Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

పరమేష్ఠికల్పుఁడవు, ని
ర్భరభూరితపః[1]ప్రబోధపరిపూర్ణుఁడ; వ
చ్చెరువు భవన్మాహాత్మ్యము
సురమునిలోక ప్రణామశోభితచరణా!

⁠ 236


క.⁠

[2]అడరి నిఖిలాండకోటియుఁ
జెడునప్పుడుఁ జెడక నీవు జీవించెద; వే
ర్పడ జగములు గ్రమ్మఱఁ గలి
గెడు నప్పుడు సూచెదవు వికృతిరహితుఁడవై.

⁠ 237


చ.⁠

తొడరి చరాచరప్రతతితో జగ మింతయు వార్ధి దొట్టి న
ప్పుడు లలితాబ్జపీఠమునఁ బొల్చు చతుర్ముఖుఁ బద్మగర్భుఁ బెం
పడర [3]భజించి తీవు; జగదాదిజుఁ డైన ప్రభుండు నీయెడం
గడు ననురక్తుఁ డై యొసఁగెఁ గాదె మునీశ్వర! యీప్రభావమునన్.

⁠ 238


క.⁠

జగముల నెల్లను మ్రింగెడు
జగదంతకుమౌళి వామచరణం బిడఁ, బె
ల్లగు రోగజరాభరముం
దిగ విడువఁగఁ జెల్లె నీకుఁ ద్రిభువనవినుతా!

⁠ 239


వ.⁠

సకలచరాచరోత్పత్తిస్థితివిలయప్రకారంబులు నీకుం బెక్కుమాఱులు ప్రత్య
క్షంబు లయి కానంబడియుండుఁ; గావున నిన్నడిగెద; లోకంబులు విలయ
కాలంబున నెట్టి భంగి యగు? నెఱింగింపు” మనిన మార్కండేయుం డి ట్లనియె.

⁠ 240

మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ బ్రళయప్రకారంబు సెప్పుట

సీ.⁠

“శాశ్వతు, నఖిలభూతేశ్వరు, నవ్యయు,
                 నాదిదేవుని, జగదాదిజన్ము
నాదిమధ్యాంతవిచ్ఛేదవిదూరు, నా
                 శ్చర్య[4]కారణకర్మధుర్యు నజరు
నీ కిష్టసఖుఁడును నీకుఁ బ్రెగ్గడయునై
                 వెలుగొందుచున్న యీయలఘుపుణ్యు
లలితాదీర్ఘవిశాలసితేక్షణుం,
                 గనకవర్ణాంబరు, వనజనాభు

⁠


ఆ.⁠

నింద్రనీలవర్ణు నింద్రాదిసురగణ
వినుతుఁ గృష్ణుఁ గరము వినయ మొప్పఁ
దలఁచి యతనియాజ్ఞ దల నిడి యెఱిఁగింతు
వినుము వరుసతోడ మనుజనాథ!

⁠ 241


వ.⁠

కృతత్రేతాద్వాపరకలినామంబు లయినయుగంబులు నాలుగును బండ్రెండువేల
దివ్యవర్షంబులం బర్యవసితంబు లగు; నియ్యుగంబులు నాలుగు నొక్కమహా
యుగం బనం బరగు; మహాయుగసహస్రపర్యంతం బైనకాలంబు బ్రహ్మకు
నొక్కదినం బనబడు; దద్దివసావసానంబునందు శతవార్షికం బైనయనావృష్టి
దోషంబు ప్రవర్తిల్లు, నప్పుడు.

⁠ 242


ఆ.⁠

సప్తహయుఁడు మూర్తి[5]సప్తకం బొగిఁ దాల్చి
కరము వేఁడి మిగులు కరము లొప్ప
నదనదీజలములు నుదధిజలంబులుఁ
బీల్చి జగములెల్లఁ బ్రేల్చుఁ గడఁగి.

⁠ 243


చ.⁠

దినకరతిగ్మతేజము, ప్రదీప్తహుతాశనుఁ డయ్యుగాంతసం
జనితమహాసమీరణవశంబునఁ బేర్చి నగవ్రజంబుతో,
మనుజులతోడ, నిర్జరసమాజముతోడ, భుజంగపంక్తితో,

⁠
  1. ↑ ప్రభావపరిపూర్ణుఁడ వ, చ్చెరు వగు భవన్మహత్త్వము
  2. ↑ ఎడలి యఖిలాండ ... నెడక బ్రదికి
  3. ↑ భజించె దీవు
  4. ↑ కారణు ధర్మధుర్యు; కారణధర్మధుర్యు ... సఖుండు బ్రెగ్గడయు నై ... దలకొని యెఱిఁ
  5. ↑ సప్తకంబు ధరించి