Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

తాడనశక్తి గీడ్పడియెఁ; దథ్యము బ్రాహ్మణశక్తి యెక్కు; డే
నోడుదు వామదేవునకు; నో జనసంఘములార! సజ్జనా
మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను [1]నాశ్రయించెదన్.”

⁠ 358


వ.⁠

అని యివ్విధంబున నతం డేటు దప్పి జోహారు వెట్టుటయుఁ దదీయబంధుమి
త్రజనంబులు భయసంభ్రమంబులతో నమ్మునినాథుశరణు సొచ్చి యనున
యించినఁ బ్రసన్నుం డై యమ్మహాత్ముండు దత్కరయుగస్తంభనంబు మాన నను
గ్రహించి తదీయనందనుప్రాణంబు లొసంగె; నంత నమ్మహీకాంతుండు నిజభా
ర్యాబంధుజనసహితంబుగా నతనికిఁ బ్రణమిల్లి హయంబులఁ దెచ్చి యొప్పిం
చినం గైకొని వామదేవుం డరిగె; నిట్టిది బ్రాహ్మణప్రభావం బని చెప్పిన విని.

⁠ 359


క.⁠

మునిపతికి మ్రొక్కి కుంతీ
తనయుఁడు “మీకంటె వృద్ధతముఁ డగు పురుషుం
డనఘా! కలఁడె? జగమ్మున”
నని యడిగిన నాతఁ డిట్టు లని యెఱిఁగించెన్.

⁠ 360

మార్కండేయుఁడు ధర్మరాజునకు నింద్రద్యుమ్ను చరిత్రము సెప్పుట

క.⁠

ఘనుఁ డింద్రద్యుమ్నుం డను
జనపతి గలఁ, డాతఁ డింద్రసదనమున ముదం
బున నుండఁగ బహుకాలం
బున కాతనికీర్తి లోకమున మాయుటయున్.

⁠ 361


తే.⁠

అమరు లిచ్చోట నుండ లే వరుగు మనుచు
నుర్విఁ ద్రోచిన, నతఁడు నాయున్నకడకు
నర్థిఁ జనుదెంచి యిట్లను “ననఘ! నన్ను
నిద్ధపుణ్యు నింద్రద్యుమ్ను నెఱుఁగు దయ్య?”

⁠ 362


సీ.⁠

అనుడు నే నిట్లంటి “నయ్య! ని న్నెఱుఁగంగఁ
                 జాల నయ్యెద; హిమశైలశృంగ
వాసి యై యుండు ప్రావారకర్ణుండను
                 పేరి ఘూకము గడుఁబెద్ద; యదియు
నాకంటె నిన్ను నిర్ణయముగ నెఱుఁగుఁ బొ”
                 మ్మనుటయు నన్ను రమ్మనియె నతఁడు;
“ఘనరసాయనఘటికాప్రయోగంబున
                 దేహతాపంబు వర్ధించె నేఁడు

⁠


తే.⁠

గదలి రాఁజాల నే” నంటిఁ గడఁగి యన్న
రేంద్రుఁ డశ్వమై ననుఁ బ్రీతి నెత్తికొనుచు
నయ్యులూకముపాలికి నరిగి నన్ను
నడిగినట్టుల దానిఁ దా నడుగుటయును.

⁠ 363


వ.⁠

అదియునుం గొండొకసేపు దలపోసి చూచి, “యేను నిక్కువంబుగా ని న్నెఱుంగ
నేర; నింద్రద్యుమ్నం బనుకొలనియందు నాళీకజంఘుం డనుపేరి బకవల్లభుండు
వసియించు; నవ్విహంగంబు నాకుఁ బెద్ద; ని న్నెఱుంగు నరుగు” మనిన నమ్మనుజపతి
నాతోడఁగూడ నయ్యులూకంబు మోచికొని నాళీకజంఘునొద్దకుం జని తన
పేరు చెప్పి “న న్నెఱుంగుదే” యనిన నదియు “నే ని న్నెఱుంగం జాల; నాకంటెఁ
జిరకాలజీవియైన యకూపారుం డను కచ్ఛపంబు గల; దదియును నిక్కొలన నుండు;
నజ్జలచరము ని న్నెఱుంగంబోలు; నడిగి చూతము గాక” యని యక్కమఠంబుఁ
బేర్కొని “యిది యొక్కధర్మసందేహంబు; నిర్ణయించుటకయి యీయార్యజనంబులు
నిన్ను గుఱించి వచ్చినవారు; నీవు సనుదేరవలయు” నని పలుకుటయును.

⁠ 364


తే.⁠

కొలను వెలువడి చనుదెంచెఁ గూర్మవిభుఁడు;

⁠
  1. ↑ నాశ్రయింపరే