Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బంధంబు లెట్టి” వనిన వాఁ డి ట్లనియె.

⁠ 74


చ.⁠

“స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగుఁ; బుణ్యపాపసం
కరమున మానుషత్వ మగుఁ; గల్మషముల్ పశుకీటభావముం
బొరయఁగఁ జేయు; నిప్పగిదిఁ బుట్టుచుఁ జచ్చుచు మోహవార్ధిలోఁ
దిరుగుచు నుండుఁ గాని యొకతీరము [1]సేరఁడు జీవుఁ డెన్నఁడున్.

⁠ 75


చ.⁠

ఇది సకలంబుఁ గాంచి బుధుఁ డెన్నఁడుఁ బాపము పొంతఁబోక, ని
ర్మదనిహంక్రియాత్ముఁడును, మత్సరదూరుఁడు నై చరించు బెం
పొదవఁగ ధర్మమార్గమున; నొయ్యన ధర్మము తీ పెఱింగి తా
వదలఁడు [2]సత్క్రియావిధము; వారక యెక్కు డొనర్చు ధర్మముల్.

⁠ 76


చ.⁠

చిరముగ ధర్మముల్ నడపఁ జిత్తము దేఱుఁ; బ్రసన్నచిత్తుఁడై
పురవడి నింద్రియార్థముల భంగులు రిత్తలు గా నెఱింగి, చె
చ్చెర నవి యంతవట్టు నిరసించి తపోదమసత్యశీలతం
బరిణతి నొందుఁ; బొందుఁ బిదపం బరమార్థపదప్రభావమునన్.”

⁠ 77


వ.⁠

అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె.

⁠ 78


ఆ.⁠

“ఇంద్రియంబు లనఁగ నెయ్యవి? యవి నిగ్ర
హింపకున్నఁ బాప మేమి దొడరు?
వాని నిగ్రహించువానికి నగు ఫలం
బెట్టి?” దనిన నాతఁ డిట్టు లనియె.

⁠ 79


క.⁠

“విను విషయజ్ఞానమునకు
ననయంబును మనసు మూల; మది కామక్రో
ధనిరూఢ మగుచుఁ బురుషుని
ననిశము నెలయించు నింద్రి[3]యార్థక్రియలన్.

⁠ 80


సీ.⁠

ఇంద్రియార్థంబుల కెలసిన పురుషుండు
                 గాఢరాగంబునఁ గరఁగుచుండు;
రాగంబువలనఁ దిరం బగు లోభంబు;
                 లోభియై కరుణకు లోనుగాఁడు;
మఱి సముద్ధతవృత్తి మరగుఁ బాపక్రియఁ;
                 దగువారు సెప్పెడి తగవు వినఁడు;
కుజనుల[4]దెసఁ బ్రీతి గొఱలుఁ; దుల్యంబులు
                 గాకుండు వాఙ్మనఃకర్మభంగు;

⁠


ఆ.⁠

లిహమునందుఁ బుణ్యహీనుఁడై చెడిపోవుఁ
బరమునందు దుఃఖభరము నొందుఁ;
గాన యింద్రియార్థగతిఁ బోక సాధుసం
సర్గఁ జేసి సుగతిఁ జనుట యొప్పు.

⁠ 81


వ.⁠

ఇంద్రియంబు లన నెయ్యవి యనియు నింద్రియజయసిద్ధియు నీవు న న్నడిగితివి;
తత్ప్రకారంబు బ్రహ్మవిద్యావిషయంబు; మాబోఁటివారికి నవాచ్యంబై యుండు;
నైనను నీవు బ్రాహ్మణప్రవరుండవు గావున సద్బ్రాహ్మణప్రియం బవశ్యకర్త
వ్యంబు; పరమబ్రహ్మవిదు లయినబ్రాహ్మణవరులకు నమస్కరించి బ్రహ్మవిద్యా
ప్రపంచం బెఱింగించెద; నవధానపరుండ వై యాకర్ణింపుము.

⁠ 82

ధర్మవ్యాధుఁడు కౌశికునకు బ్రహ్మవిద్యాప్రపంచం బెఱింగించుట

తే.⁠

అంబరము వాయు వగ్ని తోయమ్ము ధరణి
భూతపంచక మిది క్రమంబున; మహాత్మ!
శబ్దసంస్పర్శరూపరసములు గంధ
సంయుతంబుగ భూతపంచకగుణములు.

⁠ 83


క.⁠

ఒనరఁగ నాకస మాదిగ
ననులోమముతోడ నిమ్మహాభూతము లే

⁠
  1. ↑ ఁ జేరఁగ నేరఁ డెన్నఁడున్
  2. ↑ తత్క్రియా
  3. ↑ యార్థంబులకున్
  4. ↑ యెడఁ