| ఆ. |
లార్జనంబు, శమము, నధ్యయనంబును,
బరమధనము సువ్వె బ్రాహ్మణునకు;
ధర్మగతికి [1]నవియ తగుసాధనంబులు
వేదనిహితముఖ్యవిధులు [2]నెనయె.
|
|
| వ. |
ధర్మంబు బహుమార్గదృష్టం బయి సూక్ష్మం బయి యుండు; నీవు కేవలస్వాధ్యా
యపరుండవు గాని ధర్మసూక్ష్మత యెఱుంగవు; గావునం దడయక మిథిలానగ
రంబున కరుగు; మందు జితేంద్రియుండును సత్యవాదియు, మాతాపితృభక్తుం
డును నయినవాఁడు ధర్మవ్యాధుం డనుకిరాతుండు నీకు నఖిలధర్మంబులు నెఱిం
గించి, సంశయచ్ఛేదంబు సేయు; నాదెసం బ్రసన్నుండ వగునది; వనితలకుం బరిజ్ఞా
నంబు లేదు గావున వా రెట్టి యపరాధంబు సేసినను సహింప వలయుఁ గదా”
యనినఁ గౌశికుం డి ట్లనియె.
| 25
|
| క. |
“నను దూఱఁ దగు; నీకత
మున నా[3]చిత్తము ప్రశాంతిఁ బొరసెఁ; బురంధ్రీ
జనవినుత! పో వచ్చెద;
ననుపమశోభనసమృద్ధుఁ లయ్యెడు నీకున్.”
| 26
|
కౌశికుం డనుబ్రాహ్మణుఁడు ధర్మవ్యాధునియొద్దకుఁ బోవుట
| వ. |
అని యాక్షణంబ యమ్మహాద్విజుండు ధర్మవ్యాధదర్ళనలాలసుం డై కదలి పతి
వ్రతయెఱుకకు విస్మయం బందుచుఁ, దన్నుం గృతాపరాధునింగాఁ దలంచుచు
ననేకనగరగ్రామంబు లతిక్రమించి చని యనుపమానశోభాసనాథం బయిన
మిథిలానగరంబు సొచ్చి రాజమార్గంబు దఱిసి, యచ్చటిజనంబుల ధర్మవ్యా
ధుం డున్నయెడ [4]నడిగి వా రెఱింగింప నట యేఁగి ముందట నల్పమృగమాంస
ఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్నవాని, ననవరతవిక్రయాగతజన
సమావృతు, నక్కిరాతుం గని, యతిజుగుప్సితం బయినసూనాపణంబు సేరనొల్లక
తొలంగి యొక్కయెడ నుండె; నంత.
| 27
|
| ఆ. |
వాఁడు నతనిరాక పోఁడిగ నిజబుద్ధి
నెఱిఁగి యతనియున్నయెడకు వచ్చి
పరమభక్తి మ్రొక్కి ధరణీసురేశ్వరుఁ
గుశల మడిగి ప్రియము గొనలు నిగుడ.
| 28
|
| చ. |
“అనఘ! [5]పతివ్రతాతిలక మైననితంబిని నాతెఱంగు సె
ప్పినఁ జనుదెంచి తీవు ననుఁ బ్రీతిఁ గనుంగొన; నీమనోరథం
బును మదిలో నెఱుంగుదుఁ; బ్రమోదముఁ బొందితి; రమ్మ మద్గృహం
బున” గని పల్కి తొడుకొనిపోయె నతండు మహీసురోత్తమున్.
| 29
|
| వ. |
కౌశికుండును ధర్మవ్యాధు నెఱుక కచ్చెరువంది, పతివ్రత యెఱుకయుం దలంచి,
యిది రెండవు నాశ్చర్యంబు గంటిఁ బొ” మ్మని తలంచుచుఁ దదీయభవనంబున కరిగి
వానిచేతం బూజితుం డయి యిష్టకథాప్రసంగంబున నుండి యతని కి ట్లనియె.
| 30
|
| తే. |
“నీవు గడు ధర్మవిదుఁడవు; జీవహింస
జీవనంబుగ నడచుట శిష్టపథమె?
యకట! యీ ఘోరకర్మంబునకు మదీయ
బుద్ధి దద్దయు దుఃఖంబు [6]వొందె నిపుడు.”
| 31
|
- ↑ నివియ
- ↑ నివియ
- ↑ చిత్తంబు శాంతిఁ
- ↑ యడిగి ... జనసమాజసమావృతు
- ↑ నితంబినీతిలక మైనపతివ్రత నాతెఱంగు
- ↑ బొరసె నిపుడు