Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

నధికు మాయన్న బకాసురు, నా
                 యిష్టసఖు హిడింబాసురుఁ జంపి యున్న
ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపిఁ
                 దడయక మ్రింగిన తపసి యట్ల”

⁠


ఆ.⁠

యనిన [1]రక్కసునకు నలిగిన యగ్రజు
నలుక యెఱిఁగి వీరుఁ డర్జునుండు
మొనసి గాండివంబు మోపెట్టె సునిశిత
ఖడ్గపాణు లైరి కవలు నంత.

⁠ 116

కిమ్మీరుఁ డను రాక్షసుఁడు భీముచేఁ జచ్చుట

ఉ.⁠

ఘోరపరాక్రముల్, ప్రబలకోపపరుల్, పృథుసారభూరిభూ
మీరుహపాణు, లుద్ధతు, లమిత్రవిఘాతులు, వీరబృందబృం
దారకు లార్చు చొండొరులఁ దాఁకిరి దారుణభంగిఁ బొంగి కి
మ్మీరసమీరసూనులు సమీరవిధూతపయోధు లట్లయై.

⁠ 117


తరలము.⁠

పొరిని వారలచేతి యున్నత[2]భూరుహాయుధముల్ పర
స్పరకఠోరశిరస్స్థలంబులపై వడిం బడి మత్తకుం
జరశిరఃపతితంబు లైన లసన్మృణాళము లట్ల జ
ర్జరిత మయ్యెఁ దదారవప్రతిశబ్ద మొప్ప నగంబులన్.

⁠ 118


వ.⁠

ఇ ట్లొక్కముహూర్తంబు వృక్షయుద్ధంబు సేసి యాసన్నమహీరుహంబులు
సమసిన, నయ్యిద్దఱు శిలాయుద్ధంబునకుఁ దొడంగి చేయునెడం బవనజనిక్షిప్త
నిష్ఠురశిలాహతహృదయుం డై భానుం బట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ
గిమ్మీరుండు భీముం బట్టుకొనిన, భీముండును వాని హీనంబలుం గా నెఱింగి;
కృతాంతదండానుకారంబు లయిన తనబాహుదండంబుల నమ్మనుజకంటకు కటి
కంఠప్రదేశంబులు పట్టుకొని, నేలం బెట్టి, దేహయష్టి విఱిచి, బకుం జంపిన విధం
బునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి.

⁠ 119


తే.⁠

“బకహిడింబులు హతులైన బనివిపనివి
యఱచి [3]శోకింపఁ గానక యమపురమున
కరిగి తక్కట రాక్షస” యనుచుఁ దెరువు
వాయఁ బావని దత్కళేబరము వైచె.

⁠ 120


వ.⁠

ఇట్లు ధర్మరాజూ వచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసు
లకు రాక్షసభయం బుడుపిన మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్జుననకులసహ
దేవులును ధౌమ్యాదిమహీసురవరులు బ్రశంసించి” రని విదురుండు [4]గిమ్మీరు
వధ సెప్పిన విని ధృతరాష్ట్రునకు హృదయదళనం బయ్యె; నిట పాండవులు
గామ్యకవనంబున నుండునంత.

⁠ 121

యాదవపాంచాలాదులు పాండవులకడ కేతెంచుట

సీ.⁠

వసుమతీ రాజ్యంబువలన నిరస్తులై
                 మునివృత్తి నత్యుగ్రవనములోన
నవయుచుఁ బాండుభూనాథనందను లున్న
                 వారని విని యతిక్రూరమతుల

⁠
  1. ↑ నగ్రజునకు నలిగినరక్కసు
  2. ↑ భూరిభూరుహముల్ ... నభంబునన్
  3. ↑ శోకించి
  4. ↑ గిమ్మీరవధ...నట