| |
యాదివసము పంచమి లో
కాదరణీయంబు, లక్ష్మి కాస్పద మయ్యెన్.
| 239
|
| వ. |
ఇట్లు విహితమంగళాచారుం డయినకుమారుపాలికిం జనుదెంచి నిజభర్తలచేతం
బరిత్యక్త లైనమునిభార్య లార్వురు నధికదైన్యవివర్ణవదన లై యి ట్లనిరి.
| 240
|
| చ. |
“కనుకనిఁ దూరి దుర్జనులు గానక చూడక యేము హవ్యవా
హనునకు నిన్నుఁ గంటి మని యాడిన, [1]నందుల కోడి మమ్ముఁ జ
య్యనఁ బతు లుజ్జగించిరి; ప్రియంబున నిం కిట నీవు మాకు నం
దనుఁడవు; మమ్ముఁ బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్.
| 241
|
| తే. |
పుణ్యలోకంబులకుఁ బాసి పొక్కుచున్న
మమ్ముఁ జేకొని కరుణాసమగ్రబుద్ధిఁ
బుణ్యహతియందు నిల్పుము; పుత్త్రభావ
దృష్టి వెలయ మాయలమట దీర్పవయ్య.”
| 242
|
| క. |
అనినఁ గుమారుఁడు వినయం
బున నిట్లను “నేను మీకుఁ బుత్త్రుఁడ మీరల్
ననుఁ గన్నతల్లులరు; వినుఁ
డనుమానం బేల? మీప్రియం బొనరింతున్.
| 243
|
| సీ. |
అనుచుఁ జేరువ నున్న యనిమిషపతిఁ జూచి
“వీరికిఁ దగుపదం బారయంగ
వలయు” నావుడు బలవైరి యిట్లనుఁ “జంద్ర
సతు లైన యాదక్షసుతలలోన
రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు
నా నొక్కచుక్క దాఁ బూని యిప్పు
డందఱకంటె నత్యంతవల్లభ నేన
యగుదుఁ జంద్రునకని వగచి యర్థిఁ
|
|
| ఆ. |
దపము సేయ నరిగెఁ, దత్పదం బది రిత్త
యున్నయదియు; వీరి నునుపు మచట”
ననిన వారిఁ బ్రీతి నతడు వీడ్కొలిపినఁ
గడఁగి వారు సనిరి గగనమునకు.
| 244
|
| వ. |
నాఁటంగోలెఁ గృత్తిక లార్వురు నగ్నిదైవత్యం బనం బరగునక్షత్రం బై దివం
బున వెలింగిరి; తదనంతరంబ స్వాహాదేవి యేతెంచి కుమారుం గని “నీవు మత్పు
త్త్రుండవు; నిత్యంబును నీపాల వసియింపవలతు” ననినం బ్రీతుం డై యాతం
“డట్లకాక, నీవు మత్సమీపంబుననుండి, యేనును నీకోడలుం గొనియాడం బ్రియం
బున నుండు” మనియె; నప్పుడు కుమారమాతృకలు హవిషయుఁ, గాళియుఁ, గౌశి
కయు, నుద్ధతయు, శారికయు, నార్యయు, వైధాత్రియు ననువార లేడ్వురుం గు
మారుముందట నిలిచి యి ట్లనిరి.
| 245
|
| ఉ. |
“మమ్ము జగత్త్రయంబునకు మాతలఁగా నొనరింపు మిప్డు, ము
[2]న్నిమ్ముల నొప్పుమాతృకల కెక్కుడు గావుత మేము, సర్వలో
కమ్ములఁ దొంటిమాతృకలఁ గైకొనకుండుటయుం, బ్రియంబుతో
మ మ్మనిశంబుఁ గొల్చుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!”
| 246
|
కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబులఁ జేయుట
| ఆ. |
అనిన నగుచు నాతఁ “డ ట్లేల వారల
పేర్మి మాన్పఁ దగవె? ప్రీతి నొండు
వరము వేఁడుఁ డిత్తు వదలక” యనుడు నా
స్కందమాత లనిరి గారవమున.
| 247
|
| క. |
“అగుఁ గాక యట్ల; యే మీ
జగములఁ గలశిశువులకు నజస్రముఁ బీడల్
|
|
- ↑ నిందకు నోడి
- ↑ న్నెమ్మెయి నొప్పు