Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

యొక్కనాఁడు మానసం బనుశైలంబునకు జని యం దొక్కయెడ నొక్క
రుండ కార్యచింతాపరుండై యున్నయెడ.

⁠ 176


తే.⁠

‘ఒక్కదనుజాధ[1]ముండు మొఱ్ఱో యనంగ
నన్నుఁ జెఱగొనిపోయెడు; నన్నలార!
యెవ్వ రిట విడిపించరే? యింతవట్టు
పుణ్యమునఁ బోవ రయ్య కారుణ్యబుద్ధి.’

⁠ 177


వ.⁠

అని యిట్లు సువ్యక్తం బైనవనితావిలాపంబు వీతెంచినం బురందరుండు నిజాం
తంరంగంబు గరుణాతరంగితం బగుటయు “నోడ కోడ కిదె యేను వచ్చితి” ననుచు
నద్దిక్కునకు నడచి, ముందట నతిభయంకరాకారుం, బటుగదాహస్తు, నప్రచలిత
విద్యుల్లతారుచిరమూర్తి యైనదాని నొక్కకన్నియం గొని గగనతలంబునం బఱ
చువానిం, బ్రబలవలాహకవినీలదేహుఁ, గేశి యనుదానవుం గని సరభస్తుం డై.

⁠ 178

ఇంద్రుఁడు గేశి యనురాక్షసునిఁ బాఱఁదోలుట

ఉ.⁠

“ఓరి దురాత్మ! యీయబల నోడక యేటికిఁ బట్టినాఁడ? వం
భోరుహనేత్ర విడ్వు; మెటవోయినఁ బ్రాణము గొందు, [2]నింకఁ; బ్ర
స్ఫారమహీధరప్రకరభంగవిహారధురీణ, ముగ్రదై
త్యారుణరంజితోగ్రకులిశాస్త్రము సుమ్మిదె” యంచు డాసినన్.

⁠ 179


మత్తకోకిలము.⁠

ఘోరవిక్రముఁ డైనకేశియుఁ గ్రోధఘూర్ణితచిత్తుఁ డై
ధీరుఁ డుక్కున నిల్చి యగ్గద [3]ద్రిప్పి వాసవు వైచె; న
వ్వీరుఁడున్ గద చూర్ణితంబుగ వ్రేసె నాసురభంగిఁ బొం
గారి దారుణవజ్రపాతరయంబునం బటుహస్తుఁ డై.

⁠ 180


ఆ.⁠

అసుర వీఁక నొకమహాచలశృంగంబు
విఱిచి వైచె నమరవిభుని మీఁద;
గోత్రవైరి ఘోరకులిశాభిహతి వ్రయ్య
నడిచె దానిఁ జదల నదరు లెగయ.

⁠ 181


వ.⁠

ఇట్లు దనసాధనంబులు విఫలంబు లైనం దలంకి దానవుం డక్కన్నియ దిగవిడిచి
పఱచిన నింద్రుండు దానిం జేరం జని “నీ వెవ్వరిదాన? వీరక్కసుచేత నెట్లు పట్టువడి?”
తనిన నది యతని కి ట్లనియె “నయ్యా! యే నరిష్టనేమి యను ప్రజాపతి కూఁతుర;
దేవసేన యనుదాన; దైత్యసేనచెలియల; నేనును మాయప్పయుం గేళికౌతుంకం
బునఁ దండ్రియనుమతంబు వడసి సఖీజనసహితంబుగా వెడలి యిమ్మానసనగంబు
సానుదేశంబులం గ్రుమ్మరుచుండం గేశినామధేయుం డైనయీయసురాధముండు.

⁠ 182


క.⁠

పలుమాఱు వచ్చి తనదు
ర్విలసితములు [4]మాకుఁ జూపు వేడుక దోఁపన్;
బలుకును మేలమునఁ; జెనకఁ
దలఁచుఁ, గదియు, మదనకదనదళితహృదయుఁ డై.

⁠ 183


తే.⁠

వానిచేష్ట లన్నియు దైత్యసేన కభిమ
తంబులై యుండు; నాకు నెంతయును దుస్స
హముల; వినవె యమ్మెయిన యక్కమలనయనఁ

⁠
  1. ↑ ముఁడు మొఱయో కడంగి
  2. ↑ నిన్నుఁ ... రంజితాశ్రికులి
  3. ↑ దీర్చి
  4. ↑ సూపు మాకు వేడుకతోడం, బలుకును మనమునఁ జెనకం, దలఁచుం గదియంగ మదనదళితహృదయుఁ డై