| |
క మునీంద్ర! తపోవనగమ
నము దప్పదు నాకు; వినుము నావిన్నపమున్.
| 389
|
| చ. |
అనఘుఁడు, మత్సుతుండు, గువలాశ్వుఁడు, వీఁడె మహాబలుండు, స
జ్జనహిత[1]కార్యధైర్యనిధి, సంభృతకీర్తి భవత్ప్రియార్థ మై
జననుత! యమ్మహాసురునిఁ జంపుట కోపు నవార్యశౌర్యవ
ర్థను లగుచున్న పుత్త్రులును దాను నభేద్యభుజావిభూతితోన్.
| 390
|
| వ. |
నాకు ననుజ్ఞ యీవలయు” నని పలికి యక్కార్యంబునకుఁ బుత్త్రు సమర్పించి, యమ్ముని
చేత నభినందితుం డై బృహదశ్వుడు దపోవనంబున కరిగె” ననిన విని ధర్మనంద
నుండు మార్కండేయునితో “ధుంధుండు మధుకైటభులపుత్త్రుం డని చెప్పితి;
రమ్మధుకైటభు లెక్కాలంబువా? రేమిక్రమంబున నెవ్వరిచేత నే మై?” రని యడి
గిన నతండు ధర్మనందనున కి ట్లనియె.
| 391
|
మార్కండేయుఁడు ధర్మరాజునకు మధుకైటభులచరితము సెప్పుట
| సీ. |
“అధిప తొల్లి జగత్త్రయంబు నేకార్ణవ
మై యుండఁగా, నప్డు హరి యొకండ
భాసురభోగీంద్రపర్యంకమున భవ్య
యోగనిద్రాసుఖయుక్తి నలర,
నతిదీర్ఘ మగు కాల మరిగెఁ; బదంపడి
దైత్యు లిద్దఱు మహోదాత్తబలులు
మధుకైటభులు నాఁగ మథితశాత్రవు లేఁగు
దెంచి యప్పరమాత్ము దివ్యనాభి
|
|
| ఆ. |
కమలమున [2]వెలుంగు కమలాసనునిఁ గని
దర్పదోషనిహతిఁ దలరి వ్రేయ
నతఁడు భీతి నొంది యాక్రోశ మొనరించె,
“నాదిపురుష! నన్ను నరయు” మనుచు.
| 392
|
| ఉ. |
ఆతెఱఁ గాత్మఁ గాంచి కమలాక్షుఁడు మేల్కని, ఘోరవిక్రమో
పేతుల దైత్యసింహుల, నపేతభయాత్ములఁ జూచి “మీర లి
ట్లీతని నుక్కునం బఱుప నేల? భవద్బలశౌర్యయుక్తికిం
బ్రీతుఁడ నైతిఁ; జెచ్చెర నభీష్టవరంబులు వేఁడుఁ డిచ్చెదన్.”
| 393
|
| తే. |
అనినఁ గలకల నవ్వి యయ్యసురవరులు,
“నీవు మా కేమి యిచ్చెదు? నీకు మేము
వరము లిచ్చెద; మడుగుము [3]వలచితేని”
ననిన వారల కి ట్లను నవ్విభుండు.
| 394
|
| క. |
“సత్యవ్రతులార! వరం
బత్యంతప్రీతి మిమ్ము నడిగెద; లోక
[4]ప్రీత్యర్థముగా నాచే
మృత్యువునం బొందుఁ డిపుడ మీర లిరువురున్.”
| 395
|
| వ. |
అనిన వార లొండొరువులమొగంబులు సూచి యాచక్రధరున కి ట్లనిరి.
| 396
|
| చ. |
“నగవుల కేనియున్ విను జనార్దన! యెన్నఁడు బొంకు పల్క; మ
త్యగణిత[5]విక్రమోరుబలధైర్యసమగ్రుల; మెల్లభంగిఁ గా
లగతి దొలంగఁ ద్రోవఁగఁ దలం బగునే? యగుఁగాక నీకు మె
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము; స్రుక్కము చావున కాత్మ నేమియున్.
| 397
|
| ఆ. |
చంపెదేని మమ్ము జలములు లేనిదే
శమునఁ జంపవలయుఁ గమలనాభ!
|
|
- ↑ కారి ధైర్య
- ↑ వెలుఁగు జగత్పితామహునిఁ గని, దర్పరోష (నియతి) మతిని దలర
- ↑ వలసితేని
- ↑ ప్రత్యయము గాఁగ నాచే
- ↑ ధైర్యవిక్రమబలైకసమగ్రుల ... నిటు (నిట) బ్రాణ