Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

నెఱిఁగెదు; తల్లిదండ్రులకు నెంతయుఁ బ్రీతి [1]యొనర్తు భక్తితోన్.

⁠ 134


వ.⁠

గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు; జాతిస్మరత్వంబునుం గలుగు;
నపరజన్మంబున బరమబ్రాహ్మణుండ వయ్యెద” వని యనుగ్రహించిన నవ్విప్రుని
దేహంబునందు నాఁటినబాణంబు మెత్తన పెఱికి యతనిం దదీయాశ్రమంబు
నకుం జేర్చితి; నా చేసినపుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందం డ
య్యె; నాకు నిట్టిజన్మంబు నొందవలసె” నని చెప్పినం గౌశికుం డి ట్లనియె.

⁠ 135


తే.⁠

”జన్మ మిట్టిది, చరితంబుచంద మిట్టి;
దెన్నఁడును నిట్టి [2]చోద్యమే నెందుఁ జూడ;
నింక జన్మాంతరముదాఁక నేల? యిపుడ
పుణ్యచరితుఁడ వీవు విప్రుఁడవ కావె?

⁠ 136


ఆ.⁠

పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును
నిజము శూద్రుకంటె నీచతముఁడు;
సత్యశౌచధర్మశాలి శూద్రుం డయ్యు
నతఁడు సద్ద్విజుండ యనిరి మునులు.

⁠ 137


క.⁠

అనయంబు నాత్మకర్మం
బున నతినీచ మగుభవముఁ బొందవలసె[3]నే
యని నీవు నిరంతరమును
మనమున దుఃఖింపవలదు మహితచరిత్రా!

⁠ 138


చ.⁠

నిజగుణదోషకర్మముల నెట్టన మేలును గీడు వచ్చుఁ; ద
త్ప్రజనితసౌఖ్యదుఃఖములఁ బ్రాజ్ఞులు దుల్యమనస్కులై మనో
రుజలును దేహజంబు లగురోగములున్ హితధర్మకర్మభే
షజముఁ జేసి పాపుదురు సర్వము సాత్త్వికదృష్టిఁ జూచుచున్.

⁠ 139


క.⁠

ప్రియములు వాయుటయును, న
ప్రియములు వెసఁ బొందుటయు బెల్లుగ నగుఁ; ద
త్క్రియలందు మూఢమతికి హృ
దయతాపము వాయ దెపుడుఁ దరికొనుచుండున్.

⁠ 140


తే.⁠

[4]వగతు మన్న నెవ్వారికి వగవఁ జనదు
చిత్తమున నేమిటికి సంతసింపరాదు;
కాన గతమునందును ననాగతమునందు
వగవ రార్యులు సంతోషవంతు లగుచు.

⁠ 141


క.⁠

వగపునఁ దేజోహీనుం
డగు; నాత్మహితక్రియలకు నక్షముఁ డగు; న
వ్వగపు దొఱఁగి యుద్యోగము
దగఁ జేయఁగఁ గలుగు సంచితము లగుశుభముల్.

⁠ 142


వ.⁠

కావున భూతంబుల సదసత్ప్రకారంబులు గనుంగొని, ధీరుండవై యుండు” మని
న నా ధర్మవ్యాధుండు “మహాత్మా! నీ చెప్పినయంతవట్టు నిదర్శనంబులుగాఁ
గొని యేను నిఃఖేదుండ నై భవిష్యత్కాలసద్భావంబునందు సమాహితుం
డ నై యుండువాఁడ” ననియె; నంత నాభూదేవుండు.

⁠ 143


చ.⁠

అతులితపుణ్యమూర్తివి కృతాత్ముఁడ [5]వెందును నీవు, ధర్మ మూ
ర్జితముగ నెప్పు డేమఱక చేయుచునుండుము, నిత్యశోభన
స్థితి వెలుఁగొందు, మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మసు
స్థితమతి నైతి, న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్.”

⁠ 144
  1. ↑ యొనర్తు ప్రీతితోన్
  2. ↑ చోద్యంబు నెఱుఁగఁ జూడ ... చరితమై నీవు విప్రుఁడవె కావె
  3. ↑ నా కని
  4. ↑ వగపుపేర్మి నె ... గతమునం దయ్యనాగతము ... వృత్తు (వర్తు) లగుచు
  5. ↑ వెంతయు ... న న్ననుపు ధీరగుణాకర