Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

త్యపరిమితఘోరతేజో
విపులాత్ములఁ గనియెఁ గపటవృత్తినిపుణులన్.

⁠ 162


వ.⁠

ఆపదియేవురు సుభీముండు, నతిభీముండును, భీముండును, భీమబలుండును, నతి
బలుండు ననువా రొక్కమొగియును సుమిత్త్రుండును, మిత్రవంతుఁడును, మిత్రజ్ఞుండు
ను, మిత్రవర్ధనుండును, మిత్రధర్ముండును ననువా రొక్కమొగియును సురప్రవీరుండు
ను, వీరుండును, సువేషుండును, సువర్చసుండును, సురహంతయు ననువా రొక్క
మొగియును గా నిట్లు మూఁడుమొత్తంబు లై యజమానుల యజ్ఞఫలంబు లపహరిం
చుచుండుదురు; తత్ప్రశాంత్యర్థం బై యాగంబులందు నగ్నిచయనంబు సేయునది.

⁠ 163


తే.⁠

అధిప విహగాకృతుల నొప్పు నగ్నిచయన
ముల యుదగ్ర[1]పక్షాఘాతములను విప్ర
వరుల మంత్రఘోషములను వారు నిహతు
లై భయంపడి చేరరు యజ్ఞభూమి.

⁠ 164


వ.⁠

తపుండు మఱియు సకలయజ్ఞభాగభుజు లైనపుత్త్రుల నేవురం గనియె నం దగ్రజుండు.

⁠ 165


సీ.⁠

వైశ్వానరుం డనువహ్ని చాతుర్మాస్య
                 విధులందు భూసురవితతిచేతఁ
బర్జన్యసహితుఁ డై పరమార్చనముఁ గాంచు;
                 నధిప రెండగు నాతఁ డఖిలమునకుఁ
బ్రభుఁడు దానై విశ్వపతి యన విలసిల్లు;
                 వినుము మూఁడగువాఁడు విశ్వమునకు
నాత్ముఁ డై విశ్వకుం డన నొప్పు; నాలవు
                 నతఁడు భూతముల యాహారవితతి

⁠


తే.⁠

వెలయఁ [2]బక్వము సేయుట విశ్వభుక్కు
నాఁగఁ బెంపొందు; గోపతినామధేయుఁ
డై సమస్తధర్మక్రియలందు హేతు
వై ప్రశస్తి వహించు నే నగు నతండు.

⁠ 166


వ.⁠

మఱియు భానుం డనువహ్నికి సోమపుత్త్రియైన బృహద్భాసయందు బలదుం
డును మన్యుమంతుండును ధృతిమంతుండును నాగ్రయణుండును నగ్నియు
సోముండును నన నార్వురు గొడుకులు, నిశ యనుకూఁతురుం బుట్టిరి; సకల
తపఫలంబులు నిర్వహించుటకయి పురందరుండు మనునామధేయుం డయిన
కొడుకుం బడసె; నమ్మనువు భానుపుత్త్రియైన నిశాకన్యం బెండ్లియై ప్రాజాపత్యుం
డనుపేరఁ బరగి పరమబ్రాహ్మణులచేత నర్చితుం డయ్యె; నివ్విధంబున ననేకవ
హ్నులు సకలధర్మక్రియాసాధకు లై వెలింగిరి; దక్షిణాగ్ని ప్రముఖంబు లయిన వ
హ్నులు వాయుహతిం జేసి యన్యోన్యసంస్పృష్టంబు లయ్యెనేనియు రజస్వలాది
సంకరంబులం బొరసెనేనియు మృతకజాతకాదిసంస్పర్శనంబునం బొందెనేనియుఁ
దత్ప్రాయశ్చిత్తార్థంబై యష్టాకపాలేష్టి సేయవలయు” నని చెప్పి మఱియు మార్కం
డేయుం డి ట్లనియె.

⁠ 167


క.⁠

ఆపుఁ డను వహ్ని యతులిత
రూపసి యయి ముదిత యను తరుణియందు జగ
ద్దీపకు నపారతేజు మ
హా[3]పూజ్యుం గనియె నగ్ని నద్భుతనామున్.

⁠ 168


చ.⁠

అతఁడు త్రిలోకతంత్రము నిరంతరమై చన నిర్వహించుచున్

⁠
  1. ↑ పక్షాహతంబులను
  2. ↑ భక్ష్యము ... నే నపు నతండు
  3. ↑ పుణ్యుం గనియె