Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బులు, మంగళతూర్యారావంబులు, నప్సరోనర్తనంబులుఁ, గల్పతరుకుసుమవర్షం
బులు సమకాలప్రవృత్తంబు లయ్యెం; బరార్థ్యభూషణమణిప్రభాలంకృతం
బైనకుమారుమౌళిభాగంబున నుజ్జ్వలం బైనధవళాతపత్రంబు సురగిరిశిఖరో
పరిగతం బగుశరచ్ఛంద్రబింబంబు ననుకరించుచుండె; నట్టియెడ.

⁠ 232

ఈశ్వరుండు గుమారస్వామియొద్దకు వచ్చుట

శా.⁠

నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్రరే
ఖా[1]నవ్యాంచితమౌళి, భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుఁ, డీ
శానుం, డానతశంకరుండు గిరిజాసంయుక్తుఁ డై వచ్చెఁ ద
త్సేనానిం బ్రియసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్.

⁠ 233


వ.⁠

ఇట్లు వచ్చి మహాదేవుండు మహాసేనుం గౌఁగిలించుకొని యతనికి విశ్వకర్మనిర్మి
తంబును, హేమమయంబును నయినపుష్పమాలిక యొసంగె” నని చెప్పి[2]మార్కం
డేయుండు పాండవేయున కి ట్లనియె “వినుము; రుద్రుండు మున్ను నిజవీర్యంబు
వహ్నియందు సంగ్రహించినఁ దత్తేజోవిశేషంబునం జేసి పావకుండు గుమారు
నుత్పాదించె; నదియునుం గాక యగ్ని రుద్రుం డని వేదవిదు లైనవిప్రులవలన
వినంబడు; న ట్లగుటం గుమారుండు వహ్నిసంభవుండును, రుద్రసూనుండును
నని చెప్పంబడియె; నగ్నిభామిని గృత్తికాఖ్య లైనమునిపత్ను లార్వురరూపం
బులు గైకొని ప్రియాసమాగమంబు సలిపి శ్వేతశైలంబున రేతస్కందంబు సే
యుటం బ్రభవించినవాఁడు గావునఁ గార్తికేయ, స్కందనామంబులం బరగె”
నని చెప్పి యి ట్లనియె.

⁠ 234


తే.⁠

“అప్పు డింద్రుండు మున్ను దా నబ్జ భవు ని
యోగమున సురక్షితముగ నునిచి నట్టి
దేవసేనకుఁ గన్యకాతిలకమునకుఁ
జెలువముగ నలంకారంబు సేయఁ బనిచి.

⁠ 235


వ.⁠

సముచితప్రకారంబున నచ్చటికిఁ దెప్పించి, కుమారుం జూచి “యిక్కన్నియ భ
వదర్థం బై బరమేష్ఠిచేత సృజియింపంబడియె; గావున నివ్వరవర్ణినిం బరిగ్ర
హింపు” మనిన నప్పార్వతీనందనుండు మందస్మితసుందరవదనారవిందుం
డయి యమ్ముహూర్తంబునందు.

⁠ 236


ఉ.⁠

మానితవిక్రమోజ్జ్వలుఁడు మంగళతూర్యనినాద మొప్పఁ, దే
జోనిధి వహ్నిసాక్షిగ, విశుద్ధవిధిజ్ఞుఁడు దేవమంత్రి మం
త్రానుగమం బొనర్పఁగఁ, బ్రియం బెసలార వరించెఁ జారుప
ద్మాసన దేవసేనఁ గరియానఁ గరగ్రహణప్రయుక్తితోన్.

⁠ 237


ఆ.⁠

గుహుఁడు దేవసేనఁ గోరి పెండిలి యైన
యాదినంబు షష్ఠి యగుటఁ జేసి
యర్చనీయ మయ్యె నాదివసంబు లో
కముల [3]నెల్ల వెలసె గారవమున.

⁠ 238


క.⁠

ఏదినమునందు షణ్ముఖు
శ్రీదేవి వరించెఁ గమలచిహ్నితకర యై

⁠
  1. ↑ నద్ధాంచిత ... వీక్షింపంగఁ బ్రేమంబుతోన్
  2. ↑ చెప్పిన విని ధర్మజుండు “కుమారుఁడు రుద్రాంశుజుఁ డని చెప్పుదు; రది యె?” ట్లనిన మార్కండేయుండు
  3. ↑ కెల్లఁ గరము