Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.⁠

దనయుఁ గని తల్లిదండ్రులు దమకు నతఁడు
భక్తుఁ డగుటకు [1]ధర్మానురక్తుఁ డగుట
కానపడుదురు; విను మట్టి యాస సిద్ధిఁ
బొందఁజేయు నతఁడ చువ్వె నందనుండు.

⁠ 5


క.⁠

జననియు జనకుఁడు నెవ్వని
యనువర్తనమునఁ బ్రియంబు నందుదు రెదఁ ద
త్తనయుఁడు ధర్మముఁ గీర్తియు
సమానముగఁ బొందు, బడయుఁ నక్షయగతులన్.

⁠ 6

మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ బతివ్రతామహాత్మ్యంబు సెప్పుట

వ.⁠

మఱియు నిజభర్తృశుశ్రూష యందు నిత్యాసక్తమయిన పతివ్రతకు నఖిల
యజ్ఞదానతపఃఫలంబులు సులభంబు లగు; నొక్కయితిహాసంబు సెప్పెద; నందు
నీయడిగినయర్థంబు లన్నియుఁ దేటపడు నాకర్ణింపుము; కౌశికుం డనుబ్రాహ్మ
ణుండు ధర్మతపశ్శీలుఁడు సంతతాధ్యయనతత్పరుం డయి యొక్కవిశిష్టగ్రా
మంబున నుండు; నతం డొక్కనాఁడు గ్రామసమీపంబునం దొక్కవృక్షమూలం
బున నాసీనుం డై వేదంబులు గుణియించుచుండం దదీయశాఖాగతం బైన
కొక్కెర యొక్కం డాతనిపై రెట్ట వెట్టిన, నమ్మహాద్విజుం డలిగి చూచుటయు,
నది యప్పుడ నిశ్చేతనంబై నేలం బడినం గనుంగొని యతండు.

⁠ 7


క.⁠

“అక్కట నాహృదయము గడు
నక్కటికము లేని దయ్యె; ననిమిత్తమ యీ
కొక్కెర నిటు సేసితి; నా
కెక్కడి శాంతి?” యని వికలహృదయుం డగుచున్.

⁠ 8


వ.⁠

పెక్కుభంగుల వగచి మధ్యాహ్నం బగుటయుఁ గృతాహ్నికవిధానుం డై గ్రామం
బున కరిగి, యందు శుచు లైనవిప్రగృహంబుల కరిగి, భిక్షాచరణంబు సేయుచు,
నం దొక్కపుణ్యగృహంబువాకిట నిలిచి 'భిక్షాం దేహి' యనుటయు నాయింటి
యవ్వయు నతిసంభ్రమంబున భిక్ష యిడుటకుం బాత్రశోధనంబు సేయునెడ.

⁠ 9


ఉ.⁠

ఆయెలనాఁగభర్త గడు నాఁకటఁ దూలుచు వచ్చె; వచ్చినం
దోయజనేత్ర సంభ్రమముతోఁ దగుపీఠము వెట్టి, పాద్యముం
బాయక మజ్జనక్రియయు భక్తి నొనర్చి, ప్రియోక్తు లొప్పఁగా
నాయనఁ బ్రీతుఁ జేసె రుచిరాన్నరసంబులఁ [2]నింతి చెచ్చెరన్.

⁠ 10


చ.⁠

కుడిచినపిమ్మటం గుసుమకోమలి [3]విస్తృతసంస్తరంబుగా
నొడికపుసెజ్జ నేసి ప్రియుఁ డొయ్యన యందు శయింపఁ దమ్ములం
బిడి చరణంబు లొత్తి మదిరేక్షణ యంతటిలోఁ దలంచె ము
న్నడరఁగ భిక్షకై నిలిచినట్టి మహీసురముఖ్యు నాత్మలోన్.

⁠ 11


వ.⁠

ఇట్లు దలంచి భిక్ష గొనుచుం జనుదెంచిన నమ్మగువఁ జూచి కౌశికుండు రోష
రంజితలోచనుం డగుచు ని ట్లనియె.

⁠ 12


క.⁠

“అడిగినయప్పుడ చెచ్చెరఁ
గడపినఁ బో నవ్వ! యేను? గడుదుర్మతి వై
పడఁతి! నను నిలిపి భిక్షం
బిడక కడు నవజ్ఞ సేసి తేల [4]మదమునన్?”

⁠ 13


చ.⁠

అనినఁ బతివ్రతాతిలక మాతని కి ట్లను “నయ్య! మత్ప్రియుం

⁠
  1. ↑ ధర్మార్థసక్తుఁ డగుట ... చెల్వ నందనుండు
  2. ↑ జేసి
  3. ↑ సంస్కృతసంస్తరంబుగా
  4. ↑ ముదమునన్