| వ. |
అని వానికిం బ్రదక్షిణంబు సేసి, వీడ్కొని చని, కౌశికుండు నిజజననీజనకుల కతి
భక్తి శుశ్రూష సేసి కృతార్థుం డయ్యెం; బాండవోత్తమా! నీ యడిగినతెఱంగునం
బతివ్రతామాహాత్మ్యంబును, బితృశుశ్రుషావిశేషంబును, హీనవర్ణుం డయిన
వాఁడు ధర్మంబు సలుపునుపాయంబును జెప్పితి” ననిన విని ధర్మతనయుం
డు సంతసిల్లి మఱియు మార్కండేయు నిట్లని యడిగె.
| 145
|
| తే. |
“అగ్నిదేవుండు [1] మహాతపంబు
సేసె నని విందు; నది యేల చేసె? ననఘ!
యంగిరసుఁ డేమికతమున నగ్ని యయ్యె?
నగ్ను లెన్నివిధంబుల నతిశయిల్లు?
| 146
|
మార్కండేయుఁడు ధర్మరాజునకు నంగిరసుం డగ్ని యైనతెఱంగు సెప్పుట
| వ. |
ఇంతయు వినవలతు” ననిన నమ్మహాముని యిట్లని చెప్పె “నగ్నిదేవుండు దేవతల
తోడి యలుకం జేసి హవ్యంబులు వహింప నొల్లక వనంబునకుం జని బహు
కాలంబు ఘోరతపంబు సేయుచు నత్యంతకృశుం డై యాత్మగతంబున.
| 147
|
| చ. |
“అలుకమెయిం [2]దొడంగి విపినాంతరభూమికి వచ్చి యిట్లు నే
వెలుఁగక యున్నచో భువనవృత్తము సర్వము నిల్చు; నిల్చినన్
జలరుహసూతి వేఱొకనిఁ జయ్యన నగ్నిపదంబునందుఁ దా
నిలుపక యున్నె? నే నిచట నిల్చుట పోలదు; పోయెదన్ వెసన్.”
| 148
|
| వ. |
అని తలంచి తపంబు సాలించి, నిజపదంబున కున్ముఖుం డయి చని చని, యంతకు
మున్న బ్రహ్మనియోగంబునం ద్రిలోకంబులకు నగ్ని యై వెలుంగుచున్నవాని
నధికతపోవిజృంభితు నంగిరసుం గని భయంపడి యెప్పటియట్ల మగిడి పోవునెడ
నంగిరసుం డతనిపాలికిం జనుదెంచి యి ట్లనియె.
| 149
|
| చ. |
“అనఘ! జగత్త్రయార్చితుఁడ వై తిమిరాపహరుండ వై తగన్,
వనరుహగర్భుచేఁ బ్రథమవహ్నిపదంబునఁ గల్పితుండ వై
తనరుదు వీవు; నీ దగుపదంబున నే నిటు లుండ నోడుదున్;
ఘనముగ నీవు నీపదము గైకొనవే యవికల్పభావనన్.”
| 150
|
| వ. |
అనిన నగ్నిదేవుం డి ట్లనియె.
| 151
|
| క. |
“విను నాకీర్తి జగంబులఁ
బొనుఁగుపడియె; నీవు భువనపూజితవృత్తిం
బనుపడితి గానఁ దగు నీ
కనఘ! యనలపదము; నాకు నలవడ దింకన్.
| 152
|
| వ. |
నీవు ప్రథమాగ్ని వై యుండు; మేను ద్వితీయం బగు ప్రాజాపత్యవహ్ని నై వర్తించెద”
ననిన నంగిరసుండు “దేవా! యి ట్లాన తీవలదు; ప్రథమాగ్నిత్వంబు నీవ కైకొని, నన్ను
నీకుం బ్రథమపుత్త్రుంగా నాదరింపు” మనినం బావకుండు దాని కొడంబడియె; నివ్వి
ధంబున నంగిరసుం డగ్నికి నగ్రతనయుండై యగ్నిసారూప్యంబునం దేజరిల్లె;
నయ్యంగిరసునకు శివ యనుదానికి బృహత్కీర్తియు, బృహజ్జ్యోతియు, బృహద్బ్ర
హ్మయు, బృహన్మనసుండును, బృహన్మంత్రుండును, బృహద్భానుండును, బృహ
|
|
- ↑ దొల్లి
- ↑ దొలంగి