Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.⁠

“బలముం దేజము [1]నించి లోకముఁ గృపం బాలించు; టర్కేందుభూ
జలతేజఃపవనాంబరంబులకు నస్థైర్యంబు గాకుండ ని
శ్చలశక్తిస్థితి నీగి; శిష్టజనరక్షాదుష్టశిక్షాసమా
కలనం బింద్రపదస్థుఁ డౌ నతనికిం గర్తవ్యముల్ షణ్ముఖా.”

⁠ 225


చ.⁠

అనునెడ నింద్రుఁ డి ట్లనియె “నట్లయినం గడులెస్స; దేవ! నీ
వనిమిషనాయకత్వమునయం దభిషిక్తుఁడ వై ముదంబుతో
ననుఁ బనిగొమ్ము నీదు కరుణన్ దొసఁగెల్లను [2]దీఱి యుండెదన్;
ఘనతరశౌర్యసారుఁడవు గావున నర్హుఁడ వింద్రలక్ష్మికిన్.

⁠ 226


వ.⁠

ఏను దేవేంద్రపదవి నుండనోడుదు; నెట్లనిన భవదీయతేజోవిశేషంబులు సూ
చి విస్మితులై కొందఱు నీకు నింద్రపదవియందు వేడ్క పుట్టునట్లుగా నేమేనిం
జెప్పి నావలనం గొఱగామి కల్పించి నీకును నాకును భేదంబు సేయం జూతురు;
దానం జేసి నీవు కుపితుండవై నాయెడం గృప దప్పిన నెవ్వారికి వారింపన
లవిగాదు; లోకభయంకరం బైనవిగ్రహంబు ప్రవర్తిల్లుఁ గావున నవశ్యంబును
దివిజరాజ్యంబు నీక యొప్పించితి; మమ్మెల్ల నేలికొ” మ్మనినఁ గుమారుండు
నవ్వుచు ని ట్లనియె.

⁠ 227


ఉ.⁠

“[3]అట్టివి యేల పుట్టు? నమరాధిప! నీవ జగత్ప్రభుండవై
యిట్టులమైన తేజము వహించి సుఖంబున నుండు; మేను నీ
చుట్టమనై భుజాబలము సొంపున నీ కెలసంబు దీర్చెదం;
జట్టన నన్నుఁ బంపుము; భృశంబుగ నెయ్యది కార్య మిత్తఱిన్.”

⁠ 228


చ.⁠

అనవుడు సంతసిల్లి యతఁ డాతని కి ట్లను; “నట్టులైన నీ
పనుపున నేను సత్యహితభాషణ! యింద్రపదంబునందు ని
ల్చి నెగడువాఁడ నైతి; సురసేనల కెల్లను నాయకుండవై
ఘనభుజ! నీవు సత్కృప జగద్భయ[4]మోచన మాచరింపవే.”

⁠ 229


వ.⁠

అనినఁ గుమారుండు మరుత్పతి కి ట్లనియె.

⁠ 230


ఉ.⁠

“నీకుఁ బ్రియంబుగా భవదనీకినికిం బతి నయ్యెదన్ భుజో
త్సేకపటుప్రతాపము లజేయములై పెనుపొందఁ బేర్చి; ఘో
రాకృతు లైన నీరిపుల నందఱఁ దున్మెద; సర్వలోకర
క్షాకరణైక[5]వృత్తి నవికల్పుఁడ నయ్యెదఁ గట్టు పట్టమున్.”

⁠ 231


వ.⁠

అనిన నతిప్రీతుం డగుచుఁ బురుహూతుండు సకలసురమునిగణసమేతుండయి త
త్క్షణంబ కుమారునకు నఖిలదేవసేనాధిపత్యంబునం దభిషేకం బొనరించె; ముని
వరుల జయజయశబ్దంబులు, నమరుల సింహనాదంబులుం, గిన్నరగంధర్వగానం

⁠
  1. ↑ నిల్పి; నచ్చి; ఁ జూపి ... ని, శ్చలభక్తిం దగ
  2. ↑ మాని
  3. ↑ అట్టిది ... నీవు జగ ... భృశంబుగ నిట్టి దకార్య
  4. ↑ నోదన
  5. ↑ బుద్ధి