| |
హమునకు విచ్ఛేదముగా
సమయాతిక్రమము సేయ [1]సమకట్టరుగా?”
| 97
|
| వ. |
అనిన మైత్రేయుం డి ట్లనియె.
| 98
|
| క. |
“చనుదెంచి మహామునివరు
లనవతరము వారలకుఁ బ్రియం బొనరఁగ దీ
వన లీగిఁ జేసి కుశలమ
మనుజేశ్వర వారు ధర్మమతియుతు లగుటన్.
| 99
|
| క. |
వారలు సమయము దప్పిన
వారిజరిపుహితులగతు లవశ్యముఁ దప్పున్;
వారికి నకారణంబ ని
కారము నీ కొడుకు సేసెఁ గడు నహితుం డై.”
| 100
|
| వ. |
అని దుర్యోధనుం జూచి “యయ్యా నీవు బుద్ధిగల వేనిఁ బాండవులతో విరోధం
బుడుగు; మట్లయిన నీకును వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకుఁ జేకొనుము.
| 101
|
| సీ. |
వజ్రసంహనను, లవార్యపరాక్రముల్,
పాండుకుమారు, లాఖండలాభు;
లందఱు నాగశతాయుత [2]ప్రాణు, లు
గ్రాహవకాంక్షు, లుత్సాహపరులు;
వారలలో బలవంతుండు, బక హిడిం
బాసురు లనువారి నాసురమునఁ
జంపి, నాగాయుతసత్త్వు జరాసంధు
నెక్కటి యోర్చిన యక్కజుండు;
|
|
| తే. |
ఘోరవనమున వీరుఁ గిమ్మీరుఁ డను సు
రారి, నిశ్చలభీకరాకారుఁ బట్టి
పోర వధియించినట్టి సమీరజునకు
భూరిభుజునకు మార్కొనువారుఁ గలరె?
| 102
|
మైత్రేయుఁడు దుర్యోధనుని శపించుట
| వ. |
వారికి వాసుదేవధృష్టద్యుమ్నులు సంబంధ[3]సహాయులు; జరామరణవంతు లైన
మనుజులు వారిం జెనకి యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది
కార్యం” బనిన మైత్రేయు పలుకు లాదరింపక పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు
బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి మైత్రేయుం డలిగి
“యీ యపరాధంబున నావహంబగు; నందు భీముగదాఘాతంబున నీ యూరుయుగ
ళంబు భగ్నం బయ్యెడు” మని శాపం బిచ్చిన వెఱచి ధృతరాష్ట్రుండు “మునీంద్రా!
యట్లు గాకుండం బ్రసాదింపు” మనిన నమ్మునివరుం డి ట్లనియె.
| 103
|
| తే. |
“కడఁగి సమబుద్ధి వీనికిఁ గలిగెనేనిఁ
గాదు శాపఫలం; బట్లు గాక బుద్ధి
హీనుఁ డై గర్వితుం డగు నేని శాప
హవ్యవాహఫలంబు వీఁ డనుభవించు,”
| 104
|
| వ. |
అని ప్రసన్నుం డైన మైత్రేయునకు నాంబికేయుం డి ట్లనియె.
| 105
|
| క. |
“కిమ్మీరుం డను రక్కసుఁ
డమ్మారుతతనయుచేత నత్యుగ్ర[4]వనాం
తమ్మున నిహతుం డయిన వి
ధ మ్మెట్టులు? సెప్పు మద్భుతం బిది” యనినన్.
| 106
|
| వ. |
“నా పలుకులు నీ కొడుకు వినం డయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన
విప్రులచేత విదురుం డిమ్ముగా నెఱింగినవాఁ; డతనివలన విను” మని చెప్పి మైత్రే
యుం డరిగినం గిమ్మీరవధకథాశ్రవణ[5]పరుం డై తన్నడిగిన ధృతరాష్ట్రునకు
|
|
- ↑ సమకట్టెదరో
- ↑ త్రాణు... లుత్సాహమతులు ... నాహవమునఁ ... ఘోరరణమున ... నిశ్చలభీకరాకారు; నిశ్చలభీకరాకరు గిట్టి
- ↑ కార్యసహాయులు ... నాహవంబునాఁడు
- ↑ రణాంతమ్మున ... బది
- ↑ కుతూహలపరుఁ డై