Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

డనుపమితక్షుధా[1]కలితుఁ డై చనుదెంచిన, భక్తి నమ్మహా
త్మునకు సపర్య సేయుచు మిమున్ మదిలోనఁ దలంపఁ జాల నై
తి; నిదియుఁ దప్పుగాఁ గొనక ధీరత యొప్ప సహింపఁగాఁ దగున్.”

⁠ 14


వ.⁠

అనిన నమ్మహీదేవుం డప్పతివ్రత కి ట్లనియె.

⁠ 15


ఉ.⁠

“నీమగఁ డంతయెక్కుడె? మనీషులు భూసురు లింత తక్కువే?
కోమలి! [2]యేల యిట్లు గడుఁ గ్రొవ్వునఁ గానవు లోకవంద్యులన్
భూమిసురేంద్రులన్; దివిజపుంగవుఁ డాదిగ భక్తిఁ గొల్చుచో
నేమిటనొక్కొ వారు గడు నెల్లిద మై రిటు నీకు నిచ్చలున్?

⁠ 16


క.⁠

అవమానితులై ధరణీ
దివిజులు గ్రోధాగ్నిశిఖల దీపించి మహా
ద్రివనద్వీపంబులతో
నవని నయివఁ బొడవడంతు రప్రతికారుల్.

⁠ 17


వ.⁠

నీ వింతయు నెఱుంగ నొల్లనైతివి గా కేమి?” యనిన నయ్యంగన యి ట్లనియె.

⁠ 18


సీ.⁠

“దేవతాసములు భూదేవతావరు [3]లౌట
                 యేను దన్మాహాత్మ్య మెఱుఁగనయ్య?
యొక విప్రుఁ డలిగి పయోనిధి జలము ల
                 పేయముల్ గాఁగ శపింపఁ డెట్లు?
దండకవిషయంబు దగ్ధంబు సేయండె
                 యలుక మై నొక్క మహాద్విజుండు?
వాతాపి యను దైత్యవరు మ్రింగి యఱిగించు
                 కొనఁడె భూదేవుఁ డొక్కొరుఁడు గినిసి?

⁠


తే.⁠

ధరణి మఱియును బెక్కువిధంబులందు
బ్రహ్మవిదులైన బ్రాహ్మణప్రభులమహిమ
వినమె? యెఱిఁగి యెఱింగి సద్వినుతచరిత!
కొఱవి గొని వెఱ్ఱినే తలఁ గ్రోఁకికొనఁగ?

⁠ 19


వ.⁠

నాతెఱంగు సెప్పెద నాకర్ణింపుము.

⁠ 20


తే.⁠

పతియ చూవె నాపాలికిఁ బరమదైవ;
మేను వాఙ్మనఃక్రియలఁ దద్ధితమ యెపుడుఁ
గోరి యొనరింతు; [4]దీని మిగులఁగ నొండు
ధర్మువులు గాన నెందును దలఁచి చూచి.

⁠ 21


వ.⁠

నీ వతిక్రోధనుండ వగుటయు నెఱుంగుదు; నీకోపంబున నొక్కకొక్కెర నిహతం
బయ్యెం గాదె? యిది మదీయపాతివ్రత్యమహిమం జేసి కాంచితిం గాన క్రోధంబు
గొనియాడుట లగ్గు గా” దని యి ట్లనియె.

⁠ 22


తే.⁠

క్రోధమోహనామకులైన ఘోరశత్రు
లిరువు రెరియించుచుండుదు రెపుడు నరుని
యంతరంగ; [5]మయ్యుభయంబు నడంగకున్నఁ
గలదె యూరక బ్రాహ్మణగౌరవంబు?

⁠ 23


సీ.⁠

ఎవ్వఁడు సత్యంబు యెప్పుడుఁ [6]బల్కు, హిం
                 సావిదూరుఁడు, గురుజనహితార్థి,
యింద్రియంబుల నోర్చి, యెల్లవారలఁ దన
                 యట్ల కాఁ జూచు ధర్మాభిరతుఁడు,
కామంబు దగులండు, కర్మంబు లాఱును
                 సముచితసంప్రయోజ్యత నొనర్చు,
నట్టి పుణ్యాత్ముని ననఘు బ్రాహ్మణుఁ డని
                 యనిశంబుఁ గీర్తింతు రమరవర్యు;

⁠
  1. ↑ చలితుఁ డై; భరితుఁ డై ... ధీయుత భిక్షయు యొప్పుగాఁ దగున్
  2. ↑ యింత యేల గడుఁ ... నీకు నిచ్చటన్
  3. ↑ లౌదు (లయ్య) రేను దన్మాహాత్మ్య మెఱుఁగుదయ్య ... గొనియెదనే తల
  4. ↑ నిది మిగులంగ నెందు
  5. ↑ మయ్యుభయంబు నడఁపకున్నఁ; మయ్యుభయంబును నాగకున్నఁ
  6. ↑ బల్కును హింసావిదూరుండు హితకరుండు