిన, నం దొక్కటి కుమారుండు గై
కొని యొక్కటి విశాఖున కిచ్చెం; బదంపడి.
| 262
|
ఈశ్వరుండు గుమారసహితుం డై భద్రవటంబు సేరుట
| మ. |
తనయుం గౌఁగిటఁ జేర్చుచున్, వరుస మూర్ధఘ్రాణముం జేయుచున్
జనితానందమనస్కుఁ డై గిరిసుతాసంయుక్తుఁ డీశానుఁ డ
య్యనఘుం దోడ్కొని బద్ధకేసరిసహస్రస్యందనారూఢుఁ డై
చనియెన్ భద్రవటస్థలంబునకు నైశ్వర్యం బవార్యంబుగన్.
| 263
|
| వ. |
అమ్మహాదేవుముందట ననేకయక్షగణపరివృతుండును బుష్పకాధిరూఢుండును నై
కుబేరుండును, వెనుకదెస నమరగణసమన్వితుండును, నైరావతారోహణోల్లా
సియు నై వాసవుండును, దక్షిణపక్షంబునం బ్రబలరక్షోయక్షరక్షితుం డై య
మోఘనామధేయుం డైనయక్షోత్తముండును, గృతపరికరు లైనవసురుద్రాది
త్యులును, దాపలి[2]పక్కంబున నతిభయంకరవ్యాధిమృత్యుపరివేష్టితుం డై పితృ
పతియును, వివిధయాదోనివహసనాథుం డయినవరుణుండును నడచిరి; మఱియు
మూర్తిమంతంబు లై శూలపట్టిసగదాముసలాదికంబు లైనయద్దేవునాయుధం
బులుఁ, గమండలుప్రముఖోపకరణంబులుం జనియె; నయ్యాదిదేవునకు నాస
న్నుం డయి చంద్రుండును ధవళాతపత్రంబు ధరియించె; ననిలాగ్నులు చామర
హస్తు లై కొల్చిరి; విద్యయు, సావిత్రియు, గాంధారియుఁ, గేశినియు ననుదేవాంగ
నలు దాక్షాయణిం గొల్చి చనిరి; త్రిలోచనసఖుం డైనపింగళుం డనుయక్షుం
డు వృషభకేతనంబు దాల్చె; నివ్విధంబున నభిరామవిభవోదారుం డై కుమార
|
|
- ↑ డంత యొల్లఁడు
- ↑ పక్షంబున