| |
గడగి [1]వధియింతు నని నీ
కొడు కరిగెడు; నిట్లు తలఁపఁ గూడునె బుద్ధిన్?
| 76
|
| క. |
[2]ధృతియుతులై సత్యవ్రత
రతులయి పదుమూఁడువత్సరంబులు ధర్మ
స్థితి సలిపి వార కడఁగెద
రతులపరాక్రములు మీఁద నాహవమునకున్.
| 77
|
| క. |
వనగతు లని వారలపైఁ
జని భంగముఁ బొంది రాఁగ సమకట్టెడు నీ
తనయుఁడు; గావున నీ వా
తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్.
| 78
|
| క. |
విను మేనును, నీవును, శాం
తనవుఁడు, విదురుండు నుండి తగునె యధర్మం
[3]బున నీయుపేక్ష? ననయం
బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?”
| 79
|
| వ. |
అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుం డై “నాకును, గాంధారికిని, భీష్మవిదుర
కృపద్రోణులకు ననిష్టంబైన దుష్టద్యూతంబు [4]ప్రవర్తించి దుర్బుద్ధియైన
దుర్యోధనుం బుత్త్రస్నేహంబున విడువ నోప” [5]ననిన ధృతరాష్ట్రునకుఁ గృష్ణద్వై
పాయనుం డి ట్లనియె.
| 80
|
ధృతరాష్ట్రునకు వ్యాసుఁ డింద్రసురభిసంవాదంబు సెప్పుట
| ఆ. |
“ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు
సుతులవలని నెయ్య మతిశయంబు;
ధనము లెంత గలిగినను సుతరహితుల
కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు.
| 81
|
| వ. |
తొల్లి సకలగోమాత యయిన సురభి [6]సురరాజు కడకుం బోయి కరుణంబుగా
నేడ్చిన దానిం జూచి సురపతి విస్మితుం డై “యి ట్లేల రోదనాకులితలోచన వయి
యున్నదాన; వెల్లవారికి లగ్గ కదా” యనిన నింద్రునకు సురభి యి ట్లనియె.
| 82
|
| క. |
నీ వజ్రము [7]రక్షింపఁగ
నా వారికి దక్కఁ ద్రిభువనంబులఁ గల భూ
తావలి కెల్లను గుశలమ;
దేవేంద్ర! జగత్త్రయప్రదీప! మహాత్మా!
| 83
|
| వ. |
దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబు లయినవానిం
బూన్చిన నవి దుర్వహభారవహనమహాలాంగలాకర్షణంబులయం దసమర్థంబు
లైన నడిచియుం, బొడిచియు, [8]ములుకోలలం గుట్టియు దుర్బలబలీవర్దంబుల జను
లు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద” ననిన సురభికి సురపతి యి ట్లనియె.
| 84
|
| క. |
“నీకు నపత్యశతంబు ల
నేకంబులు గలవు; వాని కేకాకృతి దుః
ఖాకులత సంభవింపదు;
శోకింపకు” మనిన సురభి సురపతి కనియెన్.
| 85
|
| వ. |
“దేవా! దీనాననంబు లయి దుర్బలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు
సూడ నోపుదు” ననిన నగి యింద్రుండు దానికిం గరుణించి వర్షంబునఁ దృణవర్థ
నంబు సేసి దుర్బలబలీవర్దనంబులకు బలంబు గావించె నని యింద్రసురభిసంవా
దంబు వేదంబుల యందు వినంబడుఁ గావున నీకు బుత్త్రస్నేహంబు సామా
|
|
- ↑ వధియింపఁగా నీ
- ↑ ధృతిఁ బాండుసుతులు సత్య, వ్రతులై; యురుసత్య, వ్రతులై
- ↑ బు నుపేక్షింపఁగ
- ↑ ప్రవర్తిల్లె
- ↑ నేమి సేయుదు ననిన
- ↑ సురపతియొద్దకుం బోయి కారుణ్యంబుగా
- ↑ పని సేయఁగ... జీ, వావలికి నెల్లఁ గుశలమ
- ↑ మునికోలలం బొడిచియు దిట్టియు