Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.⁠

“అక్కట! లోక మెల్ల నగ నాఱడిఁ గప్పలఁ జంప [1]నేల? యిం
దెక్కడి పెంపు గల్గుఁ? బృథివీశ్వర! కోపము డింపు; కప్పలం
జక్కనిచూడ్కిఁ జూడు; మిది చాల నధర్మము” నావుడున్ విభుం
“డెక్కడి మాట! నాసతికి నె గ్గొనరించెఁ గడంగి భేకముల్.

⁠ 333


క.⁠

నాయిష్టవనిత మ్రింగిన
మాయపుఁబుర్వు లివి వీని మడియింతు మునీం
ద్రా! [2]యుడుగుము నీ” వనుటయు
నాయన యత్యంతదుఃఖితాత్ముం డగుచున్.

⁠ 334


వ.⁠

“ఏను మండూకనాయకుఁడ; నాయు వనువాఁడ; నమ్మగువ నాకూఁతురు [3]సుశోభన యనునది; దానిచేత ననేకులు బేలుపడిరి; నీ వెంతవాఁడ” వనిన నప్పరి
క్షితుం “డట్లేని నాకు నమ్మెలఁతుకఁ దెచ్చి యొప్పింపవలయు” నని ప్రార్థించిన నతం
డు నవ్వుచు నవ్వామ[4]నయనం దలంపున రావించి, యా రాజునకు నిచ్చి, దానిం జూచి కోపించి “నీవు గడుంజెట్టవు; ప్రసిద్ధులగు [5]రాజులం [6]బెక్కండ్రం బెన
వెట్టితివి; గావున నీకుం బుట్టెడుకొడుకులు గపటవర్తను [7]లయ్యెడు” మని [8]కూఁతు
శపియించి మండూకరాజు నిజేచ్ఛం జనియెఁ; బరిక్షితుండును సంప్రాప్తమనోర
థుం డయి సుశోభనయందుఁ గ్రమంబున శలుండును, దలుండును, వలుండును
నను మువ్వురుగొడుకులం [9]బడసి యం దగ్రజుం డయిన[10]శలు నభిషిక్తుం జేసి
తపోవనంబున కరిగె నంత.

⁠ 335


క.⁠

శలుఁ డొక్కనాఁడు కనకో
జ్జ్వల మగురథ మెక్కి వేఁట సని పెక్కుమృగం
బులఁ జంపఁగ నొక్కమృగం
బలఘుతర[11]శితాస్త్రవిద్ధ మై వెసఁ బఱచెన్.[12]

⁠ 336


ఆ.⁠

ఇట్లు వఱచుటయును నెంతయు రయమున
నమ్మృగంబు[13]వెనుక నరిగి యరిగి
యెయిద లేక ధారుణీశుండు సారథిఁ
బదరి తేరు వేగ పఱపు మనియె.

⁠ 337


సీ.⁠

అనవుఁడు సూతుఁ డిట్లను “దేవ! మన మెంత
                 దఱిమిన మృగము దద్దయు జవంబు
గలదు; రథ్యంబులు గడుగొని కూడంగఁ
                 జాలవు; వలవని [14]జాలి యేల?
మనతేరిహరులు వామ్యము లైన నమ్మృగ
                 మగపడు; లేకున్న నలవి గాదు”
నావిని “వామ్యముల్ నాఁగ నెవ్వని
                 హయంబులు సెప్పు” మనియె నబ్భూవిభుండు

⁠


తే.⁠

“వామదేవమహామునివరుని హరులు
వామ్యములు నాఁగఁ జను” నని వాడుఁ సెప్పె
“నతనియాశ్రమ [15]మెచ్చట? నచటి కిపుడ
తేరు వోవని” మ్మనియె ధాత్రీవిభుండు.

⁠ 338


వ.⁠

వాఁడును రథంబు సత్వరంబుగా వామదేవునాశ్రమంబునకు బఱపినం, జని,
యాతం డాతపో[16]నిధిం గని, నమస్కరించి, “మునీంద్రా! నాచేత నేటువడి యొక్క
మృగంబు రయంబునం బఱచె; [17]నమ్మృగంబు నెయిది వధియింపవలయు; భవదీయ
హయంబుల [18]నీవలయు” ననిన నతండు “నీవు కృతకార్యుండ వై మాహయంబులం

⁠
  1. ↑ దీన నీ, కెక్కడి ... నామదికి నెగ్గొన
  2. ↑ యరుగుము
  3. ↑ సంశోభని; సంశోభన; సులోచన
  4. ↑ లోచనం
  5. ↑ భూపతులం
  6. ↑ బెక్కండ్రం జిక్కులం బెట్టితివి
  7. ↑ లయ్యెర దని
  8. ↑ కూతునకు శాపం బిచ్చి; కూతురు శపియించి; కూతుర శపియించి
  9. ↑ గని
  10. ↑ శలుని రాజ్యాభిషిక్తుం
  11. ↑ శరాగ్రవిద్ధ మై
  12. ↑ ఇప్పద్యమునకు వెనుక 'వ. ఇట్లు సరచుటయును నమ్మృగంబును బొలియింతు రను నాగ్రహంబున. ఆ. అతఁడు సలము మిగిలి యత్యంతరయమున' అని యొకప్రతి.
  13. ↑ వెంట
  14. ↑ జోలి
  15. ↑ మెక్కడ
  16. ↑ ధనుం
  17. ↑ నామృగంబునేడ వధియింప, వెనుకొని వధియింప
  18. ↑ నీవె యనిన