| |
హింస తెరువున కెడ గల్గి యేఁగవలయు;
నదియ చూవె యహింస నా నతిశయిల్లు.
| 60
|
| వ. |
ధర్మంబు బహుప్రకారంబై యుండుఁ; దదీయసూక్ష్మగతి దురవబోధంబు; గావున
శ్రుతిప్రమాణంబువలనను వృద్ధాచారనిదర్శనంబులను నెఱింగికొనునది.
| 61
|
| ఉ. |
భూతహితంబుగాఁ బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చుఁ; ద
ద్భూతభయాస్పదం బగుప్రభూతపుసత్యము బొంకునట్ల; ప్రా
ణాతురుఁ డైనచోఁ, బరిణయంబునయందును, బల్కు బొంకు స
త్యాతిశయంబ యండ్రు; మహితాత్మక! యిట్టివి ధర్మసూక్ష్మముల్.”
| 62
|
| క. |
“ఒప్పెడునది యైనను గడు
నొప్పనియది యైన నిజకులోచితపథముం
దప్పఁ దగ దండ్రు ధార్మికు;
లప్పని నిజభాగ్యవిహిత మని యుండఁదగున్.
| 64
|
| క. |
విను పూర్వకర్మఫలములు
దనకు వశముగాక పొందుఁ దఱితో; వాని
గనుఁగొననేరక మూఢుఁడు
దన కాపద యైన చోట దైవము దూఱున్.
| 65
|
| తే. |
కార్యఫలములయెడఁ దాన కర్త ననుట
కడు నెఱుంగమిఁ జువ్వె; తాఁ గర్తయేని
తగిలి తనదైన కార్యజాతంబు నెల్లఁ
జెడక ఫలియించునట్లుగాఁ జేయరాదె?
| 66
|
| సీ. |
నీతిమంతులు, ధర్మనిరతులు, దక్షులు
నగువారు సేయు కార్యములు గొన్ని
సిద్ధిఁ బొందవు; దుష్టచిత్తులు క్రూరులై
చేయఁ గొన్ని విశేషసిద్ధిఁ బొందు;
నూరక యుండంగ నొందుఁ గొందఱు విపు
లార్థముల్; గొంద ఱాయాసపడియు
నిష్ఫలారంభులై నిలుతురు; గొందఱు
పేదవారికిఁ బ్రజ పెల్లువొడము;
|
|
| తే. |
నర్థవంతులు గొందఱ కర్థి నధిక
దానములు ధర్మములు సువ్రతములుఁ జేయఁ
బ్రజలు పుట్టరు విను మట్టిభంగి సుమ్ము
కర్మఫల మాత్మతంత్రంబు గాకయుండు.
| 68
|
| క. |
పురుషుఁడు కర్మాధీనత
నరుగక తనవశమ యనిన నాపదలు రుజల్
మరణంబును నివి యేమియుఁ
బొరయక యుండంగ బ్రదుకఁ [1]బోలదె? చెపుమా.
| 69
|
| ఆ. |
కర్మవశ[2]తఁ జూవె కలుగు దేహము; దేహ
వర్తనంబు కర్మవశతఁ బుట్టు;
దేహపాతమైన దేహస్థుఁడగు జీవుఁ
డరుగుఁ గర్మవిహితమైన యెడకు.”
| 70
|
| వ. |
అనినం గౌశికుండు జీవుం డెట్టివాఁడని యడిగిన లుబ్ధకుం డి ట్లనియె.
| 71
|
ధర్మవ్యాధుఁడు గౌశికునకు జీవలక్షణంబు సెప్పుట
| క. |
“విను జీవుండు సనాతనుఁ
డనఘుఁడు; నిజకర్మవశత నధ్రువదేహం
బునఁ బొందు; దేహపాతం
బున నెప్పుడుఁ జెడఁ డతండు భూసురవర్యా!
| 72
|
| క. |
ఈయొడలు విడిచి వేఱొక
కాయముఁ గైకొని [3]శరీరకకర్మవశగతిం
బోయి సుఖదుఃఖములు గనుఁ
బాయక వెండియును దేహబంధముఁ బొందున్.”
| 73
|
| వ. |
అనిన విని బ్రాహ్మణుండు లుబ్ధకునితోడం “బుణ్యపాపానురూపంబు లయినదేహ
|
|
- ↑ జాలఁదె
- ↑ గతంబు గలుగు
- ↑ శరీరి గర్మవశ