| క. |
“ఇది యట్టిద; నీ చెప్పిన
సదమలహితవాక్యభంగి సకలము వింటిన్;
వదలక యిమ్మెయి[1]న చరిం
చెద; గురుజనములకుఁ బ్రీతిఁ జేసెద ననఘా!
| 124
|
| క. |
నా దైనభాగ్యవశమునఁ
గాదే నీతోడి చెలిమి గలిగెం; బరమా
హ్లాదమనస్కుఁడ నైతి; శు
భోదయముల కెల్ల నింక [2]యుక్తుఁడ నైతిన్.
| 125
|
| క. |
[3]పాపాకర మగు దుర్గతి
ప్రోపుఁ గనక యుండ ననుఁ బ్రబోధాత్మకలీ
లాపరిణతుఁ గావించితి;
నాపాలిటి వేల్ప వీవ నరనుతచరితా!
| 126
|
| చ. |
అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో;
విను పదివేవురం దొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ
ల్గునొ కలుగండొ సందియము; కోరి సనాతనధర్మ మూఁది యె
వ్వనికిని [4]నీకుఁబోలె బుధవత్సల! యిట్లు చరింపవచ్చునే?
| 127
|
| చ. |
నిను నొకశుద్రుఁగాఁ దలఁప నేర? గుణాకర! నీచరిత్రముం
[5]గన మది నద్భుతం బొలసెఁ; గావున నెయ్యది కారణంబుగా
నొనరఁగ నిట్టిజన్మమును నొందితి చెప్పుము; భూతబావివ
ర్తనములయందు నీకు విదితంబులు గానివి గల్గ వెమ్మెయిన్.”
| 128
|
| వ. |
అనిన నతనికి ధర్మవ్యాధుం డి ట్లనియె.
| 129
|
ధర్మవ్యాధుఁడు గౌశికునకుఁ దనపూర్వజన్మవృత్తాంతంబు సెప్పుట
| క. |
“జనసుత నీ వెయ్యది యడి
గినఁ దెలుపుట నా కవశ్యకృతము గాదే?
విను చెప్పెదఁ బూర్వభవం
బున నే నొకబ్రాహ్మణుండఁ బుణ్యచరితుఁడన్.
| 130
|
| వ. |
వేదవేదాంగపారంగతుండ నై యుండుదు; నాకుం బ్రియసఖుం డైనయొక్క
రాజపుత్త్రుతోడి సంగతిం చేసి ధనుర్వేదంబును నభ్యసించితి; నొక్కనాఁ డమ్మహీ
పతి వేఁట వోయిన నేనును నతనితోడన చని వనంబునం బెక్కుమృగంబుల
నేయుచుండ నం దొక్కబాణంబు దృణలతాంతరితదేహుండైన మునివరు
నొక్కరుం దాఁకిన నతఁడు హా యనుచుఁ బడియె; నంత నేనును.
| 131
|
| ఆ. |
డాయఁ బోయి తీవ్రసాయకవిద్ధుఁడై
పొరలుచున్న విప్రవరునిఁ జూచి
తలఁకి యనునయంపుఁ బలుకులు పలికినఁ
గినిసి యిట్టు లనియె మునివరుండు.
| 132
|
| ఆ. |
“బ్రాహ్మణుండ వయ్యుఁ బాపప్రవృత్తి [6]వై
శూద్రకర్మమునకుఁ జొచ్చి తీవు;
గాన నిక్కువముగ గ్రవ్యాదజన్ముండ
వగుము మీఁద” ననియె; ననిన నేను.
| 133
|
| చ. |
“ఎఱుఁగక తప్పు సేసితి సహింపఁగదే; కడు దుర్భవంబునం
బఱుపకు మయ్య” నావుడుఁ గృపన్ మునినాథుఁడు “దప్ప దివ్విధం;
బెఱుకుకులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా
|
|
- ↑ ఁ జరి, యించెద
- ↑ యోగ్యుఁడ నైతిన్
- ↑ పాపకృతం బగు ... బ్రబోధాధికలీలా
- ↑ నీవు వోలె ... యిచ్ఛఁ జరింప
- ↑ గని మది
- ↑ మై .. నిక్కువము మృగవ్యాధిజన్ముండ